Yadava Dynasty History in Telugu | Kings, Administration, Literature & Culture
యాదవ రాజవంశం (Yadava Dynasty) చరిత్ర – దేవగిరి యాదవులు
దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన రాజవంశాలలో దేవగిరి యాదవులు ఒకరు. రాష్ట్రకూటుల పాలన అనంతరం ఎదిగి, మహారాష్ట్ర ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించారు. వీరి రాజధాని దేవగిరి (ప్రస్తుత దౌలతాబాద్). యాదవులు వ్యవసాయం, సాహిత్యం, భక్తి ఉద్యమం మరియు మరాఠీ భాష అభివృద్ధికి విశేష కృషి చేశారు.
యాదవ రాజవంశం
| అంశం | వివరాలు |
|---|---|
| రాజవంశం | దేవగిరి యాదవులు (శేణ వంశం) |
| మూలపురుషుడు | దృఢప్రహరుడు |
| స్వతంత్ర రాజ్య స్థాపకుడు | అయిదో బిల్లముడు (భిల్లమ V) |
| రాజధాని | దేవగిరి (దౌలతాబాద్) |
| పాలించిన ప్రాంతం | మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాలు |
| పతనం | క్రీ.శ.1318లో ఖిల్జీల ఆధీనంలోకి వెళ్లింది |
యాదవుల ఆవిర్భావం
యాదవ వంశానికి మూలపురుషుడు దృఢప్రహరుడు. రాష్ట్రకూటుల శక్తి క్షీణించిన సమయంలో నాసిక్ ప్రాంతంలోని చందోర్ను కేంద్రంగా చేసుకుని పాలన ప్రారంభించాడు. తరువాత ఈ వంశం శేణ వంశంగా ప్రసిద్ధి చెందింది. అయిదో బిల్లముడు (1187–1191) స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. కాలచురి వంశాన్ని ఓడించి తన అధికారాన్ని విస్తరించాడు. తరువాత దేవగిరి రాజధానిగా అభివృద్ధి చెందింది.
ప్రముఖ యాదవ రాజులు
| రాజు | పాలన కాలం |
|---|---|
| అయిదో బిల్లముడు | 1187–1191 |
| జైతుగి | 1191–1210 |
| సింఘనుడు | 1210–1247 |
| కృష్ణుడు | 1247–1260 |
| మహదేవుడు | 1260–1270 |
| రామచంద్రదేవుడు | 1270–1309 |
| శంకరదేవుడు | తదుపరి పాలకుడు |
యాదవుల పాలనా వ్యవస్థ
యాదవులు సంప్రదాయ రాజరిక వ్యవస్థను అనుసరించారు. రాజుకు మంత్రి మండలి సహకారం ఉండేది.
మంత్రిమండలిలో ముఖ్యఅధికారులు మహాప్రధాని, సంధివిగ్రహి, మహాప్రచండ, దండనాయకుడు. వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. భూమిశిస్తు ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం లభించేది. రైతులకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు.
మతం మరియు భక్తి ఉద్యమం
యాదవులు ప్రధానంగా విష్ణుభక్తులు అయినప్పటికీ అన్ని మతాల పట్ల గౌరవభావం చూపారు.
- పండరిపురం విఠోబా ఆరాధనకు ప్రధాన కేంద్రంగా మారింది.
- జ్ఞానదేవ్, నామదేవ్, జానాబాయి, చక్రధరుడు భక్తి ఉద్యమాన్ని ప్రజల్లో విస్తరించారు.
- సామాజిక సమానత్వం, ప్రేమ, సఖ్యత, కులమత భేదాల నిర్మూలనకు కృషి చేశారు.
సాహిత్య పోషణ
యాదవ రాజులు సంస్కృతం మరియు మరాఠీ భాషలకు విశేష ప్రోత్సాహం అందించారు. అనేక మంది కవులు, పండితులను ఆదరించారు.
ప్రముఖ పండితులు మరియు రచనలు
| పండితుడు | ప్రసిద్ధ రచన |
|---|---|
| హేమాద్రి | చతుర్వర్గ చింతామణి, ఆయుర్వేద రసాయన |
| ముకుందరాయుడు | వివేక సింధు |
| జ్ఞానదేవ్ | జ్ఞానేశ్వరీ (భగవద్గీత వ్యాఖ్యానం) |
మరాఠీ భాష అభివృద్ధిలో యాదవుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. ముకుందరాయుడు మరాఠీ భాషకు ఆదికవిగా గుర్తింపు పొందాడు.
For More History Topics

0 Comments