ఎలక్టోరల్ బాండ్లు (Electoral Bonds) అంటే ఏమిటి?
భారతదేశంలో రాజకీయ పార్టీలకు అందే విరాళాల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు రాజకీయ పార్టీలకు చట్టబద్ధంగా విరాళాలు అందించవచ్చు.
ఎలక్టోరల్ బాండ్లు ఎలా పనిచేస్తాయి?
విరాళం ఇవ్వాలనుకునే వ్యక్తులు లేదా సంస్థలు అధీకృత బ్యాంకులో నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తారు. అనంతరం ఆ బాండ్లను తమకు నచ్చిన రాజకీయ పార్టీకి అందజేస్తారు. సంబంధిత పార్టీ ఆ బాండ్లను బ్యాంకులో రిడీమ్ చేసుకొని నగదును పొందుతుంది.
ఎలక్టోరల్ బాండ్ల ముఖ్యాంశాలు
- ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే అధీకృత బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).
- బాండ్ల కొనుగోలుపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.
- బాండ్ల చెల్లుబాటు కాలం 15 రోజులు మాత్రమే.
- బాండ్లపై దాత పేరు లేదా ఇతర వివరాలు ఉండవు.
- ఇవి బేరర్ బ్యాంకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ (Bearer Banking Instrument) గా పరిగణించబడతాయి.
- ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు వీటి విక్రయం జరుగుతుంది.
- భారత పౌరులు మరియు భారతదేశంలో నమోదైన సంస్థలు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలవు.
- ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థలకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి.

0 Comments