Stephen Hawking Biography in Telugu | స్టీఫెన్ హాకింగ్

Stephen Hawking Biography in Telugu
 Stephen Hawking Biography in Telugu 

 స్టీఫెన్ హాకింగ్ 

స్టీఫెన్ విలియం హాకింగ్ (Stephen William Hawking) ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు), కాస్మాలజీ (విశ్వ సృష్టిశాస్త్రం) వంటి విభాగాల్లో ఆయన చేసిన పరిశోధనలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కొత్త దిశను చూపాయి.అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లిరోసిస్ (ALS) అనే అరుదైన వ్యాధి కారణంగా ఆయన శరీరం క్రమంగా చచ్చుబడి, పూర్తి చక్రాల కూర్చికే పరిమితమైనప్పటికీ, తన అపారమైన సంకల్పబలంతో విశ్వ రహస్యాలను అన్వేషించడం ఆపలేదు. విజ్ఞాన శాస్త్ర రంగంలో ఆయనను అత్యంత తెలివైన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరిగా పరిగణిస్తారు.

స్టీఫెన్ హాకింగ్ బాల్యం :

స్టీఫెన్ హాకింగ్ గారు 1942 జనవరి 8న ఆక్స్‌ఫర్డ్ (ఇంగ్లాండ్) లో జన్మించారు. ఆయన పాఠశాల విద్యను లండన్‌లోని బైరన్ హౌస్ స్కూల్‌లో ప్రారంభించారు.1959లో హాకింగ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్‌లో చేరి భౌతిక మరియు రసాయన శాస్త్రాలను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు విశ్వ సృష్టిపై గాఢమైన ఆసక్తి ఉండేది.

ఉన్నత విద్య :

1962లో స్టీఫెన్ హాకింగ్ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజ్‌లో చేరారు. ఈ సమయంలోనే ఆయనకు ALS వ్యాధి నిర్ధారణ అయింది. ఈ వ్యాధి కారణంగా ఆయన శరీర కదలికలు క్రమంగా తగ్గిపోయాయి. కొంతకాలానికి గొంతు మూగబోయి, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.అయినప్పటికీ, ఆయన వెనుకడుగు వేయలేదు. తన దృష్టిని పూర్తిగా పరిశోధనలపైనే కేంద్రీకరించారు.

స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు :

హాకింగ్ విశ్వం ఎలా ఏర్పడింది అనే అంశంపై విస్తృత అధ్యయనం చేశారు.
1966లో “Properties of Expanding Universes” అనే థీసిస్‌తో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి పీహచ్‌డీ పట్టా పొందారు.

ఈ పరిశోధనలో ఆయన:

  • బిగ్ బ్యాంగ్ థియరీ
  • జనరల్ రిలేటివిటీ
  • విశ్వం ఒకే ఏకత్వం నుండి ఎలా విస్తరించిందో వివరించారు.
  • ఈ సిద్ధాంతాలు ఆధునిక కాస్మాలజీకి పునాది వేశాయి.

స్టీఫెన్‌ హాకింగ్‌ 14 మార్చి 2018 కేంబ్రిడ్జిలో మరణించాడు. స్టీఫెన్ హాకింగ్ జీవితం ఒక గొప్ప పోరాటానికి ప్రతీక. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ, తన జ్ఞానశక్తితో విశ్వ రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు. ఆయన జీవితం ప్రపంచ యువతకు ఒక గొప్ప ప్రేరణ.

Post a Comment

0 Comments