జాతీయ గీతం



 వందేమాతరం 

                  - బంకించంద్ర చటర్జీ 

వందేమాతరం, వందేమాతరం 
సుజలాం సుఫలాం మలయజ శీతలాం 

సస్య శ్యామలాం మాతరం వందేమాతరం 

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం 

ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం 

సహాసినీం సుమధుర భాషిణీం 

సుఖదాం వరదాం మాతరం వందేమాతరం 

జాతీయ గీతం 
                    - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 
జనగణమన అధినాయక జయహే ! 
భారత భాగ్య విధాతా ! 

పంజాబ సింధ్‌ గుజరాత మరాఠా, 

ద్రావిడ ఉత్కళ వంగా ! 

వింధ్య హిమాచల యమునా గంగా, 

ఉచ్చల జలధి తరంగా ! 

తవ శుభనామే జాగే ! 

తవ శుబ ఆశిష మాగే ! 

గాహే తవ జయ గాథా ! 

జనగణ మంగళదాయక జయహే ! 

భారత భాగ్య విధాతా ! 

జయహే ! జయహే ! జయహే ! 

జయ జయ జయ జయహే ! 

ప్రతిజ్ఞ 
భారతదేశం నా మాతృభూమి 
భారతీయులందరూ నా సహోదరులు 
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను 
సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం 
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను 
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాఉల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను 
ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను 
జంతువుల పట్ల దయతో ఉంటాను 
నా దేశంపట, నా ప్రజల పట్ల, సేవానిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను 
వారి శ్రేయోభివృధ్దులే నా ఆనందానికి మూలం 
మా తెలుగు తల్లి 
                                              - శంకరంబాడి సుందరాచారి 

మా తెలుగు తల్లికి మల్లెపూదండ 
మా కన్నతల్లికి మంగళారతులు 

కడుపులో బంగారు కనుచూపులో కరుణ 

చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి 

గలగలా గోదారి కదిలిపోతుంటేను 

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను 

బంగారు పంటలే పండుతాయి 

మురిపాల ముత్యాలు దొరలుతాయి 

అమరావతీ నగర అపురూప శిల్పాలు 

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు 

తిక్కయ్య కలములో తియ్యందనాలు 

నిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక 

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి 

తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి 

మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక 

నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం 

జై తెలుగు తల్లీ ! జై తెలుగు తల్లీ ! జై తెలుగు తల్లీ !

Post a Comment

0 Comments