ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌(IIFL SCHOLARSHIP)


ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

మీరు 10వ తరగతి లేదా 10+2 చదువుతున్నారా ? మీరు స్కాలర్‌షిప్‌ కొరకు ఎదురుచూస్తున్నారా ? ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు గర్ల్‌ స్టూడెంట్స్‌ మాత్రమే అర్హులు.

     ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ ఫౌండేషన్‌ అనేది ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ గ్రూప్‌, సిఎస్‌ఆర్‌ ఆర్మ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సమ్మేళనం. భారతదేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పరిష్కరించడానికి 2015 సంవత్సరంలో ఈ ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ పౌండేషన్‌ ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్‌ రాష్ట్రంలో చదువురాని బాలికలతో విద్యా కార్యక్రమం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని గ్రామీణ పేద మరియు బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక అక్షరాస్యత అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం, భారతదేశంలో వివిధ ప్రాంతాలో ప్రకృతి వైపరిత్యాల తర్వాత నిరాశ్రయులైన మరియు ప్రభావిత ప్రజలతో ఐఐఎఫ్‌ఎల్‌ ఫౌండేషన్‌ కలిసి పనిచేయడం వంటి కార్యక్రమాలతో వారి జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తుంది. 

అర్హత :

ఈ ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ స్కాలర్‌షిప్‌ప్రోగ్రామ్‌ అనేది గర్ల్‌స్టూడెంట్స్‌(విద్యార్థినిలు) మాత్రమే అర్హులు. 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా 10+2 పూర్తి చేసి ఉండాలి. తమ తమ ఫ్యామిలి సంవత్సర ఆదాయం (అన్ని రకాలుగా) 3 లక్షలకు మించరాదు. 

స్కాలర్‌షిప్‌ మొత్తం రూపాయలు :

1) 9వ తరగతి నుండి 10వ తరగతి వరకు 3500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. 

2) 11వ తరగతి నుండి గ్రాడ్యువేషన్‌ వరకు 5000 రూపాయు చెల్లించడం జరుగుతుంది. 

ఎంపిక ప్రక్రియ :

ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కొరకు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్న తర్వాత స్టూడెంట్స్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేయబడిన విద్యార్థినీలకు ఇంటర్యూు నిర్వహించి ఇట్టి స్కార్‌షిప్‌ అందించడం జరుగుతుంది. 

కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

1)     పాస్‌పోర్టు సైజు ఫోటో 

2)    గత సంవత్సరం మార్కుల మెమో

3)     గుర్తింపు ధృవపత్రం ( ఆధార్‌ కార్డు/ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్స్‌)

4)     ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్‌ గుర్తింపు కార్డు ( అడ్మిషన్‌ లెటర్‌/ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌)               

5)     బ్యాంక్‌ ఖాతా బుక్‌ / క్యాన్సల్‌ చెక్‌ 

6)     ఆదాయం సర్టిఫికేట్‌ / అఫిడవిట్‌ 

ముఖ్యమైన తేదీలు :

  • అడ్వటైజ్‌మెంట్‌ వచ్చిన తేది.12-04-2021
  • చివరితేది. 30-04-2021

పూర్తి సమాచారం కోరకు

https://www.buddy4study.com/page/iifl-scholarship





Post a Comment

0 Comments