
‘‘పద్మ’’ అవార్డులు -2023 తెలుగులో
Padma Vibhushan - Padmabhushan - Padmasri Awards in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
దేశ ఉన్నత పురస్కారం అయిన ‘‘ పద్మ ’’ అవార్డులు - 2023 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్య్ర దినోత్సవం సందర్బంగ ఈ అవార్డులను ప్రకటిస్తారు. 2023 సంవత్సరానికి గాను మొత్తం 106 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో అనగా కళ, సామాజిక పని, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వాటిల్లో విశేష ప్రతిభ కనబర్చిన దేశంలోని వ్యక్తులకు ఈ 'పద్మ' అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేస్తారు.
2023 'పద్మ' అవార్డులలో 6 గురు పద్మవిభూషణ్, 9 మంది పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులను స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర హోంశాఖ ఈ అవార్డులను విడుదల చేసింది.
➫ పద్మవిభూషణ్ అవార్డులు స్వీకరించినవారు :
1) బాలకృష్ణ దోషి (గుజరాత్) - ఆర్కిటెక్చర్ (మరణాంతరం)
2) జాకీర్ హుస్సెన్ (మహరాష్ట్ర-తబలా విద్వాంసుడు) - ఆర్ట్స్
3) కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (కర్టాటక) - పబ్లిక్‌అపైర్స్
4) దిలీప్ కుమార్ (మెడిసిన్) - పశ్చిమ బెంగాల్
5) శ్రీనివాస్ వరదాన్ (ఆమెరికా) - సైన్ అండ్ ఇంజనీరింగ్
6) ములాయంసింగ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) -పబ్లిక్ అపైర్స్ )-మరణాంతరం
➫ పద్మభూషణ్ :
1) ఎస్‌ఎల్ బైరప్ప (కర్టాటక) -లిటరేచర్ అండ్ విద్య
2) కుమార మంగళం బిర్లా (మహారాష్ట్ర) ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ
3) దీపక్ ధార్ (మహారాష్ట్ర)-సైన్స్ అండ్ ఇంజనీరింగ్
4) వాణి జయరాం (తమిళనాడు) - ఆర్ట్స్
5) చినజియర్ స్వామి (తెలంగాణ) ఆధ్యాత్మికం
6) సుమన్ కళ్యాణ్‌పూర్ (మహరాష్ట్ర) - ఆర్ట్స్
7) కపిల్ కుమార్ (ఢల్లీి) లిటరేచర్ అండ్ ఎడ్యూకేషన్
8) సుధామూర్తి (కర్టాటక) - సామాజిక సేవ
9) కమలేశ్ పటేల్ (తెలంగాణ ) ఆధ్యాత్మికం
➥ తెలంగాణ రాష్ట్రం నుండి పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన వారు :
1) ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజియర్ స్వామి,
2) కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
➥ తెలంగాణ రాష్ట్రం నుండి పద్మశ్రీ స్వీకరించిన వారు:
1) మోదడుగు విజయ్ గుప్తా (సైన్ అండ్ ఇంజీనిరింగ్)
2) హనుమంతరావు పసుపులేటి (మెడిసిన్)
3) రామకృాష్ణరెడ్డి (విద్య)
0 Comments