
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే " వాగీర్ " సబ్‌మెరైన్
What is INS Vagir ?
Gk in Telugu || General Knowledge in Telugu
భారత నేవి అమ్ములపొదిలోకి మరోక పదునైన అస్త్రం వచ్చి చేరింది. సముద్రలోతుల్లో ప్రయాణిస్తు , శత్రువుల స్థావారాలను చీల్చి చెండాడే " ఐఎన్‌ఎస్ వాగీర్ " జలాంతర్గామి (సబ్ మెరైన్) భారత జలాల్లోకి ప్రవేశించింది. భారత నావీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ చేతులమీదుగా 23 జనవరి 2022 రోజున ముంబైలోని నావల్‌డక్‌యార్డులో ఈ అత్యాధునిక సబ్‌మెరైన్ వాగీర్‌ను సముద్ర జలాలలోకి ప్రవేశపెట్టారు. ఈ సబ్‌మెరైన్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రాన్స్ దేశం నుండి తీసుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ వాగీర్ జలాంతర్గామి శత్రువులను దెబ్బతీసేందుకు ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్, నిఘా పెంచడం కోసం భారత నావికాదళానికి విశేష సేవలందిస్తుంది. ఇంటెలిజెన్స్, నిఘా, మోహరింపు విభాగాల్లో నేవీ సామార్థ్యాన్ని వాగీర్ పరిపుష్టం చేస్తుంది. మజ్‌గావ్‌డాక్ షిప్‌యార్డు లిమిటెడ్ అనే కంపనీ దీనిని తయారు చేసింది. వాగీర్ అంటే సొర చేప అని అర్థం వస్తుంది. ఈ సొరచేప ఎలాగైతే నిశ్వబ్దంగా, ఎలాంటి భయంలేకుండా పని ముగిస్తుందో అలాగే ఈ వాగీర్ కూడా శత్రువులను దెబ్బతీస్తుంది. అందుకే దీనికి ఇసుక షార్క్ చేప (వాగీర్) పేరును దీనికి పెట్టారు.
➬ వాగీర్ జలాంతర్గామి ప్రత్యేకతలు :
- ఈ వాగీర్ రూపకల్పన కోసం ప్రపంచంలో అత్యుత్తమ సెన్సార్లు దీనికి ఉపయోగించారు. దీనివల్ల శత్రువుల రాడార్‌ల కన్నుగప్పి వారి జలస్థావరాల్లోకి ప్రవేశిస్తుంది.
- అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక ఆయుధాలు దీని సొంతం.
- మెరైన్ కమాండోలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించేందుకు అనుకూలంగా దీనిని రూపొందించారు. ఈ సబ్‌మెరైన్‌లో డిజిల్ ఇంజన్లు స్టీల్త్ మిషన్ కోసం అత్యంత వేగంగా బ్యాటరీలను చార్జీంగ్ చేస్తాయి.
- స్వీయ రక్షణ కోసం దీనిలో అత్యాధునిక టార్పెడో డెకాయ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అతిపెద్ద షిప్‌లను తునాతునకలు చేయడానికి వైర్‌గైడెడ్ టార్పెడోలు ఇందులో ఉపయోగించారు.
- దీనిని ఉపరితనం నుండి ఉపరితలం (సర్పెస్ టు సర్పెస్) మిసైల్‌గా రూపొందించారు.
- సముద్రం మద్యలో, ఒడ్డుకు దగ్గర్లో కూడా వాగీర్‌ను మోహరించవచ్చు.
- యాంటీ సర్పెస్ వార్, యాంటీ సభ్‌మెరైన్ వార్, మైన్స్ పెట్టడం నిఘాపెట్టడం వాగీర్ ప్రత్యేకత.
- ఈ జలాంతర్గామి నీటిలో గంటకు 40 కిలోమీటర్లు, నీటి ఉపరితలంపై 20 కి.మీ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.
- దీనిని 21 మీటర్ల ఎత్తు, 221 అడుగుల పొడవుతో తయారు చేశారు.
- కల్వరీ క్లాస్‌లో దీనిని 5వ సబ్‌మెరైన్ గా రూపొందించారు.
- దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుండి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు.
- స్పెషల్ ఆపరేషన్స్‌లో మెరైన్ కమెండోలను శత్రు స్థావారాల్లోకి చడీచప్పుడు లేకుండా తరలిస్తుంది.
- శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయరక్షణ వ్యవస్థతో దీనిని రూపొందించారు.
- ఇది అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణిస్తు శత్రు సబ్‌మెరైన్‌లను, యుద్దనౌకలను ఏమార్చగలదు.
- ప్రాజేక్టు 75 కింద నిర్మించిన ఐదో డిజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ వాగీర్ జలాంతర్గామి
0 Comments