What Are Non-Metals? Properties, Examples & Uses Explained | అలోహాలు (Non-Metals) ధర్మాలు, లక్షణాలు, ఉపయోగాలు

Non-Metals

అలోహాల లక్షణాలు మరియు ఉపయోగాలు


అలోహాలు (Non-Metals)

విభాగం వివరణ
వ్యాఖ్యానం మృదువుగా ఉండి ద్యుతిగుణం, తాంతవత, స్థరనీయత, విద్యుద్వాహకత, ఉష్ణవాహకత లేని పదార్థాలను అలోహాలు అంటారు. ఇవి సులభంగా ఎలక్ట్రాన్‌లను గ్రహిస్తాయి. ఉదా: ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్, క్లోరిన్, అయోడిన్, సల్ఫర్, ఫ్లోరిన్.
ధర్మాలు అలోహాలు నీటితో లేదా ఆమ్లాలతో సాధారణంగా చర్య జరపవు. ఆక్సిజన్‌తో చర్య చేసి ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి. అలోహ ఆక్సైడ్‌లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి మరియు నీలి లిట్మస్‌ను ఎరుపుగా మారుస్తాయి.

ఉదాహరణలు:
SO₂ + H₂O → H₂SO₃ (సల్ఫ్యూరస్ ఆమ్లం)
CO₂ + H₂O → H₂CO₃ (కార్బోనిక్ ఆమ్లం)
ఆక్సిజన్ ఉపయోగాలు దహన దోహదకారి. కృత్రిమ శ్వాసలో ఉపయోగిస్తారు. ఆక్సి-అసిటిలీన్ గ్యాస్ వెల్డింగ్‌లో వాడతారు. రాకెట్లలో ద్రవరూప ఇంధనంగా ఉపయోగిస్తారు.
హైడ్రోజన్ ఉపయోగాలు అత్యంత తేలికైన వాయువు. బెలూన్లలో నింపుతారు. నూనెల హైడ్రోజనీకరణలో మరియు రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
నైట్రోజన్ ఉపయోగాలు గాలిలో అధికంగా ఉంటుంది. అమ్మోనియా, యూరియా తయారీలో, పేలుడు పదార్థాలలో ఉపయోగిస్తారు. ద్రవ నైట్రోజన్‌లో జీవ పదార్థాలను నిల్వ చేస్తారు.
కార్బన్ ఉపయోగాలు నీటి శుద్ధిలో, ఇంధనంగా, గ్రాఫైట్ విద్యుద్వాహకంగా, వజ్రం ఆభరణాల్లో ఉపయోగిస్తారు.
ఫాస్ఫరస్ ఉపయోగాలు అగ్గిపెట్టెలలో, మిశ్రమ లోహాల్లో, ఎలుకల నివారణలో ఉపయోగిస్తారు.
క్లోరిన్ ఉపయోగాలు నీటి శుద్ధిలో, బ్లీచింగ్ పౌడర్, క్లోరోఫాం తయారీలో ఉపయోగిస్తారు.
అయోడిన్ ఉపయోగాలు థైరాయిడ్ పనితీరుకు అవసరం. టింక్చర్ ద్రావణంలో మరియు పిండిపదార్థాల పరీక్షలో ఉపయోగిస్తారు.
సల్ఫర్ ఉపయోగాలు సల్ఫ్యూరిక్ ఆమ్లం, టపాకాలు, యాంటీసెప్టిక్ మందులు, రబ్బరు వల్కనైజేషన్‌లో ఉపయోగిస్తారు.
ఫ్లోరిన్ ఉపయోగాలు టెఫ్లాన్ తయారీ, టూత్‌పేస్ట్, ఫ్రిజ్, ఏసీ, యురేనియం శుద్ధిలో ఉపయోగిస్తారు.

Post a Comment

0 Comments