శాతవాహనుల పరిపాలన వ్యవస్థ | Satavahana Administration System in Telugu
పరిపాలన వ్యవస్థ
- శాతవాహనులు దక్కన్ ప్రాంతాన్ని ఏకం చేసి విదేశీ దండయాత్రల నుండి రక్షించారు.
- వీరి పాలన వ్యవస్థ మౌర్యుల పాలనను పోలి ఉండేది.
- వంశపారంపర్య రాజరికం అమల్లో ఉండేది.
- రాజులు "రాజన్" అనే బిరుదును ఉపయోగించేవారు.
- నిరంకుశ అధికారాలు ఉన్నప్పటికీ ధర్మబద్ధంగా పాలన సాగించేవారు.
- యువరాజులను కుమారమాత్యులుగా నియమించి పరిపాలనా అనుభవం కల్పించేవారు.
- రాజుకు సహాయంగా మంత్రిమండలి ఉండేది.
- బండారిక, ప్రతిహార, లేఖక, నిబంధనకార వంటి అధికారులు పరిపాలనలో కీలక పాత్ర పోషించేవారు.
సామంత వ్యవస్థ
- సామంతులకు పరిపాలనలో ప్రత్యేక స్థానం ఉండేది.
- అత్యున్నత సామంతుడిని "రాజా" అని పిలిచేవారు.
- రాజాకు సొంత నాణేలు ముద్రించే హక్కు ఉండేది.
- ఇతర ముఖ్య సామంతులు మహారధి, మహాభోజ బిరుదులు కలిగి ఉండేవారు.
- వీరికి గ్రామాలను దానం చేసే అధికారం ఉండేది.
- శాతవాహనులు తమ సామంతులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు.
పరిపాలనా విభజన
- రాజ్యాన్ని జనపదాలు → విషయాలు → గ్రామాలుగా విభజించారు.
- జనపదాలకు రాజకుమారులు పాలకులు.
- విషయాలకు అమాత్యులు పాలనాధికారులు.
- గ్రామాలకు గ్రామాణి పాలకుడు.
- గ్రామసభలు గ్రామాణికి పరిపాలనలో సహకరించేవి.
ఆదాయ వ్యవస్థ
- ప్రభుత్వ ప్రధాన ఆదాయం భూమిశిస్తు (భూమి పన్ను).
- వృత్తి పన్నులు, రహదారి పన్నులు, వాణిజ్య సుంకాలు కూడా వసూలు చేసేవారు.
- భూమికి రాజే యజమాని అయినప్పటికీ సాగు చేసే రైతులకే యాజమాన్య హక్కులు ఉండేవి.
- భూమిని దానం చేయాలంటే రాజు రైతుల నుండి కొనుగోలు చేసేవాడు.
సైనిక వ్యవస్థ
- శాతవాహనులకు పటిష్టమైన చతురంగ సైన్యం ఉండేది.
- సైన్యంలో అశ్వదళం, గజదళం, రథదళం, పదాతి దళం ఉండేవి.
- మహాసేనాపతి సైన్యానికి ప్రధాన అధికారి.
- రాజులు స్వయంగా యుద్ధరంగంలో సైన్యానికి నాయకత్వం వహించేవారు.
Real Also :

0 Comments