9వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం.. ‘‘యువికా’’ యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌ | ISRO YUVIKA 2026 Apply Online, Last Date, Eligibility

 

ISRO YUVIKA 2025 Apply Online, Last Date, Eligibility

యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ‘‘యువికా’’ ప్రోగ్రామ్‌
9వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం .. !

‘‘యువికా’’ యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్కూల్ విద్యార్థుల కోసం రూపోందించిన ప్రత్యేక కార్యక్రమం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువ విజ్ఞాన కార్యక్రమ్ (యువికా). పిల్లల ఆలోచనలకు మెరుగులు దిద్దడం ద్వారా భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ యువికా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అంతరిక్ష సాంకేతిక, అంతరిక్షశాస్త్రం, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానం అందించనుంది. 
    ఈ యువికా కార్యక్రమం ద్వారా ఎంపికైన విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూర్, షిల్లాంగ్, తిరువనంతపురం తదితర కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇక్కడ విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చావేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తారు.  

➺ ప్రోగ్రామ్‌ పేరు :

  •  ‘‘యువ విజ్ఞాన కార్యక్రమ్‌ (యువికా)’’

నిర్వహించు సంస్థ :

  • భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)

ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు ?

  • 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 

ఎంపిక ఎలా ఉంటుంది ?

  • 8వ తరగతిలో వచ్చిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.
  • జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వ్యాస రచన, వకృత్వ పోటీల్లో ప్రతిభకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • స్పేస్‌, సైన్స్‌ క్లబ్‌లో నమోదై ఉంటే 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగాల్లో ఉంటే 5 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఎంపికైతే ?

  • విద్యార్థితో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు.
  • దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
  • స్పేస్‌ సెంటర్లకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు.
  • శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చలు, ప్రయోగశాలల సందర్శన, అంతరిక్ష శాస్త్రం, రాకేట్‌ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 మార్చి 2026 

Post a Comment

0 Comments