Solar System : Earth Perihelion Aphelion | భూమి పరిహేళి – అపహేళి

Solar System : Earth Perihelion Aphelion
  
Solar System - Earth Perihelion Aphelion Telugu | General Science

భూమి పరిహేళి – అపహేళి

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమణం చేస్తూ ఉండే సమయంలో, భూమి కొన్నిసార్లు సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో చాలా దూరంగా ఉంటుంది.

 పరిహేళి (Perihelion) :

సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే భూమి స్థానాన్ని ‘పరిహేళి (Perihelion)’ అని అంటారు. ఈ సమయంలో భూమి – సూర్యుడి మధ్య కనిష్ట దూరం సుమారు 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. పరిహేళి ప్రతి సంవత్సరం సాధారణంగా జనవరి 3వ తేదీన సంభవిస్తుంది.

అపహేళి (Aphelion) : 

అలాగే, భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉండే స్థితిని ‘అపహేళి (Aphelion)’ అంటారు. ఈ సమయంలో భూమి – సూర్యుడి మధ్య గరిష్ట దూరం సుమారు 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అపహేళి సాధారణంగా జూలై 4వ తేదీన ఏర్పడుతుంది.

 

 


Also Read :




Also Read :


 


Post a Comment

0 Comments