General Science : Lipids in Telugu – Definition, Types, Structure & Functions
| విషయం | వివరణ |
|---|---|
| లిపిడ్లు | లిపిడ్లు శక్తి నిల్వ పదార్థాలు. ఇవి జీవకణకవచ నిర్మాణంలో ప్రధాన భాగాలు. ఇవి కొవ్వు ఆమ్లాలు, ఫాస్పేట్లు, గ్లిసరాల్, ఆల్కహాల్, కార్బోహైడ్రేట్ల కలయికతో ఏర్పడతాయి. వెన్న, నెయ్యి, నూనెలు, కొలెస్ట్రాల్ లిపిడ్లే. |
| లిపిడ్ల వర్గీకరణ |
1) సరళ లిపిడ్లు 2) సంక్లిష్ట లిపిడ్లు 3) ఉత్పన్న లిపిడ్లు |
| సరళ లిపిడ్లు | ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లిసరాల్ కలయికతో ఏర్పడిన ఎస్టర్లను సరళ లిపిడ్లు అంటారు. |
| సంక్లిష్ట లిపిడ్లు | |
| సంక్లిష్ట లిపిడ్లు | ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిసరాల్‌తో పాటు ఫాస్పోరిక్ ఆమ్లం, నైట్రోజన్ బేసులు లేదా కార్బోహైడ్రేట్ల కలయికతో ఏర్పడినవి. వీటిని హెటిరో లిపిడ్లు అంటారు. |
| సంక్లిష్ట లిపిడ్ల రకాలు |
1) ఫాస్ఫోలిపిడ్లు 2) గ్లైకోలిపిడ్లు |
| ఫాస్ఫోలిపిడ్లు | |
| ఫాస్ఫోలిపిడ్ల ప్రాముఖ్యత | కణత్వచ నిర్మాణం, ద్విత్వచ నిర్మాణం, పదార్థాల రవాణా, శక్తి ఉత్పత్తి, మెదడు మరియు నాడీ కణజాలంలో కీలక పాత్ర పోషిస్తాయి. |
| ఫాస్ఫోలిపిడ్ల రకాలు |
1) గ్లిసరో ఫాస్ఫోలిపిడ్లు 2) స్ఫింగో ఫాస్ఫోలిపిడ్లు |
| గ్లిసరో ఫాస్ఫోలిపిడ్లు | గ్లిసరాల్ + రెండు ఫ్యాటీ ఆమ్లాలు + ఫాస్పోరిక్ ఆమ్లం + నైట్రోజన్ బేస్ కలయికతో ఏర్పడతాయి. |
| స్ఫింగో ఫాస్ఫోలిపిడ్లు | స్ఫింగోసిన్ + ఫ్యాటీ ఆమ్లం + ఫాస్పోరిక్ ఆమ్లం + ఆల్కహాల్ కలయికతో ఏర్పడతాయి. ఉదా: స్ఫింగోమైలిన్. |
| గ్లైకోలిపిడ్లు | |
| గ్లైకోలిపిడ్లు | ఫ్యాటీ ఆమ్లాలు మరియు కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. మెదడు, నాడీ కణజాలంలో విస్తృతంగా ఉంటాయి. కణ గుర్తింపు, రక్తపు గ్రూప్ గుర్తింపులో కీలక పాత్ర. |
| గ్లైకోలిపిడ్ల నిర్మాణం | స్ఫింగోసిన్ + ఫ్యాటీ ఆమ్లం + కార్బోహైడ్రేట్లు |
| ఉదాహరణలు | సెరెబ్రోసైడ్లు, గ్యాంగ్లియోసైడ్లు, గ్లోబోసైడ్లు |

0 Comments