తెలుగు సామెతలు || Telugu Samethalu,

telugu samethalu_telugutechbadi


 తెలుగు సామెతలు :

 

➠ కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు 

 

➠ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు 

 

➠ గోరుచుట్టు మీద రోకలి పోటు 

 

➠ అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట 

 

➠ దున్నపోతుమీద వర్షం పడినట్లు 

 

➠ ఏమిలేని ఎడారిలో ఆముదము చెట్టే మహావృక్షము 

 

➠ మోసేవానికి తెలుసు కావడి బరువు 

 

➠ చంకలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్లు 

 

➠ ముందుకు పోతో గొయ్యి - వెనకకు పోతే నుయ్యి 

 

➠ బూడిదలో పోసిన పన్నీరు 

 

➠ ఆకలి ఆకాశమంత - నోరు సూది బెజ్జమంత 

 

➠ అమ్మబోతే అడవి కొనబోతే కొరివి 

 

➠ అందితే జుట్టు - అందకపోతే కాళ్లు 

 

➠ అడిగేవాడికి చెప్పేవాడికి లోకువ 

 

➠ ఆలూ లేదు చూలు లేదు - కొడుకు పేరు సోమలింగం 

 

➠ ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత 

 

➠ ఇల్లు కట్టి చూడు -పెళ్లి చేసి చూడు 

 

➠  ఇల్లు పీకి పందిరేసినట్లు 

 

➠ కందకు లేని దురద కత్తిపీటకెందుకు 

 

➠ కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు 

 

➠ కుక్కకాటుకు చెప్పు దెబ్బ

 

➠ కోటి విద్యలూ కూటి కొరకే

 

➠ నీరు పల్లమెరుగు - నిజము దెవుడెరుగు 

 

➠ పిచ్చుకపై బ్రహ్మస్త్రం 

 

➠ పిట్ట కొంచెం - కూత ఘనం 

 

➠ రొట్టే విరిగి నేతి పడ్డట్లు 

 

➠ వాన రాకడ ప్రాణం పోకడ ఎవరి కెరుక

 

➠ కళ్యాణమొచ్చినా కక్చొచ్చినా ఆపలేరు 

 

➠ మింగమెతుకు లేదు - మీసాలకు సంపంగి నూనె 

 

➠ ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు 

 

➠ ఆడలేక మద్దెల ఓటు అన్నట్లు 

 

➠  ఆదిలోనే హంసపాదు 

 

➠ అడుసు త్రొక్కనేల ` కాలు కడగనేల 

 

➠ అద్దం మీద ఆవగింజ పడ్డట్లు 

 

➠ అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు 

 

➠ అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు 

 

➠ అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టినట్లు 

 

➠ అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు ?

 

➠ అడకత్తెరలో పోకచెక్క 

 

➠ అరచేతిలో వైకుంఠం చూపినట్లు 

 

➠ అడగనిదే అమ్మ అయిన అన్నపెట్టదు 

 

➠ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 

 

➠ నోరు మంచిదైతే ` ఊరు మంచిదవుతుంది

 

➠ చెరపకురా చెడేవు 

 

➠ పోరు నష్టం - పొందు లాభం 

 

➠ దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి 

 

➠ ఎంత చెట్టుకు అంత గాలి 

 

➠ నిప్పు లేనిదే పొగ రాదు 

 

➠ మంత్రాలకు చింతకాయలు రాలవు 

 

➠ పేరు గొప్ప - ఊరు దిబ్బ 

 

➠ అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని 

 

➠ అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది 

 

➠ ఏమిలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది 

 

➠ ఇల్లు పీకి పందిరేసినట్లు 

 

➠ బొక్కున్న గాబులో కుడ్తి పోసినట్లు 

 

➠  ఎండకు గొడుగు 

 

➠ గుడినే మింగినోడికి లింగమొక లెక్క 

 

➠ ఇంటికన్న గుడి పదిలం 

 

➠ దరిద్రుడి పెళ్లికి వడగండ్ల వాన 

 

➠ ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు 

 

➠ కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు 

 

➠ ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా 

 

➠ బతికుంటే బలుసాకు తినోచ్చు 

 

➠ దూరపు కొండలు నునుపు 

 

➠ చిలికి చిలికి గాలివానైనట్లు 

 

➠ తేలు కుట్టిన దొంగలా 

 

➠ కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు 

 

➠ నడమంత్రపు సిరి నరాలమీద పుండు 

 

➠ ఆవు చేనులో మేస్తే - దూడ గట్టున మేస్తుందా

 

➠ అన్ని తెలిసిన కవి అగ్నిపర్వతంపై ఆసనం వేసినట్లు 

 

➠ గోరంతలు కొండంతలు చేయడం 

 

➠ అందని ద్రాక్ష

 

➠ అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు 

 

➠ అన్నంపెట్టిన ఇంటికి కన్నం వేయడం 

 

➠ మొక్కైవంగనిది మానై వంగునా ?

 

➠ ఆకలి రుచి ఎరుగదు - నిద్ర సుఖమెరుగదు 

 

➠ తీగ లాగితే - డొంక కదిలినట్లు 

 

➠ ఇల్లు అలకగానే పండగౌతుందా

 

➠ ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి 

 

➠ తింటే గాని రుచి తెలియదు - దిగితే కానీ లోతు తెలియదు 

 

➠ తానొకటి తలిస్తే ` దైవం మరొకటి తలచినట్లు 

 

➠  ఊరికి ఊరు ఎంత దూరమో ` ఊరికి ఊరు అంతే దూరం 

 

➠ ఎంత చెట్టుకు అంత గాలి 

 

➠ కరవమంటే కప్పకు కోపం ` విడవమంటే పాముకు కోపం 

 

➠ తుంగ దించి బండను ఎత్తుకున్నట్లు 

 

➠ ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే 

 

➠ తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్లు ఉంటుంది

 

➠ ఏనుగునైనా ఎంటితో కట్టవచ్చు 

 

➠ ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్లు 

 

➠ అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు 

 

➠ అన్నప్రాసన నాడే అవకాయ పచ్చడి పెట్టినట్లు 

 

➠ ఎంత గుమ్మడికాయ అయిన కత్తిపీటకు లోకువే 

 

➠ తాను దూర సందు లేదు మెడకో డోలు 

 

➠ హనుమంతుని ముందు కుప్పిగంతులా 

 

➠ సముద్రం కన్నా సహనం పెద్ద 

 

➠ అదిగో పులి అంటే ` ఇదిగో తోక అన్నట్లు 

 

➠ దేవుడు వరం ఇచ్చినా - పూజారి అడ్డుపడ్డట్లు 

 

➠ దురాశ దు:ఖమునకు చేటు 

 

➠ ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు 

 

➠ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు 

 

➠ కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

 

➠ కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటు వేస్తుంది 

 

➠ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

 

➠ మెరిసేదంతా బంగారం కాదు 

 

➠ నిండు కుండ తొణకదు 

 

➠ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు సచ్చినట్లు

 

➠ పానకంలో పుడక

 

➠ పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు తాగడం మంచిది 

 

➠ పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణ సంకటం 

 

➠ రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదు 

 

➠ ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు 

 

➠ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు 

 

➠ అబద్దము ఆడినా అతికినట్లు ఉండాలి 

 

➠ దెయ్యాలే వేదాలు పలికినట్లు 

 

➠ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



Post a Comment

0 Comments