General Science in Telugu | Human Heart Structure in Telugu | Blood Circulation System | మానవ గుండె నిర్మాణం & రక్త ప్రసరణ విధానం
| అంశం | వివరణ |
|---|---|
| రక్త ప్రసరణ వ్యవస్థ | శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు అందించి వ్యర్థాలను తొలగించే ముఖ్యమైన వ్యవస్థ. |
| వ్యవస్థ స్వభావం | ఇది ఒక సంవృత వ్యవస్థ. రక్తం రక్తనాళాల ద్వారానే ప్రవహిస్తుంది. |
| హృదయం స్థానం | రొమ్ము ఎముక వెనుక, రెండు ఊపిరితిత్తుల మధ్య, కొద్దిగా ఎడమ వైపు వాలి ఉంటుంది. |
| హృదయావరణ త్వచం | రెండు పొరల త్వచం గుండెను ఆవరించి ఉండి హృదయావరణ ద్రవంతో రక్షిస్తుంది. |
| కర్ణికలు | పైభాగంలోని రెండు గదులు. కుడి కర్ణిక చెడు రక్తాన్ని స్వీకరిస్తుంది. |
| జఠరికలు | కింద ఉన్న రెండు పెద్ద గదులు. కుడి జఠరిక ఊపిరితిత్తులకు, ఎడమ జఠరిక శరీర భాగాలకు రక్తం పంపుతుంది. |
| త్రిపత్ర కవాటం | కుడి కర్ణిక – కుడి జఠరిక మధ్య ఉంటుంది. |
| ద్విపత్ర కవాటం | ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక మధ్య ఉంటుంది. |
| పుపుస ధమని | కుడి జఠరిక నుండి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. |
| పుపుస సిరలు | మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు తీసుకెళ్తాయి. |
| మహాధమని | ఎడమ జఠరిక నుండి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపుతుంది. |
| రక్త ప్రసరణ విధానం | ద్వివలయ రక్త ప్రసరణ ఉంటుంది. |
| పుపుస ప్రసరణ | రక్తం ఊపిరితిత్తులకు వెళ్లి ఆక్సిజన్ గ్రహించి తిరిగి ఎడమ కర్ణికకు చేరుతుంది. |
| దైహిక ప్రసరణ | శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసి తిరిగి కుడి కర్ణికకు చేరుతుంది. |
| ప్రధాన విధులు |
• కణాలకు పోషకాలు చేరవేయడం • ఆక్సిజన్ సరఫరా • వ్యర్థాల తొలగింపు • శరీర ఉష్ణోగ్రత నియంత్రణ • రోగ నిరోధక శక్తి |

0 Comments