Indian Polity : Indian Constitution | భారత రాజ్యాంగం ఇతర దేశాల నుండి గ్రహించిన అంశాలు

indian polity

Indian Constitution | భారత రాజ్యాంగం | Indian Polity


దేశం / మూలం భారత రాజ్యాంగం గ్రహించిన అంశాలు
1935 భారత ప్రభుత్వ చట్టం కేంద్ర–రాష్ట్ర సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ కోర్టు, రాష్ట్రపతి పాలన, గవర్నర్ పదవి, గవర్నర్ విచక్షణాధికారాలు, పబ్లిక్ సర్వీస్ కమీషన్లు, ఇతర పరిపాలన అంశాలు
బ్రిటన్ రాజ్యాంగం పార్లమెంటరీ / కేబినెట్ పాలనా విధానం, ద్విసభా పద్ధతి, శాసన నిర్మాణ విధానం, శాసన సభ్యుల హక్కులు, స్పీకర్ & డిప్యూటీ స్పీకర్ పదవులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, రిట్లు జారీ విధానం
అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, స్వతంత్ర న్యాయశాఖ, ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతి పై మహాభియోగ విధానం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల ఆమోదం
కెనడా బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ నియామక విధానం, అవశిష్ట అధికారాలు కేంద్రానికి, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే అధికారం (ఆర్టికల్ 143)
ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలు (Directive Principles), రాష్ట్రపతి ఎన్నికలో నిష్పత్తి ప్రాతినిధ్యం, ఓటు బదిలీ విధానం, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం
వైమార్ రిపబ్లిక్ (జర్మనీ) జాతీయ అత్యవసర పరిస్థితి నిబంధనలు, ప్రాథమిక హక్కులను నిలిపివేయగల అధికారం
ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా (Concurrent List), ఉభయ సభల సంయుక్త సమావేశం, వాణిజ్య & వ్యాపార స్వేచ్ఛ, అంతరాష్ట్ర వాణిజ్య నియంత్రణ
దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం
ఫ్రాన్స్ గణతంత్ర విధానం, స్వేచ్ఛ–సమానత్వం–సౌభ్రాతృత్వం సూత్రాలు, తాత్కాలిక సభాధ్యక్షుల వ్యవస్థ
రష్యా (మాజీ సోవియట్ యూనియన్) ప్రాథమిక విధులు (Fundamental Duties), దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు
జపాన్ చట్టం నిర్దేశించిన విధంగా విధాన ప్రక్రియ (Procedure Established by Law)
స్విట్జర్లాండ్ మంత్రిమండలి సమిష్టి బాధ్యత సూత్రం

Post a Comment

0 Comments