Colgate Scholarship in Telugu - కోల్గేట్‌ స్కాలర్‌షిప్స్‌ -2023

 కోల్గేట్‌ స్కాలర్‌షిప్స్‌ / కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 

కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వివిధ వర్గాల విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్‌షిప్‌లను ప్రారంభించింది. అర్హులైన, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సమస్యల  కారణంగా వారి కలలను నెరవేర్చుకోలేని విద్యార్థులకు కోల్‌గేట్‌ స్కాలర్‌షిప్‌ అందించబడుతుంది.  ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ కలలను సాధించడానికి ఆర్థిక వనరులను సమకూరుస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌తో పాటు అవసరమైనప్పుడు అభ్యర్థులకు మెంటర్‌షిప్‌ మరియు కేరీర్‌ గైడెన్స్‌ అందిస్తుంది. 

ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇప్పటివరకు 65000 మంది విద్యార్థులకు తమ బంగారు భవిష్యత్తు తిర్చిదిద్దుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందించింది. మరియు నిరాటంకంగా కొనసాగిస్తుంది.

సమాజంలో చాలా మంది ప్రతిభావంతులైన మరియు అర్హులైన విద్యార్థులు తమ నిరుపేద పరిస్థితుల కారణంగా, ఆర్థిక వనరుల లేక తమ యొక్క పై చదువులను మద్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది  దీంతో వారి బంగారు భవిష్యత్తుకు ఆటంకం కల్గుతుంది. దీంతో వారికి సమాజానికి మద్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. దీనిని పరిగణలోకి తీసుకొని కోల్‌గేట్‌ వివిధ రకాల కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ పథకాల కింద, 11వ తరగతి గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి వివిధ రకాల స్కాలర్‌షిప్‌లు అందించబడతాయి. కోల్‌గేట్‌ స్కాలర్‌షిప్‌ సహాయంతో, ఎంపికైన అభ్యర్థులు ఆర్థిక సహాయం పొందగలుగుతారు మరియు వారు తమ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఎటువంటి ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోకుండా భరోసా కల్పిస్తుంది.

కోల్గేట్‌ స్కాలర్‌షిప్‌ రకాలు  :

ఇంజినీరింగ్‌ కోర్సులలో వృత్తి విద్యా కోర్సులలో గ్రాడ్యుయేట్‌ చేస్తున్న / 11వ తరగతి విద్యార్థులకు / బిడిఎస్‌ చదువుతున్న విద్యార్థులకు కీపింగ్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అందించబడే అనేక రకాల కోల్‌గేట్‌ స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అవి 

  • 11వ తరగతి కోసం కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌
  • 3 సంవత్సరాల డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ కోసం కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌
  • బి.డి.ఎస్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల కోసం కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

3 సంవత్సరాల డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ కోసం కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ :

ఈ ప్రోగ్రామ్‌ కొరకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కల్గి ఉండాలి 

1) 12వ తరగతి బోర్డు ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

2) 12వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

3) ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజిలో 3 సంవత్సరాల గ్రాడ్యువేషన్‌ కోర్సులో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

4) కుటుంబ సంవత్సర ఆదాయం 5 లక్షలకు మించరాదు. 

 స్కాలర్‌షిప్‌ మొత్తం :

ఎంపికైన అభ్యర్థులకు 3 సంవత్సల గ్రాడ్యువేషన్‌ కోర్సు పూర్తి అయ్యేంతవరకు ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. 

 అవసరమైన ధృవీకరణ పత్రాలు :

1) పాస్‌పోర్టు సైజు ఫోటో 

2) గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఓటరు గుర్తింపు కార్డు/పాన్‌కార్డు

3) ఆదాయం సర్టిఫికేట్‌ / బిపిఎల్‌ సర్టిఫికేట్‌  / రేషన్‌ కార్డు/ ఆదాయం ధృవీకరించే ఏదేని పత్రము 

4) 12వ తరగతి మార్కుల మెమో 

5) గ్రాడ్యువేషన్‌లో ప్రవేశం పొందినట్లుగా ఫీజు రశీదు/అడ్మిషన్‌ లెటర్‌ / కాలేజ్‌ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ 

6) ఒకవేళ వికలాంగులు అయితే వికలాంగ సర్టిఫికేట్‌ 

➠ 11వ తరగతి కోసం కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ :

ఈ ప్రోగ్రామ్‌ కొరకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కల్గి ఉండాలి 

1) 10వ తరగతి బోర్డు ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

2) 10వ తరగతిలో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

3) ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజిలో 11వ తరగతిలో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

4) కుటుంబ సంవత్సర ఆదాయం 5 లక్షలకు మించరాదు. 

స్కాలర్‌షిప్‌ మొత్తం 

ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల కోర్సు పూర్తి అయ్యేంతవరకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. 

అవసరమైన ధృవీకరణ పత్రాలు 

1) పాస్‌పోర్టు సైజు ఫోటో 

2) గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఓటరు గుర్తింపు కార్డు/పాన్‌కార్డు

3) ఆదాయం సర్టిఫికేట్‌ / బిపిఎల్‌ సర్టిఫికేట్‌  / రేషన్‌ కార్డు/ ఆదాయం ధృవీకరించే ఏదేని పత్రము 

4) 10వ తరగతి మార్కుల మెమో 

5) ఒకవేళ వికలాంగులు అయితే వికలాంగ సర్టిఫికేట్‌ 

6) 11వ తరగతిలో ప్రవేశం పొందినట్లుగా ఫీజు రశీదు/అడ్మిషన్‌ లెటర్‌ / కాలేజ్‌ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ 

➠ బి.డి.ఎస్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల కోసం కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 

ఈ ప్రోగ్రామ్‌ కొరకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కల్గి ఉండాలి 

1) 12వ తరగతి బోర్డు ఎగ్జామినేషన్‌లో 2021 లేదా 2022 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

2) 12వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

3) ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజిలో మొదటి సంవత్సరం బిడిఎస్‌లో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

4) కుటుంబ సంవత్సర ఆదాయం 5 లక్షలకు మించరాదు. 

స్కాలర్‌షిప్‌ మొత్తం 

ఎంపికైన అభ్యర్థులకు 4 సంవత్సరాల కోర్సు పూర్తి అయ్యేంతవరకు ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. 

అవసరమైన ధృవీకరణ పత్రాలు 

1) పాస్‌పోర్టు సైజు ఫోటో 

2) గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఓటరు గుర్తింపు కార్డు/పాన్‌కార్డు

3) ఆదాయం సర్టిఫికేట్‌ / బిపిఎల్‌ సర్టిఫికేట్‌  / రేషన్‌ కార్డు/ ఆదాయం ధృవీకరించే ఏదేని పత్రము 

4) 12వ తరగతి మార్కుల మెమో 

5) ఒకవేళ వికలాంగులు అయితే వికలాంగ సర్టిఫికేట్‌ 

6) ప్రవేశం పొందినట్లుగా ఫీజు రశీదు/అడ్మిషన్‌ లెటర్‌ / కాలేజ్‌ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ 

7) ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ రిజల్ట్‌

➠ కోల్‌గేట్‌ స్కాలర్‌షిప్‌ ముఖ్యమైన తేదీలు :

కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా 11వ తరగతి / 3 సంవత్సరాల గ్రాడ్యువేషన్‌ / బిడిఎస్‌ చదివే విద్యార్థులకు చివరి తేదీ 31.03.2023 లోగా తమ ధరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. ఈ ఎంపిక ప్రక్రియ అనే పూర్తిగా కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కు లోబడి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు. కేవలం ఇది ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకునే వీలుఉంటుంది. 

స్కాలర్‌షిప్‌ పేరు కోల్గేట్‌ స్కాలర్‌షిప్స్‌ / కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ మరియు మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌
ఎవరు అర్హులు భారత విద్యార్థులు
ఏ తరగతి వారు అర్హులు 11వ తరగతి / గ్రాడ్యువేషన్‌ / బిడిఎస్‌ విద్యార్థులు
సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలి 5 లక్షలకు మించరాదు
ఎన్ని మార్కులు రావాలి కనీసం 60 శాతం మార్కులు సాధించాలి
స్కాలర్‌షిప్‌ మొత్తం 20,000 / 30,000 / 50,000 రూపాయలు
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
ధరఖాస్తు చివరి తేది 31 మార్చి 2023

➠ సందేహాలు - నివృతి :

ప్రశ్న -  కోల్గేట్‌ స్కాలర్‌షిప్‌ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు 

జవాబు - ఇంజినీరింగ్‌ కోర్సులలో వృత్తి విద్యా కోర్సులలో గ్రాడ్యుయేట్‌ చేస్తున్న / 11వ తరగతి విద్యార్థులకు / బిడిఎస్‌ చదువుతున్న విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు 

ప్రశ్న - ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి. 

జవాబు - వారి కుటుంబ సంవత్సర ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి. 

ప్రశ్న -  50 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చా ? 

జవాబు -  లేదు. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ప్రశ్న - నేను మూడవ సంవత్సరం ఎంబిబిఎస్‌ కోర్సు చేస్తున్నాను. నేను ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చా ?

జవాబు - లేదు. ఇది కేవలం 12వ / గ్రాడ్యువేషన్‌ / బిడిఎస్‌ స్టూడెంట్స్‌ మాత్రమే ధరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రశ్న - నేను ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ఎలా ధరఖాస్తు చేసుకోవాలి ?

జవాబు - ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ విదానంలో ఉంటుంది.

For Online Apply

Click Here 

Post a Comment

0 Comments