G20 Summit - 2023 in telugu || జి20 - సదస్సు 2023 || Gk in Telugu || General Knowledge in Telugu

G20 Summit - 2023 in telugu || జి20 - సదస్సు 2023


 

జీ20 - సదస్సు 

G20 SUMMIT 2023

Gk in Telugu || General Knowledge in Telugu

జీ20 సదస్సు - 2023కు భారత్‌ అతిథ్యమిస్తుండడంతో భారతదేశమంతా జీ20 పేరుతో మారుమ్రోగుతుంది. అంతేకాకుండా అమెరికా, చైనా, బ్రిటన్‌, ప్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ అగ్రనేతలు భారత్‌ రానుండడంతో జీ20 సమావేశాల గురించి ప్రజలు మరింత ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ జీ20 సదస్సు అంటే ఏమిటీ, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి ఎవరు సారథ్యం వహిస్తారు, ఇందులో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉంటాయి, 2024 జీ20 సదస్సు ఎక్కడ జరుగుతుంది వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం పదండి .. 

Also Read : Gk Questions in Telugu 

➺ జీ20 అంటే ఏమిటీ ? 

జీ20 అనేది మొత్తం 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమి. ఇది ప్రపంచంలో మొత్తం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 %, ప్రపంచ జీడిపిలో 85%, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. 

➺ జీ20 కూటమి 

1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లు ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు వేదికగా జి20 స్థాపించబడింది.

ఇట్టి జీ20 కూటమిలో మొత్తం 20 సభ్యదేశాలుగా ఉన్నాయి. అవి

  • అర్జెంటీనా
  • ఆస్ట్రేలియా
  • బ్రెజిల్‌జి
  • కెనడా
  • చైనా
  • ఫ్రాన్స్‌
  • జర్మనీ
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఇటలీ
  • దక్షిణ కొరియా
  • జపాన్‌
  • మెక్సికో
  • రష్యా
  • సౌదీ అరేబియా
  • దక్షిణ ఆఫ్రికా
  • టర్కీ
  • యునైటెడ్‌ కింగ్‌డమ్‌
  • యునైటేడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా
  • యూరోపియన్‌ యూనియన్‌

స్పెయిన్‌, యుఎన్‌, ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికన్‌ యూనియన్‌ మరియు ఎసియాన్‌ మాత్రమే అతిథులుగా ఆహ్వానించబడిన కొన్ని సంస్థలు.

➺ జీ20 సమ్మిట్‌ 2023 ఇతివృత్తం 

వసుదైన కుటుంబం అనేది 2023 సదస్సు ఇతివృత్తం. ఒకే భూమి, ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే భావనను స్పూర్తిగా తీసుకున్నారు. మహా ఉపనిషత్తులోని సంస్కృత రచనల్లో పేర్కొన్నట్లు సూక్ష్మజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబంగా జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుకు సాగుతాయనేది ‘‘వసుదైక కుటుంబం’’ అంతరార్థం. భూమిపై మనుగడ సాగిస్తున్న జీవజాలం మద్య అంతర్గత బంధాలు, సంపూర్ణ సమన్వయ వ్యవస్థల సమాహరమే వసుదైక కుటుంబం అని చాటిచెబుతూ దీనిని జీ20 సదస్సుకు ఇతివృత్తంగా తీసుకున్నారు. లైఫ్‌ ( లైఫ్‌ స్మైల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌) .. అంటే పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంభించాలని సదస్సుద్వారా జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిచ్చాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు హిత, సుస్థిర ప్రపంచాభివృద్ది సాధ్యమని జీ20 కూటమి భావిస్తుంది. 

➺ జీ20 సారథులను ఎలా నిర్ణయిస్తారు ?

జీ20 అనేది మొత్తం 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమి. ఇది ప్రపంచంలో మొత్తం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడిరట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. 

ఒక్కో గ్రూపు నుండి ఒక దేశం జీ20 సారథ్యం కోసం పోటీపడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం రోటేషన్‌ పద్దతిలో ఒక గ్రూపుకు సారథ్య బాధ్యతలు దక్కుతాయి. తమ గ్రూపు తరపున సారథ్య అవకాశం వచ్చినప్పుడు ఆ గ్రూపు నుండి ఎవరు అధ్యక్ష పదవికి పోటీ చేయాలనేది అంతర్గతంగా ఆ దేశాలు చర్చించుకుంటాయి. సారథ్యం వహించే దేశం కీలకమైన జీ20 అజెండా ఖరారు, సమావేశాల నిర్వహణ, ఖర్చులు భరించుకోవాల్సి ఉంటుంది. 

➺ జీ20 లోగో 

జీ20 లోగో భారతదేశ జాతీయ జెండా యొక్క శక్తివంతమైన రంగుల నుండి ప్రేరణ పొందింది - కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ మరియు నీలం. ఇది సవాళ్ల మధ్య వృద్ధిని ప్రతిబింబించే భారతదేశపు జాతీయ పుష్పమైన కమలంతో భూమిని జత చేస్తుంది. భూమి జీవితం పట్ల భారతదేశం యొక్క అనుకూల గ్రహ విధానాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రకృతితో సంపూర్ణ సామరస్యంతో ఉంటుంది. జి20 లోగో క్రింద దేవనాగరి లిపిలో ‘‘భారత్‌’’ అని వ్రాయబడింది.

➺ జీ20 తొలి సమావేశం ఎక్కడ జరిగింది ?

2008 సంవత్సరంలో అప్పటి ఆర్థిక సంక్షోభం కారణంగా జీ20 కూటమి పురుడుపోసుకుంది. అప్పటి యూరోపియన్‌ యూనియన్‌కు సారథ్యం వహిస్తున్న ప్రాన్స్‌ .. ప్రపంచం ఆర్థిక మాంధ్యం నుండి గట్టెక్కి ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పడేయాలని జీ20 కూటమిని ఏర్పాటు చేశారు. ‘‘పైనాన్షియల్‌ మార్కెట్లు ` ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’’ ఇతివృత్తంతో తొలి జీ20 సదస్సు 2008 సంవత్సరంలో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరిగింది. 

➺ జీ20 ఎలా పనిచేస్తుంది.

జి20 ప్రెసిడెన్సీ ఒక సంవత్సరం పాటు జి20 ఎజెండాను నిర్వహిస్తుంది మరియు సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. జి20 రెండు సమాంతర బాట (ట్రాక్‌) లను కలిగి ఉంటుంది: 

Also Read : Gk in Telugu

1) ఆర్థిక బాట (ఫైనాన్స్‌ ట్రాక్‌)

ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లు ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అనుసరించాల్సిన పరిష్కారాలు, అంతర్జాతీయ పన్ను విధానాలు, సంస్కరణల గురించి చర్చిస్తుంటారు. ఇందులో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆర్థికాభివృద్ది సమన్వయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. 

2) షెర్పా ట్రాక్‌. 

షెర్పాలు షెర్పా ట్రాక్‌కు నాయకత్వం వహిస్తారు.షెర్పా వైపు నుండి జి20 ప్రక్రియ సభ్య దేశాల షెర్పాలచే సమన్వయం చేయబడుతుంది, వీరు నాయకుల వ్యక్తిగత దూతలు. ఫైనాన్స్‌ ట్రాక్‌కు సభ్య దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లు నాయకత్వం వహిస్తారు. రెండు ట్రాక్‌లలో, సభ్యుల సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి అలాగే ఆహ్వానించబడిన/అతిథి దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థల నుండి ప్రతినిధులు పాల్గొనే నేపథ్య ఆధారిత వర్కింగ్‌ గ్రూపులు ఉన్నాయి.

ఫైనాన్స్‌ ట్రాక్‌ ప్రధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఉంటుంది. ఈ వర్కింగ్‌ గ్రూపులు ప్రతి ప్రెసిడెన్సీ వ్యవధిలో క్రమం తప్పకుండా సమావేశమవుతాయి. షెర్పాలు ఏడాది పొడవునా చర్చలను పర్యవేక్షిస్తారు, సమ్మిట్‌ కోసం ఎజెండా అంశాలను చర్చిస్తారు మరియు జి20 యొక్క ముఖ్యమైన పనిని సమన్వయం చేస్తారు.

అదనంగా, జి20 దేశాల పౌర సమాజాలు, పార్లమెంటేరియన్లు, థింక్‌ ట్యాంక్‌లు, మహిళలు, యువత, కార్మికులు, వ్యాపారాలు మరియు పరిశోధకులను ఒకచోట చేర్చే ఎంగేజ్‌మెంట్‌ గ్రూపులు ఉన్నాయి.

Related Posts : India Schemes 

గ్రూప్‌కు శాశ్వత సెక్రటేరియట్‌ లేదు. ప్రెసిడెన్సీకి ట్రోయికా మద్దతు ఇస్తుంది - మునుపటి, ప్రస్తుత మరియు ఇన్‌కమింగ్‌ ప్రెసిడెన్సీ. భారత అధ్యక్షుడి కాలంలో, త్రయం వరుసగా ఇండోనేషియా, ఇండియా మరియు బ్రెజిల్‌లను కలిగి ఉంటుంది.




Post a Comment

0 Comments