ఎర్నెస్ట్ హెకెల్
Ernst Haeckel Biography in Telugu
- ఎర్నెస్ట్ హెకెల్ జర్మనీకి చెందిన ప్రముఖ జంతు మరియు జీవ శాస్త్రవేత్త.
- పూర్తి పేరు: ఎర్నెస్ట్ హెన్రిచ్ ఫిలిప్ ఆగస్ట్ హెకెల్.
- జననం: 16 ఫిబ్రవరి 1834, పోట్స్‌డామ్, జర్మనీ.
- మరణం: 9 ఆగస్టు 1919.
విద్యాభ్యాసం
- 1843లో మెర్సెబర్గ్‌లోని డోమ్ జిమ్నాసియం పాఠశాలలో చేరారు.
- 1852లో వర్జ్‌బర్గ్ యూనివర్సిటీలో వైద్య శాస్త్రం అభ్యసించారు.
- 1854లో బెర్లిన్ యూనివర్సిటీలో వైద్య విద్యను కొనసాగించారు.
పరిశోధనలు & కృషి
- జువాలజీ (జంతుశాస్త్రం) రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
- భూమిపై అప్పటివరకు గుర్తించని అనేక కొత్త జాతులను కనుగొని, వాటికి పేర్లు పెట్టి వంశానుక్రమాన్ని మ్యాప్ చేశారు.
- జీవశాస్త్రంలో అనేక కొత్త పదాలను ప్రవేశపెట్టారు. ముఖ్యమైనవి:
జీవావరణ శాస్త్రం (Ecology)
ఫైలం (Phylum)
ఓంటోజెని (Ontogeny)
- 1859–1866 మధ్య కాలంలో ఈ క్రింది ఫైలాలపై పరిశోధనలు చేశారు:
రేడియోలేరియన్లు
ఫొరిఫెరాన్స్ (స్పాంజ్‌లు)
అనెలిడ్స్ (సెగ్మెంటెడ్ వార్మ్స్)
- మధ్యధరా సముద్ర ప్రాంతంలో పర్యటించి సుమారు 700 కొత్త రేడియోలేరియన్ జాతులను గుర్తించి పేర్లు పెట్టారు.
సిద్ధాంతాలు
- 1866లో బయోజెనెటిక్ లాను ప్రతిపాదించారు.
- "ఓంటోజెని అనేది ఫైలోజెని యొక్క సంక్షిప్త రూపం" అని పేర్కొన్నారు.
- డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాలను బలంగా విశ్వసించి, వాటి ఆధారంగా తన పరిశోధనలు కొనసాగించారు.

0 Comments