మరాఠా సామ్రాజ్యం MCQs in Telugu - Part - 1
☛ Question No. 1
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?
A) శంభాజీ
B) శివాజీ
C) బాలాజీ విశ్వనాథ్
D) ఔరంగజేబ్
Answer : B) శివాజీ
☛ Question No. 2
శివాజీ ఏ సంవత్సరంలో జన్మించాడు?
A) 1627
B) 1630
C) 1615
D) 1640
Answer : A) 1627
☛ Question No. 3
శివాజీ తండ్రి పేరు ఏమిటి?
A) జైసింగ్
B) అప్జల్ ఖాన్
C) షాజీ భోంస్లే
D) షాయిస్తఖాన్
Answer : C) షాజీ భోంస్లే
☛ Question No. 4
శివాజీ తల్లి ఎవరు?
A) రాణి దుర్గావతి
B) జహానారా
C) నూర్జహాన్
D) జిజియాబాయి
Answer : D) జిజియాబాయి
☛ Question No. 5
శివాజీ జన్మించిన దుర్గం ఏది?
A) శివనేర్ దుర్గం
B) రాయగడ్
C) సింహగడ్
D) పురంధర్
Answer : A) శివనేర్ దుర్గం
☛ Question No. 6
శివాజీకి శిక్షణ ఇచ్చిన గురువు ఎవరు?
A) తుకారాం
B) దాదాజీ కొండదేవ్
C) సమర్థ రామదాస్
D) గోపీనాథ్
Answer : B) దాదాజీ కొండదేవ్
☛ Question No. 7
దాదాజీ కొండదేవ్ ఎప్పుడు మరణించాడు?
A) 1645
B) 1650
C) 1647
D) 1655
Answer : C) 1647
☛ Question No. 8
శివాజీకి మతాభిమానం కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించినది ఎవరు?
A) షాయిస్తఖాన్
B) అప్జల్ ఖాన్
C) షాజీ భోంస్లే
D) జిజియాబాయి
Answer : D) జిజియాబాయి
☛ Question No. 9
శివాజీకి మద్దతుగా నిలిచిన తెగ ఏది?
A) మావళీలు
B) రాజ్‌పుత్రులు
C) జాట్లు
D) సిక్కులు
Answer : A) మావళీలు
☛ Question No. 10
శివాజీ మొదట ఆక్రమించిన కోట ఏది?
A) రాయగడ్
B) తోరణ దుర్గం
C) పురంధర్
D) సింహగడ్
Answer : B) తోరణ దుర్గం
☛ Question No. 11
శివాజీ తోరణ దుర్గాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించాడు?
A) 1656
B) 1646
C) 1663
D) 1659
Answer : B) 1646
☛ Question No. 12
శివాజీ తన ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసిన కోట ఏది?
A) తోరణ
B) సింహగడ్
C) రాయగడ్
D) ప్రతాప్‌గడ్
Answer : C) రాయగడ్
☛ Question No. 13
శివాజీ తండ్రిని బందీగా పట్టుకున్న రాజ్యం ఏది?
A) మొగల్ రాజ్యం
B) గోల్కొండ
C) అహ్మద్‌నగర్
D) బీజాపూర్
Answer : D) బీజాపూర్
☛ Question No. 14
1656లో శివాజీ ఎవరి మీద విజయం సాధించి జావళిని స్వాధీనం చేసుకున్నాడు?
A) చంద్రరావ్ మోర్
B) అప్జల్ ఖాన్
C) షాయిస్తఖాన్
D) జైసింగ్
Answer : A) చంద్రరావ్ మోర్
☛ Question No. 15
అప్జల్ ఖాన్‌ను పంపిన సుల్తాన్ ఎవరు?
A) గోల్కొండ సుల్తాన్
B) బీజాపూర్ సుల్తాన్
C) ఢిల్లీ సుల్తాన్
D) అహ్మద్‌నగర్ సుల్తాన్
Answer : B) బీజాపూర్ సుల్తాన్
☛ Question No. 16
అప్జల్ ఖాన్‌ను శివాజీ ఏ ఆయుధంతో హతమార్చాడు?
A) ఖడ్గం
B) ఈటె
C) బాణం
D) బాగ్‌నఖ్
Answer : D) బాగ్‌నఖ్
☛ Question No. 17
అప్జల్ ఖాన్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1659
B) 1664
C) 1656
D) 1665
Answer : A) 1659
☛ Question No. 18
ఔరంగజేబ్ తన మేనమామ షాయిస్తఖాన్‌ను ఏ ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు?
A) గుజరాత్
B) దక్కన్
C) బెంగాల్
D) పంజాబ్
Answer : B) దక్కన్
☛ Question No. 19
శివాజీ షాయిస్తఖాన్‌పై మెరుపుదాడి చేసిన సంవత్సరం ఏది?
A) 1659
B) 1665
C) 1663
D) 1660
Answer : C) 1663
☛ Question No. 20
శివాజీ 1664లో ఏ పట్టణాన్ని కొల్లగొట్టాడు?
A) ఆగ్రా
B) ఢిల్లీ
C) లాహోర్
D) సూరత్
Answer : D) సూరత్
☛ Question No. 21
శివాజీతో పురంధర్ సంధి కుదుర్చిన మొగల్ సేనాని ఎవరు?
A) మీర్జా రాజా జైసింగ్
B) షాయిస్తఖాన్
C) అప్జల్ ఖాన్
D) మాన్‌సింగ్
Answer : A) మీర్జా రాజా జైసింగ్
☛ Question No. 22
పురంధర్ సంధి ప్రకారం శివాజీ ఎన్ని కోటలను మొగలులకు అప్పగించాడు?
A) 18
B) 23
C) 20
D) 25
Answer : B) 23
☛ Question No. 23
పురంధర్ సంధి సమయంలో శివాజీ ఆధీనంలో మొత్తం ఎన్ని కోటలు ఉన్నాయి?
A) 20
B) 35
C) 40
D) 50
Answer : B) 35
☛ Question No. 24
పురంధర్ సంధి ప్రకారం శంభాజీకి ఎన్ని మన్సబ్ హోదా లభించింది?
A) 2000
B) 3000
C) 4000
D) 5000
Answer : D) 5000
☛ Question No. 25
శివాజీ కుమారుడు ఎవరు?
A) శంభాజీ
B) రాజారాం
C) బాలాజీ బాజీరావు
D) షాహూ
Answer : A) శంభాజీ
☛ Question No. 26
శివాజీ తన రాజ్యాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించాడు?
A) 3 భాగాలు
B) 2 భాగాలు
C) 5 భాగాలు
D) 4 భాగాలు
Answer : B) 2 భాగాలు
☛ Question No. 27
శివాజీ ప్రత్యక్ష పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
A) స్వరాజ్యం
B) మొగలాయ్
C) జాగీర్
D) సర్దేశ్
Answer : A) స్వరాజ్యం
☛ Question No. 28
శివాజీ రాజ్యాన్ని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
A) స్వరాజ్యం
B) మహారాష్ట్ర
C) మొగలాయ్
D) దేశ్
Answer : C) మొగలాయ్
☛ Question No. 29
శివాజీ మంత్రివర్గాన్ని ఏమని పిలిచేవారు?
A) సభాపతి మండలి
B) నవరత్నాలు
C) రాజసభ
D) అష్టప్రధానులు
Answer : D) అష్టప్రధానులు
☛ Question No. 30
అష్టప్రధానులలో ప్రధానమంత్రి ఎవరు?
A) పీష్వా
B) సచివ్
C) సుమంత్
D) అమాత్య
Answer : A) పీష్వా
☛ Question No. 31
రాజ్య ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించే మంత్రి ఎవరు?
A) సచివ్
B) అమాత్య
C) మంత్రి
D) సేనాపతి
Answer : B) అమాత్య
☛ Question No. 32
విదేశీ వ్యవహారాల మంత్రిని ఏమని పిలిచేవారు?
A) అమాత్య
B) మంత్రి
C) సుమంత్
D) పండిత్‌రావ్
Answer : C) సుమంత్
☛ Question No. 33
రాజ్య అధికార ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలను చూసేవారు ఎవరు?
A) సేనాపతి
B) న్యాయాధీశ్
C) పండిత్‌రావ్
D) సచివ్
Answer : D) సచివ్
☛ Question No. 34
మత వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఎవరు?
A) పండిత్‌రావ్
B) అమాత్య
C) పీష్వా
D) మంత్రి
Answer : A) పండిత్‌రావ్
☛ Question No. 35
సైనిక వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి ఎవరు?
A) మంత్రి
B) సేనాపతి
C) సచివ్
D) సుమంత్
Answer : B) సేనాపతి
☛ Question No. 36
ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలిచేవారు?
A) సుమంత్
B) సచివ్
C) న్యాయాధీశ్
D) పీష్వా
Answer : C) న్యాయాధీశ్
☛ Question No. 37
శివాజీ రద్దు చేసిన విధానం ఏది?
A) రైత్వారీ విధానం
B) మన్సబ్‌దారీ విధానం
C) జాగీర్దారీ విధానం
D) ఇక్తా విధానం
Answer : C) జాగీర్దారీ విధానం
☛ Question No. 38
శివాజీ ప్రవేశపెట్టిన భూమి ఆదాయ విధానం ఏది?
A) మహల్‌వారీ
B) రైత్వారీ
C) జమీందారీ
D) ఇక్తా
Answer : B) రైత్వారీ
☛ Question No. 39
భూమి పంటలో ఎంత భాగాన్ని శిస్తుగా నిర్ణయించారు?
A) మూడింట ఒక వంతు
B) సగం
C) ఐదింట రెండో వంతు
D) నాలుగోవంతు
Answer : C) ఐదింట రెండో వంతు
☛ Question No. 40
చౌత్ అనేది సాధారణంగా జిల్లా ఆదాయంలో ఎంత భాగంగా నిర్ణయించబడింది?
A) పదోవంతు
B) సగం
C) ఐదోవంతు
D) నాలుగోవంతు
Answer : D) నాలుగోవంతు
☛ Question No. 41
సర్దేశ్‌ముఖి పన్ను జిల్లా ఆదాయంలో ఎంత భాగంగా ఉండేది?
A) పదోవంతు
B) నాలుగోవంతు
C) మూడోవంతు
D) సగం
Answer : A) పదోవంతు
☛ Question No. 42
శివాజీ జీవితకాలంలో సుమారు ఎన్ని కోటలను నిర్మించాడు?
A) 150
B) 250
C) 100
D) 300
Answer : B) 250
☛ Question No. 43
శివాజీ సైన్యం ప్రధానంగా ఏ యుద్ధతంత్రంలో ప్రసిద్ధి చెందింది?
A) నౌకా యుద్ధం
B) ఫిరంగి యుద్ధం
C) గెరిల్లా యుద్ధం
D) కందక యుద్ధం
Answer : C) గెరిల్లా యుద్ధం
☛ Question No. 44
ప్రభుత్వం గుర్రాలు, ఆయుధాలు సమకూర్చే అశ్వికదళం ఏది?
A) సిలేదార్లు
B) కాల్బలం
C) నావికదళం
D) బార్గీర్లు
Answer : D) బార్గీర్లు
☛ Question No. 45
తమ గుర్రాలు, ఆయుధాలను తామే సమకూర్చుకునే అశ్వికదళం ఏది?
A) సిలేదార్లు
B) బార్గీర్లు
C) మావళీలు
D) కాల్బలం
Answer : A) సిలేదార్లు
☛ Question No. 46
శివాజీ సైనికులకు జీతాలు ఏ రూపంలో ఇచ్చేవారు?
A) భూములు
B) నగదు
C) ధాన్యం మాత్రమే
D) జాగీర్లు
Answer : B) నగదు
☛ Question No. 47
శివాజీ నావికాదళంలో సుమారు ఎన్ని యుద్ధ నౌకలు ఉండేవి?
A) 100
B) 150
C) 300
D) 200కు పైగా
Answer : D) 200కు పైగా
☛ Question No. 48
శివాజీ నావికాదళ ప్రధాన స్థావరం ఎక్కడ ఉండేది?
A) కొలాబా
B) సూరత్
C) గోవా
D) బొంబాయి
Answer : A) కొలాబా
☛ Question No. 49
శివాజీ నావికాదళం ప్రధానంగా ఎవరితో తలపడింది?
A) ఫ్రెంచ్ మాత్రమే
B) బ్రిటిష్, పోర్చుగీస్, డచ్
C) అరబ్బులు మాత్రమే
D) మొగలులు మాత్రమే
Answer : B) బ్రిటిష్, పోర్చుగీస్, డచ్
☛ Question No. 50
శివాజీ మరణించే సమయానికి సుమారు ఎంత కాల్బలం ఉండేది?
A) 50 వేల
B) 75 వేల
C) సుమారు ఒక లక్ష
D) 2 లక్షలు
Answer : C) సుమారు ఒక లక్ష

0 Comments