e- Rupee (Digital Currency) in telugu ఈ రూపీ - డిజిటల్‌ కరెన్సీ || Gk in Telugu || General Knowledge in Telugu



e- Rupee (Digital Currency) 

Gk in Telugu || General Knowledge in Telugu

ఈ రూపీ - డిజిటల్‌ కరెన్సీ  

సృజన్‌ హైద్రాబాద్‌లో వర్క్‌ చేస్తున్నాడు. పండుగ సమయం కాబట్టి తన సొంత ఊరుకు బయలుదేరాలని అనుకున్నాడు. తన తల్లి అడిగిన డబ్బులను, ప్రయాణికి అవసరమైన డబ్బులను తన పర్సులో పెట్టుకుని బయలుదేరాడు. పండుగ సీజన్‌ కావడంతో చాలా రద్దీగా ఉంది. దీంతో ఎంతో కష్టపడి వారీని వీరిని తోసుకుంటూ చివరకు తన సీటులో కూర్చున్నాడు. తర్వాత కండక్టర్‌ టికెట్‌ కోసం వచ్చినప్పుడు  డబ్బులు  తీసుకుందామని పర్సు కోసం జేబులో చెయ్యి పెట్టి ఖంగుతిన్నాడు. తను వచ్చే దారిలో రద్దీ ఉండడంతో తన యొక్క పర్సు ఎవరో దొంగిలించాడు. దీంతో చేసేదేమి లేక మిన్నకుండిపోయాడు. ఒకవేళ మన దగ్గర భౌతిక కరెన్సీ కాకుండా ‘‘ ఈ-రూపీ ’’ కరెన్సీ ఉంటే ఇలా జరిగేది కాదు కదా ! ఇటువంటి సమస్యలకు పరిష్కరించడానికే భారత ప్రభుత్వం భౌతిక కరెన్సీకి ప్రత్యాన్మాయంగా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ/ఈ-రూపీ) ని 1, డిసెంబర్‌ 2022 నుండి అందుబాటులోకీ తీసుకురావడం జరిగింది. ఇట్టి ఈ-రూపీ ఎలాంటి పనిచేస్తుంది, దీని పూర్వాపరాలు, బదిలీ విధానం సవివరంగా వివరించడం జరిగింది. 



కరెన్సీ నోటును డిజిటల్‌ రూపంలోకి తీసుకువచ్చి చలామణి చేయడమే ‘‘ ఈ-రూపీ ’’ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ రూపీ). రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిస్థితులకు అనుగుణంగా, ఆర్థిక ఒడిదుడుకులకు అనుగుణంగా కరెన్సీ నోట్లను ఎలా ముంద్రిస్తుందో అదేమాదిరిగా డిజిటల్‌ కరెన్సీని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు భౌతిక మరియు డిజిటల్‌ రూపీల మద్య సమన్వయం చేస్తు మానిటరింగ్‌ చేస్తుంది రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఇట్టి డిజిటల్‌ విలువలను ఆర్‌బిఐ బ్యాలన్స్‌ షీట్‌లో లయబిటిటీగా చూపించడం జరుగుతుంది. భౌతిక కరెన్సీ మాదిరిగానే దీనికి భారత రిజర్వు బ్యాంక్‌ యొక్క చట్టబద్దత ఉంటుంది కావున దీనికి దేశంలోని పౌరులందరు కరెన్సీ మాదిరిగా ఇతరులకు పంపిణీ చేసుకొని అవసరాలు తీర్చుకోవచ్చు. 

 ‘‘ ఈ రూపీ పనిచేసే విధానం ’’ :

ఈ-రూపీ వ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ రూపీ వ్యాలేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అందులో మనం లాగిన్‌ కావాలి. తర్వాత మన యొక్క బ్యాంక్‌ ఖాతా నుండి ఈ-రూపీ వ్యాలేట్‌ లోకి నగదు జమ చేసుకోవాలి. వినియోగదారుడు ఏ డినామినేషన్‌లో నగదు బదిలీ చేసుకోవాలో ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. 


ఉదాహరణకు వినియోగదారులు తన యొక్క ఈ`రూపీ వ్యాలేట్‌ లోకి 1000 రూపాయలు జమ చేయలనుకుంటే 500 డినామినేషన్‌లో రెండు ఈ`రూపీలు, 200 డినామినేషన్‌లో 5 ఈ-రూపీలు, 1 డినామినేషన్‌లో 1000 ఈ-రూపీలు జమచేసుకునే అవకాశం ఉంటుంది. మనం వ్యాలేట్‌లో జమచేసుకున్న ఈ`రూపీలు భౌతిక కరెన్సీ మాదిరిగా చలామణి చేసి లావాదేవీలు కొనసాగించవచ్చు. భౌతిక కరెన్సీ చలామణి అవుతున్న అన్ని రకాల డినామినేషన్‌లో ఈ-రూపీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

 బదిలీ విధానం :

ఒక వ్యక్తి నుండి మరోక వ్యక్తికి గాని, ఒక వ్యక్తి నుండి సంస్థకు గాని, ఒక వ్యక్తి మరో వ్యాపారికి గాని ఇట్టి ఈ`రూపీ బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం మరోక వ్యక్తికి, సంస్థకు, వ్యాపారికి ఈ-రూపీ బదిలీ చేయాలనుకుంటే వారికి కూడా ఈ`రూపీ వ్యాలేట్‌ ఉండాలి. అప్పుడే బదిలీ జరుగుతుంది. ఇది అచ్చం మనం యుపిఐ యాప్‌ ద్వారా చెల్లింపులు చేసేవిధంగా ఉంటుంది. యుపిఐ స్కాన్‌ చేసిన వెంటనే అవతలి వ్యక్తి వ్యాలేట్‌లోకి ఈ`రూపీ జమ కావడం జరుగుతుంది. 

➠  ఉపయోగాలు -

1. భౌతిక కరెన్సీ అయితే నకిలీలను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈ-రూపీ అయితే అలాంటి అవకాశం ఉండదు. దొంగనోట్లు తయారు చేసే వారికి చెక్‌పెట్టె అవకాశం ఉంటుంది. 

2. ఒకవేళ మన వ్యాలేట్‌ వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ పోతే వెంటనే బ్యాంక్‌ వారికి సమాచారం అందించి మన వ్యాలేట్‌ ఉన్న ఈ-రూపీలను మన ఖాతాకు జమ చేసుకోవచ్చు. 

3. ప్రతి లావాదేవీ టోకెనైజ్డ్‌ రూపంలో యూనిక్‌గా భద్రంగా ఉంటుంది. ఇంటర్నేట్‌ సరఫరాలో అవాంతరం ఏర్పడితే టోకెనైజ్డ్‌ కాదు. కనుక విఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

4. ప్రభుత్వం భౌతిక కరెన్సీ ముద్రించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ-రూపీ కి ఇలాంటి ఖర్చులు ఏమి ఉండవు. డిజిటల్‌ రూపంలో నగదు చలామణీలో ఉంటుంది.  

➠ నష్టాలు -

1. మనం ఒక సూపర్‌మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేస్తే మన వస్తువుల యొక్క బిల్లు మొత్తం 523 రూపాయలు అయిందని అనుకుందాం అప్పుడు మన ఈ-రూపీ వ్యాలెట్‌ ద్వారా చెల్లింపు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన యొక్క ఈ-రూపీ వ్యాలేట్‌లో భౌతిక కరెన్సీ చలామణిలో ఉన్న డినామినేషన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున మనం 1, 2, 5, 10, 20, 50, 100, 500, 2000 డినామినేషన్‌లలో మాత్రమే చెల్లింపులు చేయగలము. కానీ 37 రూపాయలు చెల్లింపులు చేయలేము. ఇట్టి సమస్యను భవిష్యత్తులో పరిష్కరించే అవకాశం ఉంది. 

➺ వడ్డీ లెక్కింపు ఉండదు :

మన బ్యాంక్‌ ఖాతాలో ఉన్న భౌతిక కరెన్సీ వడ్డీ లెక్కకట్టి మనకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ-రూపీ విషయంలో అలా ఉండదు. మన వ్యాలేట్‌లో ఎన్ని ఈ`రూపీలు అయిన ఉండని వాటికి వడ్డీ లెక్కించడం జరగదు. మన వ్యాలేట్‌ ఉన్న ఈ-రూపీలను మన ఖాతాలోకి బదిలీ చేసిన వెంటనే అట్టి భౌతిక కరెన్సీకి వడ్డీ లెక్కించడం జరుగుతుంది. 

 ఎప్పటినుండి అమలు అవుతుంది :

డిసెంబర్‌ 1, 2022 నుండి ఈ-రూపీ చలామణీలోకి తీసుకుని వచ్చారు. ఇట్టి చలామణీ కొద్ది నగరాల(మహరాష్ట్ర రాజధాని ముంబై, భారత రాజధాని ఢల్లీి, కర్ణాటక రాజధాని బెంగళూరు, ఓడిసా రాజధాని భువనేశ్వర్‌ కే పరిమితం చేసినారు. ఇట్టి నగరాలలో పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత ఇందులో వచ్చే లోపాలను గుర్తించి దానిని పరిష్కరించిన తర్వాత మిగతా నగరాలలో పూర్తి స్థాయిలో చలామణిలోకి తీసుకురానున్నారు. పైలట్‌ ప్రాజేక్టు కింద ఈ-రూపీ లావాదేవీలు పూర్తయ్యే బాద్యతను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ (ఎన్‌పీసీఐ) చూస్తుంది. లావాదేవీలలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఎన్‌పీసీఐ పరిష్కరిస్తుంది. మొబైల్‌ బ్యాంక్‌ంగ్‌ను తరచూ వినియోగించే కస్టమర్లు, డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్న వారి నుండి కొందరిని ప్రయోగాత్మక పరీక్షల కోసం బ్యాంక్‌లు ఎంపిక చేసుకున్నాయి. అలా ఎంపిక చేసిన వారి ఫోన్లను ఈ రూపీ వ్యాలెట్‌ లింక్‌న పంపిస్తాయి. ఒకవేళ బ్యాంక్‌నుండి ఎటువంటి సందేశం కానీ, యుఆర్‌ఎల్‌ లింక్‌ కానీ రానివార ఈ`రూపీ వ్యాలెట్‌ పట్ల ఆసక్తి ఉంటే బ్యాంక్‌ మేనేజర్‌ ను సంప్రదించవచ్చు. అభ్యర్థను అమోదించు / తిరస్కరించే విచక్షణ వారికే ఉంటుంది. 



Post a Comment

0 Comments