| విషయం |
వివరాలు |
| పూర్తి పేరు |
గెలీలియో గెలిలీ |
| పరిచయం |
గెలీలియో ఇటలీకి చెందిన ప్రముఖ గణిత, ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త. చలనం, యాంత్రిక శాస్త్రం, ఖగోళ రహస్యాలపై అనేక ప్రయోగాలు చేసి ఆధునిక విజ్ఞానశాస్త్రానికి పునాది వేశారు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈయన్ను “Father of Modern Science”గా పిలుస్తారు. |
| జననం |
15 ఫిబ్రవరి 1564 – పీసా నగరం, ఇటలీ |
| బాల్యం |
పేదరికం కారణంగా 11 సంవత్సరాల వరకు తండ్రి వద్దే విద్యాభ్యాసం చేశారు. చిన్న వయస్సులోనే ప్రకృతి విషయాలపై ఆసక్తి చూపించారు. |
| విద్యాభ్యాసం |
1575లో వల్లోంబ్రోసా అబ్బేలో చదువు ప్రారంభించారు. 1581లో పీసా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చేరారు. తరువాత మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిలాసఫీకి మారారు. |
| ప్రేరణ |
గణితవేత్త ఓస్టిలియో రిక్కీ ప్రభావంతో యూక్లిడ్, ఆర్కిమెడిస్ రచనలను అధ్యయనం చేశారు. |
| పరిశోధనలు |
అరిస్టాటిల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా అనేక ప్రయోగాలు చేసి భౌతిక శాస్త్రంలో కొత్త సూత్రాలను నిరూపించారు. |
| హైడ్రోస్టాటిక్స్ |
బరువు, సమతౌల్యత, నిర్దిష్ట గురుత్వాకర్షణపై పరిశోధనలు చేసి 1586లో “The Little Balance” గ్రంథాన్ని రచించారు. |
| టెలిస్కోప్ ఆవిష్కరణ |
1609లో మెరుగైన టెలిస్కోప్ నిర్మించారు. |
| ఖగోళ గమనికలు |
బృహస్పతి 4 ఉపగ్రహాలు, చంద్రుడి బిలాలు, సూర్య మచ్చలు, శుక్ర గ్రహ దశలను తొలిసారిగా గమనించారు. |
| విజ్ఞానశాస్త్రంపై ప్రభావం |
న్యూటన్ లాంటి శాస్త్రవేత్తలకు మార్గదర్శిగా నిలిచారు. గణితాన్ని విజ్ఞానశాస్త్రంలో ప్రవేశపెట్టి ఖచ్చితత్వాన్ని తీసుకొచ్చారు. |
| మరణం |
08 జనవరి 1642 |
0 Comments