జడ వాయువులు అంటే ఏమిటి? గుణాలు & ఉపయోగాలు
| విషయం | వివరణ |
|---|---|
| జడ వాయువులు (Noble Gases) |
హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), గ్జినాన్ (Xe), రేడాన్ (Rn)
వంటి మూలకాలు రసాయన చర్యాశీలత చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని జడవాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు అంటారు.
• చాలా తక్కువ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి • రేడాన్ మినహా మిగతావి వాతావరణంలో లభిస్తాయి • ఆధునిక ఆవర్తన పట్టికలో 18వ గ్రూపుకు చెందినవి |
| జడ వాయువుల ఉపయోగాలు | |
| హీలియం (He) | గాలి కన్నా తేలికగా ఉండటం వల్ల వాతావరణ పరిశోధన బెలూన్లు, విమాన టైర్లలో ఉపయోగిస్తారు. రాకెట్ ఇంధన ట్యాంకులను శుభ్రం చేయడానికి కూడా వాడతారు. |
| నియాన్ (Ne) | సైన్ లైట్లు, హై వోల్టేజ్ సూచిక లైట్లు, గ్లో ల్యాంపుల్లో ఉపయోగిస్తారు. |
| ఆర్గాన్ (Ar) | ప్రయోగశాలల్లో జడ వాతావరణం కల్పించడానికి, విద్యుత్ బల్బుల్లో ఉపయోగిస్తారు. |
| క్రిప్టాన్ (Kr) | ప్రత్యేక విద్యుత్ దీపాలు, హై పవర్ లేజర్‌లలో ఉపయోగిస్తారు. |
| గ్జినాన్ (Xe) | కెమెరా ఫ్లాష్ ల్యాంపులు, హై ఇంటెన్సిటీ లైట్లు, లేజర్‌లలో ఉపయోగిస్తారు. |
| రేడాన్ (Rn) | గతంలో క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ కోసం ఉపయోగించేవారు. |

0 Comments