Human Digestive System in Telugu | మానవ జీర్ణవ్యవస్థ | General Science in Telugu

Human Digestive System in Telugu

 మానవ జీర్ణవ్యవస్థ 

Human Digestive System in Telugu – Diagram, Parts and Digestion Process 

1. జీర్ణక్రియ (Digestion)

  • మనం తీసుకునే ఆహారంలోని సంక్లిష్ట అణువులను సరళ అణువులుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు.ఈ ప్రక్రియ జీర్ణవ్యవస్థలో జరుగుతుంద.జీర్ణవ్యవస్థలో జీర్ణనాళం అనుబంధ జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణరసాలలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను నిర్వహిస్తాయి.

2. జీర్ణనాళం (Alimentary Canal)

  •  జీర్ణనాళం నోటితో మొదలై పాయువుతో ముగుస్తుంది.

  • జీర్ణనాళంలోని భాగాలు:

  1. నోరు

  2. నోటికుహరం

  3. గ్రసని

  4. ఆహారవాహిక

  5. జీర్ణాశయం

  6. చిన్నపేగు

    • అంత్రమూలం (Duodenum)
    • జెజునం (Jejunum)
    • ఇలియం (Ileum)
  7. పెద్దపేగు

  8. పురుషనాళం

  9. పాయువు

    • చిన్నపేగు మరియు పెద్దపేగు మధ్య ఉండూకం (Appendix) అనే అవశేష అవయవం ఉంటుంది.

జీర్ణక్రియ జరిగే ముఖ్య ప్రాంతాలు

  •  నోటికుహరం
  • జీర్ణాశయం
  • అంత్రమూలం
  • జెజునం

శోషణ

  •  ఇలియం లో జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది.

వ్యర్థాల విసర్జన

  •  జీర్ణంకాని ఆహారం పెద్దపేగు ద్వారా మలంగా మారి పాయువు ద్వారా బయటకు వెళుతుంది.

3. నోటి కుహరంలో జీర్ణక్రియ : 

  • నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి.
  • ఇవి లాలాజలం (Saliva) విడుదల చేస్తాయి.
  • లాలాజలం స్వల్ప ఆమ్లస్థితిలో ఉంటుంది.

లాలాజలంలోని ఎంజైమ్

  •  అమైలేజ్ (Amylase)

పని

  • స్టార్చ్ → మాల్టోజ్ గా మారుస్తుంది.

ఇతర అంశాలు

  •  ఆహారం బోలస్ (Bolus) అనే ముద్దగా మారుతుంది.
  •  పెరిస్టాల్సిస్ కదలికల ద్వారా ఆహారం జీర్ణాశయానికి చేరుతుంది.

4. జీర్ణాశయంలో జీర్ణక్రియ

  •  జీర్ణాశయంలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని విడుదల చేస్తాయి.

జఠర రసంలోని పదార్థాలు

  • హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl)
  •  పెప్సిన్ (Pepsin)

పని

  •  పెప్సిన్
  •  ప్రోటీన్లు → పెప్టోన్స్ / ప్రోటియేస్‌లుగా విచ్ఛిన్నం చేస్తుంది.

5. ఆంత్రమూలంలో జీర్ణక్రియ (Duodenum)

  • జీర్ణాశయం నుండి వచ్చిన ఆహారం ఆమ్లస్థితిలో ఉంటుంది.
  •  ఈ భాగంలోకి
  •  కాలేయం నుండి పైత్యరసం (Bile juice)
  •  క్లోమం నుండి క్లోమరసం (Pancreatic juice) వస్తాయి.

పైత్యరసం లక్షణాలు

 ఎంజైమ్‌లు ఉండవు.

  • పైత్యరస వర్ణదాలు:
  • బైలీరూబిన్ 
  •  బైలీవర్దిన్

పైత్యరస లవణాలు

  •  సోడియం టారోక్లోరేట్
  •  పొటాషియం గ్లైకోక్లోరేట్

పని

  • కొవ్వుల ఎమల్సిఫికేషన్ చేయడం.

క్లోమరసంలోని ఎంజైమ్‌లు

  1. అమిలోప్సిన్

    •  స్టార్చ్ → మాల్టోజ్
  2. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్

    •  ప్రోటీన్లు → పెప్టైడ్లు
  3. క్లోమరస లైపేజ్

     కొవ్వులు → కొవ్వు ఆమ్లాలు + గ్లిసరాల్

6. జెజునంలో జీర్ణక్రియ

  •  జీర్ణక్రియ జెజునం లో పూర్తి అవుతుంది.
  •  ఇక్కడ ఆంత్రగ్రంథులు ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయి.

ఆంత్రరసంలోని ఎంజైమ్‌లు

  1. మాల్టేజ్

    •  మాల్టోజ్ → 2 గ్లూకోజ్
  2. లాక్టేజ్

    •  లాక్టోజ్ → గ్లూకోజ్ + గాలక్టోజ్
  3. సుక్రేజ్

    •  సుక్రోజ్ → గ్లూకోజ్ + ఫ్రక్టోజ్
  4. ఎరిప్సిన్

    •  పెప్టైడ్లు → అమినో ఆమ్లాలు
  5. ఆంత్రలైపేజ్

    •  డైగ్లిసరైడ్స్ → కొవ్వు ఆమ్లాలు + గ్లిసరాల్

7. ఇలియంలో శోషణ :

  •  జీర్ణమైన ఆహారం ఇలియం లో రక్తంలోకి శోషించబడుతుంది.
  •  ఇలియం ఉపరితలంలో సూక్ష్మచూషకాలు (Villi) ఉంటాయి.
  •  ఇవి శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి.

8. వ్యర్థాల విసర్జన :

 జీర్ణంకాని పదార్థాలు పెద్దపేగులోకి వెళ్తాయి.  అవి మలంగా మారి పాయువు ద్వారా బయటకు వెళ్తాయి.


Post a Comment

0 Comments