రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్
(Reliance Foundation Scholarships)
ప్రముఖ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ వారు తమ సామాజిక సేవలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అండర్ గ్రాడ్యువేట్ మరియు పోస్టు గ్రాడ్యువేట్ కోర్సులు చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించడం జరుగుతుంది. ఇట్టి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు తమ పైచదువులు నిరాటంకంగా కొనసాగించడానికి దోహదం చేస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటింగ్ మరియు ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కోర్సులలో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది అండర్ గ్రాడ్యువేట్ మరియు పోస్టు గ్రాడ్యువేట్ చదివే 100 మంది భారతీయ విద్యార్థులకు ఇట్టి స్కాలర్‌షిప్ సహాయాన్ని అందిస్తుంది.
ఇట్టి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యువేట్ స్టూడెంట్స్‌కు తమ కోర్సు పూర్తయ్యే సరికి 4 లక్షల రూపాయల వరకు మరియు 40 మంది పోస్టు గ్రాడ్యువేట్ స్టూడెంట్స్‌కు తమ కోర్సు పూర్తయ్యే సరికి 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆర్హులైన విద్యార్థులు 14 ఫిబ్రవరి 2022 లోగా ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తులు సమర్పించాలి.
ఆర్గనైజేషన్ |
రిలయన్స్ ఫౌండేషన్
|
ప్రోగ్రామ్ పేరు |
స్కాలర్‌షిప్ |
ఎవరు అర్హులు |
గ్రాడ్యువేట్ / పోస్టు గ్రాడ్యువేట్ విద్యార్థులు |
స్కాలర్‌షిప్ ప్రోత్సాహకం |
4 లక్షలు అండర్ గ్రాడ్యువేట్ వారికి, 6 లక్షలు పోస్టు గ్రాడ్యువేట్ వారికి |
|
|
ధరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
చివరి తేది |
14 ఫిబ్రవరి 2022 |
1) భారతీయ విద్యార్థులు అయి ఉండాలి
2) కింద తెలిపిన కోర్సులలో అండర్‌గ్రాడ్యువేట్ లేదా పోస్టు గ్రాడ్యువేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం ప్రవేశం పొంది యుండాలి.
ఎ) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
బి) కంప్యూటర్ సైన్స్
సి) మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటింగ్
డి) ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కోర్సులలో
3) అండర్ గ్రాడ్యువేట్ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకునే విద్యార్థులు ‘‘జేఈఈ మేయిన్స్’’ (పేపర్`1) పరీక్షలో 1 నుండి 35,000 ర్యాంగ్ సాధించి ఉండాలి.
4) పోస్టు గ్రాడ్యువేట్ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకునే విద్యార్థులు ‘‘ గేట్ ’’ పరీక్షలో 550 నుండి 1000 స్కోర్ సాధించాలి. (లేదా) అండర్ గ్రాడ్యువేషన్‌లో 7.5 సిజిపిఏ సాధించి ఉండాలి.
5) భారతదేశంలోని ఇనిస్టిట్యూట్‌లలో మాత్రమే చదువుతూ ఉండాలి.
➠ ప్రోత్సాహకం / స్కాలర్‌షిప్ మొత్తం :
1) అండర్ గ్రాడ్యువేట్ చదివే విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యే లోపు 4,00,000 రూపాయలు లభిస్తాయి.
2) పోస్టు గ్రాడ్యువేట్ స్టూడెంట్స్‌కు తమ కోర్సు పూర్తయ్యే లోపు 6,00,000 రూపాయలు లభిస్తాయి.
➠ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
1) పాస్‌పోర్టు సైజు ఫోటో
2) అడ్రస్ ప్రూఫ్
3) కరెంటు రెజ్యూమ్
4) ఎస్‌ఎస్‌సి/10వ తరగతి మెమో
5) ఇంటర్మిడియట్ మెమో
6) జేఈఈ మేయిన్స్ ఎంట్రన్స్ ఎంగ్జామ్ మార్కుషీట్ (గ్రాడ్యువేట్ స్టూడెంట్స్)
గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్స్‌షీట్ (పోస్టుగ్రాడ్యువేట్ స్టూడెంట్స్ ` అప్లికేబుల్ అయితే)
7) పోస్టుగ్రాడ్యువేట్ విద్యార్థులు అయితే డిగ్రి మెమో
8) ప్రస్తుత సంవత్సరం ప్రవేశం పొందిన ఐడి ప్రూఫ్
9) రెండు రిఫరెన్స్ లెటర్స్
1) ఎక్స్‌ఫిరియన్స్ సర్టిఫికేట్
2) వికలాంగుల సర్టిఫికేట్
3) కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రము
➠ ధరఖాస్తు విధానం :ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి
➠ ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి
చివరి తేది.14 ఫిబ్రవరి 2022
➠ ఆన్‌లైన్ ధరఖాస్తు కొరకు :
0 Comments