జావా వెబ్ కెరీర్‌కు త్రోవ
Gk in Telugu || General Knowledge in Telugu
వెబ్‌సైట్‌లలో యూజర్ ఇంటరాక్టివిటికి ప్రాధాన్యం పెరుగుతుంది. హెచ్‌టిఎంఎల్, సీఎస్‌ఎస్‌లకు జావా స్క్రిప్టును జోడించి గ్రాఫిక్స్, ఇంటరాక్టివిటితో కూడిన డైనమిక్ వెబ్‌సైట్లకు ఆదరణ ఎక్కువ. దాంతో ఐటి రంగంలో... ముఖ్యంగా వెబ్ డెవలప్‌మెంట్‌లో జావాస్ట్రిప్టు కీలక ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మారుతుంది. చిన్నచిన్న కంపెనీల నుండి పెద్ద సంస్థల వరకూ జావాస్ట్రిప్ట్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో ఈ టెక్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో జావాస్ట్రిప్టుతో ప్రయోజనాలు ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ తీరుతెన్నులు .. జావాస్ట్రిప్టుపై భవిష్యత్తు ఉద్యోగవకాశాలు, ఇతర వివరాలు తెలుగులో ప్రత్యేకంగా అందిస్తున్నాము.
జావాస్రిప్టు అనేది వెబ్‌లో హెచ్‌టిఎంఎల్, సీఎస్‌ఎస్‌తో పాటు ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్‌గా ఉండే వెబ్‌పేజీలు, యూజర్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉండే వెబ్‌సైట్‌లు రూపొందించేందుకు జావాస్ట్రిప్టును ఉపయోగిస్తారు. ఇది వెబ్ అప్లికేషన్‌లు, మొబైల్ అప్లికేషన్‌లలో ఫ్రంట్ ఎండ్‌లో పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్ సేవల్లోనూ జావాస్ట్రిప్టు డెవలపర్‌ది కీలకపాత్ర. డెవలపర్ ఉద్యోగాల్లో మూడోవంతు ఉద్యోగాలు వీరికి సంబందించినవే ఉంటున్నాయి. కాబట్టి జావాస్ట్రిప్టు నైపుణ్యాలు సొంతం చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు.
➦ జావాస్ట్రిప్ట్ అనగా ..
జావాస్ట్రిప్ట్ అనేది ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి డెవలపర్‌లు ఉపయోగించే డైనమిక్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్‌సైట్‌లలో ఉపయోగించే డ్రాప్‌డౌన్ మెనూ, ఏదైనా బటన్‌ను క్లిక్ చేయడం, పేజీలో రంగును మార్చడం వంటికి జావాస్ట్రిప్టుకు ఉదాహరణలు. జావాస్ట్రిప్టును వెబ్ అప్టికేషన్‌లు, గేమ్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్స్‌ను రూపొందించడానికి ఉపయోగించే బహుళార్థసాధక ప్రోగ్రామింగ్ భాషగా కూడా జావాస్క్రిప్టును ఒకసారి వ్రాసి ఎన్నిసార్లయిన రన్ చేసే అవకాశం ఉంది.
➦ అప్లికేషన్‌లు :-
జావాస్ట్రిప్టు, హెచ్‌టిఎంఎల్ ఆబ్జెక్టులను సృష్టించడానికి హెచ్‌టిఎంఎల్ ట్యాగ్‌లను ఉపయోగిస్తారు. ఆ ఆబ్జెక్టును ఇంటరాక్టివ్‌గా మార్చడానికి జావాస్ట్రిప్టు అవసరం ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌టిఎంఎల్‌తో వెబ్‌సైట్‌లో ‘అప్‌లోడ్ ఫైల్ ’ కనిపించేలా చేయొచ్చు. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి వీలుకల్పించేదే జావాస్ట్రిప్టు. అలాగే ఇమేజేస్, టెక్స్ట్, ఫీల్డ్ తదితర ఫీచర్లను హెచ్‌టిఎంఎల్‌తో క్రియేట్ చేసినా.. అవి ఇంటరాక్టివ్‌గా పనిచేయాలంటే.. జావాస్ట్రిప్ట్‌ను హెచ్‌టిఎంఎల్ ఫైల్స్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.
➦ సిఎస్‌ఎస్ :-
జావాస్రిప్టు, సీఎస్‌ఎస్‌లను వేర్వేరు విధాలుగా వెబ్‌పేజీలలో ఉపయోగిస్తారు. వెబ్‌సైట్‌లో ఆకర్షనీయమైన ఇంటర్‌ఫేస్ కోసం లేఔట్‌ను రూపొందించడానికి సీఎస్‌ఎస్ సహాయపడుతుంది. వెబ్‌పేజీని ఇంటరాక్టివ్‌గా చేసేందుకు జావాస్ట్రిప్టు ఉపయోగపడుతుంది.
➦ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ :-
అప్లికేషన్లను కమ్యూనికేట్ చేయడానికి మద్యవర్తిగా పనిచేస్తుంది. ఫోన్‌లో ఏదైనా అప్లికేషన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నుండి సర్వర్‌కు డేటా వెళ్లడం, కావాల్సిన సమాచారంతో డేటా మళ్లీ ఫోన్‌కు రావడం ఏపీఐ ద్వారా జరుగుతుంది. జావాస్ట్రిప్టులో ఏపిఐలు సర్వర్, క్లయింట్ మద్య ఇంటర్‌ఫేస్‌ను ఏర్పరుస్తాయి. వెబ్ అడ్మిన్ సూచనల ఆధారంగా పేజీని యాక్సెస్ చేయడానికి ఏపిఐలు, వినియోగదారులను అనుమతిస్తాయి.
యూజర్‌కు కనిపించే ఫ్రంట్ ఎండ్‌తో పాటు బ్యాక్ ఎండ్‌లోనూ నోడ్‌జేఎస్‌తో జావాస్ట్రిప్టును ఉపయోగిస్తారు. వీటిద్వారా డెవలపర్లు డేటాబేస్ నుండి డేటాను తిరిగి పొందవచ్చు. సేవ్ చేయవచ్చు. అంతేకాకుండా పేమెంట్‌లు చేయడం, సోషల్‌మీడియా పోస్టులను సేవ్ చేయడం, సోషల్‌మీడియా పోస్టులను సేవ్ చేయడం వంటివి చేయోచ్చు. వెబ్‌పేజిల్లో అపరిమితమైన ఫంక్షన్‌ల ద్వారా జావాస్క్రిప్ట్ భాషను ఉపయోగిస్తారు.
➦ వెబ్‌పేజిలలో జావాస్క్రిప్టు :-
- మౌస్‌తో కదిలించినప్పుడు, క్లిక్ చేసినప్పుడు వచ్చే మార్పులు,
- పేజిలో హెచ్‌టిఎంఎల్ కంటెంట్ కలపడం, మార్చడం, లేదా తీసివేయడం
- టైపింగ్ చేస్తున్నప్పుడు జరిగే మార్పులు
- ఫైల్స్‌నుడౌన్‌లోడ్ చేయడం, అప్‌లోడ్ చేయడం
- కాచీలో డేటా నిల్వచేయడం
- వెబ్‌సైట్ వీక్షకులతో ఇంటరాక్షన్ , సందేశాలు పంపడం
- మొబైల్ అప్లికేషన్లు, ఆన్‌లైన్ గేమ్‌లను రూపొందించడానికి జావాస్క్రిప్టు ఉపయోగిస్తున్నారు.
➦ జావాస్క్రిప్టు - బ్రౌజర్ :-
ఇటీవల కాలంలో జావాస్క్రిప్ ్ట చాలా విసృతంగా ఉపయోగిస్తున్నారు . దీనివల్ల వినియోగదారుడు వెబ్‌సైట్ లో ఏదైనా క్లిక్ చేయగానేవేగంగా ప్రాసెస్ అవుతుంది. లోపాలు, బగ్‌ల ఆధారంగా పరీక్షించడం. ఏ బ్రౌజర్ అయినా జావాస్క్రిప్ట్‌కోడ్ ను రన్ చేస్తుంది.
➦ పనిచేసే విధానం :-
వెబ్ బ్రౌజర్లలో జావాస్క్రిప్ట్, ఇతర కోడ్‌లను అనువదించే ఇంజన్‌లు ఉంటాయి. అవి జావాస్క్రిప్ట్‌లోని కమాండ్స్‌కు అనుగుణంగా డైనమిక్ చర్యలకు దోహదపడతాయి. బాగా రాసిన, ఆప్టిమైజ్ చేసిన కోడ్.. వెబ్‌పేజిలను సమర్థవంతంగా ఓపేన్ చేస్తుంది. సరిగ్గా లేని ఆదేశాలతో కూడిన జావాస్క్రిప్టు యూజర్ బ్రౌజర్‌ను నెమ్మదించేలా చేస్తుంది.
➦ ఎవరు నేర్చుకోవచ్చు :-
వెబ్ డెవలప్‌మెంట్ ఆసక్తి ఉన్నవారు ముందుగా హెచ్‌టిఎంఎల్, సీఎస్‌ఎస్ నేర్చుకొని .. ఆ తర్వాత జావాస్క్రిప్ట్‌పై దృష్టి సారించాలి . ఆన్‌లైన్‌లోనూ అనేక ఉచిత మెటీరియల్, ట్యూటోరియల్స్ అందుబాటులోఉన్నాయి. జావాస్ట్రిప్టు కమాండ్స్ ఇంగ్లీష్ మాదిరిగా ఉండటం వల్ల దీన్ని నేర్చుకోవడం సులభం. జావాస్ట్రిప్ట్ లో ప్రాథమిక నైపుణ్యాలపై పట్టు లభించిన తర్వాత .. ప్రోగ్రామింగ్‌లో కెరీర్ ప్రారంభించొచ్చు. జావాస్ట్రిప్ట్ స్టడీ గ్రూప్‌లలో చేరడం ద్వారా సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
➦ కెరీర్ అవకాశాలు :-
జావాస్ట్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం సొంతం చేసుకుంటే లక్షల్లో వేతనాలు పొందొచ్చు. అన్ని కంపెనీల్లో జావాస్ట్రిప్ట్ వినియోగం పెరగడం వల్ల రానున్న రోజుల్లో జావాస్ట్రిప్ ్ట డెవలపర్‌లకు మరింత డిమాండ్ పెరగనుంది. నిపుణులైన జావాస్ట్రిప్ట్ డెవలపర్‌లను చాలా కంపెనీలు ఫ్రంట్ ఎండ్‌వెబ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, జావాస్ట్రిప్ట్ డెవలపర్, యూఎక్స్ డెవలపర్, వెబ్‌డిజైనర్, యూఐ డిజైనర్, పుల్ స్టాక్ డెవలపర్, ఇంజనీర్‌లుగా నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రీలాన్సింగ్ ద్వారా డెవలపర్లుగా పనిచేయొచ్చు.
0 Comments