Birbal Sahni Biography in Telugu | బీర్బల్ సాహ్ని

Birbal Sahni Biography in Telugu
 బీర్బల్ సాహ్ని – భారతదేశ పురాతన వృక్షశాస్త్ర పితామహుడు | Birbal Sahni Biography in Telugu

బీర్బల్ సాహ్ని భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, వృక్షశాస్త్రంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన గొప్ప పరిశోధకుడు. ముఖ్యంగా శిలాజ మొక్కలు (Fossil Plants) మరియు వాటి పరిణామక్రమం (Evolution) పై ఆయన చేసిన పరిశోధనలు భారతదేశ శాస్త్రీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి. ఈయన్ను “భారతదేశ పురాతన వృక్షశాస్త్ర పితామహుడు” గా పిలుస్తారు.

సేవలు : 

  • బీర్బల్ సాహ్ని వృక్షశాస్త్రం, భూగర్భశాస్త్రం, పురావస్తు శాస్త్రం వంటి అనేక విభాగాల్లో పరిశోధనలు చేశారు. 
  • శిలాజ మొక్కలపై విస్తృత పరిశోధనలు 
  • భారత ఉపఖండంలోని మొక్కల పరిణామక్రమాన్ని విశ్లేషణ
  • మొక్కల వర్గీకరణ (Plant Taxonomy) లో కొత్త మార్గదర్శకాలు
  • జీవావరణ శాస్త్రం (Ecology) మరియు జీవభూగోళ శాస్త్రం (Biogeography) రంగాలలో సేవలు

బాల్యం మరియు విద్యాభ్యాసం

  • బీర్బల్ సాహ్ని 1891 నవంబర్ 14న, షాపూర్‌లోని భేరా గ్రామంలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం) జన్మించారు.
  • ప్రాథమిక విద్య – సెంట్రల్ మోడల్ స్కూల్, లాహోర్
  • 1911లో – ప్రభుత్వ కళాశాల, లాహోర్ నుంచి నేచురల్ సైన్స్‌లో డిగ్రీ 
  • ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ ప్రయాణం
  • కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (ఇమ్మాన్యుయేల్ కాలేజ్)లో చదువు
  • 1914లో పట్టా పొందారు

పరిశోధనలు : 

బీర్బల్ సాహ్ని గారు ప్రఖ్యాత శిలాజ వృక్షశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎ.సి. స్టీవార్డ్ వద్ద ఇంటర్న్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు శిలాజ మొక్కలపై అపారమైన అవగాహన ఏర్పడింది. వారిద్దరూ కలిసి భారతీయ గోండ్వానా మొక్కలపై ముఖ్యమైన పరిశోధనలు చేశారు.1920లో భారత్‌కు తిరిగి వచ్చిన బీర్బల్ సాహ్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ఆచార్యుడిగా పని చేశారు.1921లో లక్నో యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగం తొలి అధిపతిగా నియమితులయ్యారు.మరణించే వరకు అక్కడే సేవలందించారు


Post a Comment

0 Comments