Vidyarthi Vigyan Manthan (VVM) Scholarship
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM)
పరిశోధనలు, శాస్త్రీయ ఆలోచనలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు విజ్ఞాన భారతి (VIBHA), విజ్ఞాన ప్రసార్, NCERT సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM) ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు రూ.200 చెల్లించి సెప్టెంబర్ 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఈ పరీక్షలో 6–8 తరగతుల విద్యార్థులు జూనియర్, 9–11 తరగతుల విద్యార్థులు సీనియర్ విభాగాల్లో పాల్గొనవచ్చు.
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (Vigyan Manthan) 2026-27 ప్రతిభా పరీక్ష
| విషయం | వివరాలు |
|---|---|
| పరీక్ష పేరు | విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (Vigyan Manthan) 2026-27 |
| నిర్వహణ సంస్థలు | విజ్ఞాన భారతి (VIBHA), విజ్ఞాన ప్రసార్, NCERT సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. |
| లక్ష్యం |
|
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. |
| దరఖాస్తు రుసుము | రూ. 200/- |
| చివరి తేదీ | 30 సెప్టెంబర్ 2026 |
| పరీక్ష స్థాయిలు |
|
| పరీక్ష తేదీ | లెవల్-1 పరీక్షలు అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. |
| విభాగాలు |
|
| పరీక్ష భాషలు | తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. |
| పరీక్ష రాయవచ్చు |
|
| ప్రతిభావంతులకు | మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు. |
| జాతీయ స్థాయి విజేతలకు | ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, DRDO, CSIR వంటి పరిశోధనా సంస్థల్లో మూడు వారాల ప్రత్యేక శిక్షణ మరియు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. |
| పాఠశాల స్థాయి ఎంపిక | 18 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. |
| జిల్లా స్థాయి ఎంపిక | ప్రతి పాఠ్యాంశానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. |
| రాష్ట్ర స్థాయికి ఎంపిక | 20 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. |
| రాష్ట్ర స్థాయి ఉపకార వేతనాలు |
|
| జాతీయ స్థాయి నగదు బహుమతులు |
|
| ప్రత్యేక స్కాలర్‌షిప్ | భాస్కర స్కాలర్‌షిప్ కింద ఒక సంవత్సరం పాటు నెలకు రూ.2,000 చొప్పున అదనపు ఉపకార వేతనం అందజేస్తారు. |

0 Comments