Telangana rivers gk quiz test in telugu || Telangana river system qk questions in telugu

telangana quiz in telugu

Telangana Rivers Gk Questions in telugu 

1) గోదావరి నది జన్మస్థలం ఏది ?

ఎ) బాలగాఘట్‌

బి) మహబళేశ్వరం

సి) త్రయంబకం

డి) కందుకూరు

జవాబు ః సి (త్రయంబకం)

గోదావరి నది మహరాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతంలోని త్రయంబకంలో జన్మించింది. 

2) గోదావరి నది తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ?

ఎ) 1465 కి.మీ

బి) 1565 కి.మీ

సి) 1665 కి.మీ

డి) 1765 కి.మీ

జవాబు ః ఎ (1465 కి.మీ) 

గోదావరి నది తెలంగాణలోని 8 జిల్లాల మీదుగా 1465 కి.మీ ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 

3) కింది వానిలో గోదావరి నది ప్రవహించని జిల్లా ఏది ?

ఎ) ములుగు

బి) నిజామాబాద్‌

సి) జగిత్యాల

డి) కరీంనగర్‌ 

జవాబు ః డి (కరీంనగర్‌ )

గోదావరి నది తెలంగాణలో నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. 

4) తెలంగాణలో గోదావది నది పరివాహక ప్రాంతం ఎంత శాతం ఉంది ?

ఎ) 79 శాతం

బి) 65 శాతం

సి) 45  శాతం 

డి) 53  శాతం 

జవాబు ః  ఎ (79 శాతం)

తెలంగాణలో గోదావరి నది 3,12,812 చ.కి.మీ పరివాహక ప్రాంతం కలదు.

5) తెలంగాణలో గోదావది నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ?

ఎ) 750 కి.మీ

బి) 520  కి.మీ

సి) 600 కి.మీ

డి) 780 కి.మీ

జవాబు ః సి (600 కి.మీ)

తెలంగాణలో గోదావరి నది సుమారు 600 కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో గోదావరి బేసిన్‌ తెలంగాణకు 19.87 శాతంగా ఉంది. 

6) గోదావరి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ?

ఎ) 12 సంవత్సరాలు

బి) 9 సంవత్సరాలు

సి) 6 సంవత్సరాలు

డి) 3 సంవత్సరాలు 

జవాబు ః ఎ (12 సంవత్సరాలు)

చివరిసారి గోదావరి పుష్కరాలు 2015 సంవత్సరంలో జరిగాయి. 

7) కింది వానిలో గోదావరి నది ఉపనది కానిది ఏది ?

ఎ) ప్రాణహిత

బి) వార్ధా

సి) కిన్నెరసాని

డి) హలియా

జవాబు ః డి (హలియా)

గోదావరి నదికి ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్దా, పెన్‌గంగ, వెయిన్‌గంగ, మానేరు, హరిద్రా, కడెం, పెద్దవాగు ఉపనదులు కలవు. 

8) మంజీరా నది జన్మస్థలం ఎక్కడ ఉంది ?

ఎ) మహబళేశ్వరం

బి) సాత్పూరా

సి) బాలాఘట్‌ 

డి) కందుకూరు

జవాబు : సి (బాలాఘట్‌)

మంజీరా నది మహరాష్ట్రలోని బీడ్‌  జిల్లా బాలాఘడ్‌ పర్వతాలలో జన్మిస్తుంది. మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా 644 కి.మీ ప్రయాణిస్తుంది. 

9) కింది వానిలో మంజీరా నది ప్రవహించని జిల్లా ఏది ?

ఎ) నిర్మల్‌

బి) సంగారెడ్డి

సి) కామారెడ్డి

డి) నిజామాబాద్‌ 

జవాబు- ఎ (నిర్మల్‌)

మంజీరా నది తెలంగాణలో సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, జిల్లాలలో ప్రవహిస్తుంది. 

10) త్రివేణి సంగమం ఎక్కడ ఏర్పడుతుంది ?

ఎ) నారాయణఘేడ్‌ 

బి) మేడారం 

సి) బతాయి

డి) కందకుర్తి 

జవాబు ః డి (కందకుర్తి)

నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి, హరిద్రా, మంజీరా నదులు కలస్తున్నందున ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. 

11) మూడు నదుల కలయికతో ఏర్పడే నది ఏది ?

ఎ) వెన్‌గంగా నది 

బి) మంజీరా నది 

సి) ప్రాణహిత నది

డి) కడెం నది 

జవాబు ః ప్రాణహిత నది 

ఇది వెన్‌గంగా, వార్ధా, పెన్‌గంగా నదుల కలయితో ఏర్పడుతుంది. 

12) అత్యంత వేగంగా ప్రవహించే ఉపనది ఏది ?

ఎ) ప్రాణహిత 

బి) కిన్నెరసాని 

సి) హరిద్రా 

డి) మానేరు 

జవాబు ః ప్రాణహిత

13) ఏ నది పరివాహక ప్రాంతంలో కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం కలదు  ?

ఎ) పెన్‌గంగా 

బి) ప్రాణహిత

సి) కిన్నెరసాని 

డి) కడెం 

జవాబు ః కడెం నది 

14) జలపాతాలు ఎక్కువగా ఉన్న నది ఏది ?

ఎ) ప్రాణహిత 

బి) ఇంద్రావతి 

సి) కడెం 

డి) కడెం 

జవాబు ః డి (కడెం)

ఈ నదిపై కుంతాల, పొచ్చెర, గాయత్రి వంటి జలపాతాలు కలవు. 

15) ఇంద్రావతి నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది ?

ఎ) మహరాష్ట్ర

బి) మద్యప్రదేశ్‌ 

సి) ఒడిసా

డి) చత్తిస్‌ఘడ్‌ 

జవాబు ః సి (ఒడిసా) 

ఈ నది ఒడిసాలోని కలహండి జిల్లా లో జన్మిస్తుంది. 

16) గోదావరి నదికి ఎన్ని రివర్‌ బేసిన్‌లు ఉన్నాయి ?

ఎ) 14

బి) 12

సి) 15

డి) 18

జవాబు ః 12

అత్యధిక రివర్‌ బేసిన్‌ ప్రాణహితకు ఉంది. 

17) మంజీర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ది ?

ఎ) మగ్గర్‌ మొసళ్లు 

బి) నాలుగు కొమ్ముల జింకలు 

సి) పులులు 

డి) కృష్ణజింకలు 

జవాబు  ః ఎ (మగ్గర్‌ మొసళ్లు)

ఇక్కడ మగ్గర్‌ మొసళ్లతో పాటు తాబేల్లు, పక్షులకు ప్రసిద్ది. 

18) మంజీర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ది ?

ఎ) మగ్గర్‌ మొసళ్లు 

బి) నాలుగు కొమ్ముల జింకలు 

సి) పులులు 

డి) కృష్ణజింకలు 

జవాబు  ః ఎ (మగ్గర్‌ మొసళ్లు)

ఇక్కడ మగ్గర్‌ మొసళ్లతో పాటు తాబేల్లు, పక్షులకు ప్రసిద్ది. 

19) ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?

ఎ) కామారెడ్డి

బి) నిర్మల్‌ 

సి) మంచిర్యాల

డి) జయశంకర్‌భూపాలపల్లి 

జవాబు ః సి (మంచిర్యాల)

ప్రాణహిత సంరక్షణ కేంద్రం కృష్ణజింకలకు ప్రసిద్ది చెందింది. 

20) కింది వానిలో పులుల సంరక్షణ కేంద్రం ఏది ?

ఎ) మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

బి) పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

సి) శివ్వారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

డి) కవ్వాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

జవాబు ః డి (కవ్వాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం)

21) కృష్ణనది జన్మస్థలం ఏది ?

ఎ) మహబలేశ్వరం 

బి) త్రయంబకం 

సి) సింకారా కొండలు 

డి) సాత్పూరా పర్వతాలు 

జవాబు ః ఎ (మహబలేశ్వరం)

కృష్ణనది సహ్యద్రి పర్వత శ్రేణుల్లో మహరాష్ట్ర పతారా జిల్లా, జోర్‌ గ్రామం మహబలేశ్వరం వద్ద జన్మించింది. 

22) కృష్ణనది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ?

ఎ) 1560 కి.మీ

బి) 1670 కి.మీ

సి) 1400 కి.మీ

డి) 1250 కి.మీ

జవాబు ః సి (1400 కి.మీ)

కృష్ణనది నాలుగు రాష్ట్రాల గుండా మొత్తం 1400 కి.మీ ప్రయాణిస్తుంది. 

23) కృష్ణనది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ?

ఎ) 450 కి.మీ

బి) 516 కి.మీ

సి) 630 కి.మీ

డి) 416 కి.మీ

జవాబు ః డి (416 కి.మీ)

 ఇది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్‌ జిల్లాలోని మక్తల్‌ మండలం, తంగడి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. 

24) కింది వానిలో కృష్ణ నదికి కుడివైపు లేని ఉపనది ఏది ?

ఎ) ఘట ప్రభ

బి) తుంగుభద్ర

సి) భీమా

డి) పంచగంగ

జవాబు ః సిఇ (భీమా)

కృష్ణనదికి కుడివైపున ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయన, పంచగంగ, దూద్‌గంగా, హంద్రినివా, ఎడమవైపున భీమా, మూసి, మున్నేరు, దిండి, పాలేరు, హలియా, ఆలేరు, వైరా, వర్ణ, కాగ్నా, వైరా, పెద్దవాగు అనే ఉపనదులు ఉన్నాయి. 

25) కృష్ణనది ఉపనదులు అతిపెద్ద ఉపనది ఏది ?

ఎ) పంచగంగ

బి) భీమా 

సి) పాలేరు

డి) తుంగభద్ర

జవాబు ః డి (తుంగభద్ర) 

ఇది 531 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 

26) తుంగభద్ర నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది ?

ఎ) కర్ణాటక

బి) తెలంగాణ 

సి) మహారాష్ట్రం

డి) ఆంధ్రప్రదేశ్‌ 

జవాబు ః ఎ (కర్ణాటక)

ఇది కర్ణాటకలోని వరాహా పర్వతాలలో గంగమూల వద్ద జన్మిస్తుంది. 

27) మూసీ నదిపై ఉస్మాన్‌ సాగర్‌ ఏ సంవత్సరంలో నిర్మించారు ?

ఎ) 1920

బి) 1930

సి) 1940

డి) 1950

జవాబు ః ఎ (1920)

28) హిమయత్‌ సాగర్‌ ఏ నదిపై నిర్మించారు ?

ఎ) మూసి

బి) భీమా 

సి) కోయన

డి) ఈసా

జవాబు ః డి (ఈసా)

దీనిని 1927 సంవత్సరంలో నిర్మించారు. 

29) భీమా నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ?

ఎ) 763 కి.మీ 

బి) 432 కి.మీ 

సి) 861 కి.మీ

డి) 369 కి.మీ 

జవాబు ః సి (861 కి.మీ)

దీనికి కాగ్నా అనే ఉపనది కలదు. ఇది మహరాష్ట్రలోని సహ్యద్రి పర్వతాల్లో జన్మిస్తుంది 

30) ప్రపంచంలో అతిపెద్ద, అతి ఎత్తయిన రాతికట్టడంతో కట్టిన ప్రాజేక్టు ఏది ?

ఎ) జూరాల / ప్రియదర్శిని ప్రాజేక్టు

బి) కాళేశ్వరం ప్రాజేక్టు 

సి) ఉస్మాన్‌ సాగర్‌ ప్రాజేక్టు 

డి) నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు 

జవాబు ః డి (నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు) 

ఇది 1450 మీటర్ల పొడవు, 125 మీటర్ల ఎత్తు ఉంది. 

31) నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు నీల్వ సామర్థ్యం ఎంత ?

ఎ) 415 టిఎంసి

బి) 425 టిఎంసి

సి) 408 టిఎంసి

డి) 432 టిఎంసి 

జవాబు ః సి (408 టిఎంసి)

ఇది 590 ఎఫ్‌ఆర్‌ఎల్‌ కల్గి ఉంది. 

32) కృష్టానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత నిర్మించిన మొదటి ప్రాజేక్టు ఏది ?

ఎ) నాగార్జున సాగర్‌ 

బి) జూరాల / ప్రియదర్శిని 

సి) ఉస్మాన్‌ సాగర్‌ 

డి) వైరా

జవాబు ః బి (జూరాల) 

దీనిని జోగులాంబ గద్వాల్‌ జిల్లా, థరూర్‌ మండలం, రేవుల పల్లి వద్ద నిర్మించారు. 

33) దేశంలో అత్యధిక బ్లాకులు కల్గిన ప్రాజేక్టు ఏది ? 

ఎ) జూరాల / ప్రియదర్శిని 

బి) నాగార్జున సాగర్‌ 

సి) ఉస్మాన్‌ సాగర్‌ 

డి) వైరా

జవాబు ః ఎ (జూరాల) 

దీనికి 86 కల్గి ఉండి దేశంలో అత్యధిక బ్లాకులు కల్గిన ప్రాజేక్టుగా పేరుగాంచింది.  

34) అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది ?

ఎ) జోగులాంబ గద్వాల్‌ 

బి) నారాయణపేట్‌ 

సి) నాగర్‌ కర్నూల్‌ 

డి) మహబూబ్‌నగర్‌ 

జవాబు ః సి (నాగర్‌కర్నూల్‌) 

35) భారతదేశంలో మొట్టమొదటి థర్మల్‌ పవర్‌  స్టేషన్‌గా పేరుగాంచింది ఏది ?

ఎ) ఉస్మాన్‌ సాగర్‌ 

బి) హుస్సెన్‌సాగర్‌ 

సి) హిమయత్‌సాగర్‌ 

డి) వైరా ప్రాజేక్టు 

జవాబు ః బి (హుస్సెన్‌ సాగర్‌) 

36) క్రింది వానిలో కృష్ణనదికి ఉపనది కానిది ఏది ?

ఎ) మున్నేరు

బి) తుంగభద్ర

సి) హంద్రినివా

డి) ప్రాణహిత

జవాబు ః డి (ప్రాణహిత)

ప్రాణహిత గోదావరి నదికి ఉపనది .

37) క్రింది వానిలో భీమా నది ఉపనది ఏది ?

ఎ) కొంగల్‌ 

బి) కాగ్నా

సి) కోయిల్‌ సాగర్‌ 

డి) నెట్టెపాడు 

జవాబు ః బి (కాగ్నా) 

38) మూసీ నది ఏ జిల్లాలో జన్మించింది ?

ఎ) మహబూబ్‌ నగర్‌ 

బి) రంగారెడ్డి

సి) నాగర్‌కర్నూల్‌ 

డి) ఖమ్మం 

జవాబు ః రంగారెడ్డి 

39) ద్వీపకల్ప నదులన్నింటిలో అతిపెద్ద నది ఏది ?

ఎ) కృష్ణ

బి) తుంగభద్ర

సి) మంజీరా

డి) గోదావరి 

జవాబు ః డి (గోదావరి) 

40) కిందివానిలో గోదావరి నదికి  కుడివైపు లేని ఉపనది ఏది ?

ఎ) మంజీరా

బి) హరిద్రా

సి) శబరి

డి) మానేరు

జవాబు ; సి(శబరి)

గోదావరి నదికి కుడివైపు మంజీరా, హరిద్రా, మానేరు, కిన్నెరసాని, మూల, ప్రవరలు ఎడమవైపు కడెం, పెన్‌గంగా, వార్దా,  వెన్‌గంగా, ప్రాణహిత, పెద్దవాగు, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉపనదులు ఉన్నాయి.

Post a Comment

0 Comments