అర్ధ లోహాలు అంటే ఏమిటి? గుణాలు & ఉపయోగాలు | Metalloids in Telugu – Properties, Examples & Uses

What are Metalloids


What are Metalloids? | General Science in Telugu


విషయం వివరణ
అర్ధ లోహాలు (Metalloids) లోహాలుగా మరియు అలోహాలుగా ప్రవర్తించే మూలకాలను అర్ధ లోహాలు అంటారు. వీటి ధర్మాలు లోహాలు మరియు అలోహాల మధ్యస్థంగా ఉంటాయి.

ఉదాహరణలు: బోరాన్ (B), సిలికాన్ (Si), జెర్మేనియం (Ge), ఆర్సినిక్ (As), యాంటీమోనీ (Sb), టెలూరియం (Te), పొలోనియం (Po)
అర్ధ లోహాల ఉపయోగాలు
బోరాన్ (B) బోరోసిలికేట్ గాజు తయారీ, డిటర్జెంట్లు, శుభ్రపరిచే పదార్థాలు, వ్యవసాయంలో మొక్కలకు సూక్ష్మపోషకంగా ఉపయోగిస్తారు.
సిలికాన్ (Si) కంప్యూటర్ చిప్స్, ట్రాన్సిస్టర్లు, డయోడ్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సోలార్ ప్యానెల్స్, గాజు, సిరామిక్స్, లూబ్రికెంట్స్, సీలెంట్స్ తయారీలో ఉపయోగిస్తారు.
జెర్మేనియం (Ge) సెమీకండక్టర్ పరికరాలు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, ఇన్‌ఫ్రారెడ్ పరికరాల్లో ఉపయోగిస్తారు.
ఆర్సినిక్ (As) పురుగు మందులు, సెమీకండక్టర్ తయారీ, కొన్ని మిశ్రమ లోహాల్లో ఉపయోగిస్తారు.
యాంటీమోనీ (Sb) బ్యాటరీలు, ప్లేమ్ రిటార్డెంట్ పదార్థాలు, మిశ్రమ లోహాల బలం పెంచడంలో ఉపయోగిస్తారు.
టెలూరియం (Te) సోలార్ ప్యానెల్స్, థర్మోఎలక్ట్రిక్ పరికరాలు, మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు.
పొలోనియం (Po) అరుదైన రేడియోధార్మిక మూలకం. అణుపరిశ్రమ, థర్మోఎలక్ట్రిక్ పరికరాలు, అణుభౌతిక శాస్త్ర పరిశోధనల్లో ఉపయోగిస్తారు.

Post a Comment

0 Comments