General Science in Telugu | Solar System and Earth in Telugu
సౌర కుటుంబం – భూమి (Solar System – Earth)
సౌర కుటుంబ వివరాలు
| అంశం | వివరణ |
|---|---|
| సౌర కుటుంబం | సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు కలిపి సౌర కుటుంబం. |
| సూర్యుడు | మనకు అతి దగ్గర నక్షత్రం. భూమికంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. |
| ఉష్ణోగ్రత | ఉపరితలం – 6000°C, కేంద్రం – 1 లక్ష °C. |
| పాలపుంత | కోట్ల నక్షత్రాల సముదాయాన్ని పాలపుంత / ఆకాశగంగ అంటారు. |
గ్రహాల క్రమం
| గ్రహాలు | క్రమం |
|---|---|
| బుధుడు | 1వ గ్రహం |
| శుక్రుడు | 2వ గ్రహం |
| భూమి | 3వ గ్రహం |
| కుజుడు | 4వ గ్రహం |
| గురుడు | 5వ గ్రహం |
| శని | 6వ గ్రహం |
| యురేనస్ | 7వ గ్రహం |
| నెప్ట్యూన్ | 8వ గ్రహం |
అంతర్గ్రహాలు & బాహ్యగ్రహాలు
| రకం | గ్రహాలు |
|---|---|
| అంతర్గ్రహాలు | బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు |
| బాహ్యగ్రహాలు | గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ |
భూమి ముఖ్య వివరాలు
| అంశం | వివరణ |
|---|---|
| సూర్యుడి నుండి దూరం | 149.5 మిలియన్ కి.మీ |
| సూర్యకాంతి సమయం | 8 నిమిషాలు |
| భూమి ఉపగ్రహం | చంద్రుడు |
| భూమి – చంద్రుడి దూరం | 3,84,365 కి.మీ |
భూభ్రమణం
| అంశం | వివరణ |
|---|---|
| అర్థం | భూమి తన అక్షంపై తిరగడం. |
| వేగం | 1610 కి.మీ / గంట |
| కాలం | 24 గంటలు = ఒక రోజు |
| ఫలితాలు | పగలు–రాత్రి, సముద్ర పోటుపాట్లు, పవన మార్పులు. |
భూ పరిభ్రమణం
| అంశం | వివరణ |
|---|---|
| అర్థం | భూమి సూర్యుడి చుట్టూ తిరగడం. |
| కాలం | 365¼ రోజులు |
| లీపు సంవత్సరం | 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు |
| ఫలితాలు | రుతువులు, పగలు-రాత్రి తేడాలు |
పరిహేళి – అపహేళి
| స్థానం | దూరం | తేదీ |
|---|---|---|
| పరిహేళి | 147 మిలియన్ కి.మీ | జనవరి 3 |
| అపహేళి | 152 మిలియన్ కి.మీ | జూలై 4 |
చంద్రుని చలనము
| అంశం | వివరణ |
|---|---|
| తిరుగుదల కాలం | 27⅓ రోజులు |
| ప్రత్యేకత | మనకు చంద్రుడి ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. |

0 Comments