క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ - Credit Suisse Scholarship Program in Telugu

scholarships in telugu

క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌  

క్రెడిట్‌  సూయిస్‌ అనే సంస్థ పెట్టుబడి బ్యాంకింగ్‌లో బలమైన సామర్థ్యాన్ని కల్గిన ప్రముఖ ప్రపంచ సంస్థ అయిన క్రెడిట్‌ సూయిస్‌ తమ బ్యాంక్‌ కార్పోరేట్‌ సామాజిక బాద్యతలో భాగంగా భారత విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. 

క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమం నాణ్యమైన విద్యను పొందడానికి మరియు అవసరమైన విద్యార్థులకు విద్యను సరళంగా మార్చడానికి తోడ్పడుతుంది. క్రెడిట్‌ సూయిస్‌ బడ్డీ4స్టడీతో భాగస్వామ్యం పొందింది. ప్రతిభావంతులైన  విద్యార్థులకు వారి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ సంస్థ ఆర్థిక సహయం అందిస్తుంది. విద్యార్థులు వారు ఎంచుకున్న సంస్థ/కాలేజిలో అత్యుత్తమ విద్యను అభ్యసించడానికి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుంది.

క్రెడిట్‌ సూయిస్‌ సంస్థ ఢిల్లీ స్కూల్ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూఢిల్లీ / సిమ్‌ బయోబయోసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, పూణేలో ఎం.బి.ఏ/ఎం.ఏ  చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఇట్టి స్కాలర్‌షిప్‌లను వారి యొక్క చదువును నిరాటంకంగా కొనాసాగించడానికి ఉపయోగపడుతుంది. ఇట్టి స్కాలర్‌షిప్‌లో భాగంగా ఎం.బి.ఏ/ఎం.ఏ విద్యార్థుల కోసం సంవత్సరానికి 80% ఫీజు లేదా 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం రూపంలో స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ఇట్టి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని వారి యొక్క అకడమిక్‌లో వారికి కావాల్సిన మెటిరియల్‌ సమకూర్చుకోని వారి యొక్క చదువును నిరాటంకంగా కొనసాగించడానికి తోడ్పడుతుంది. 

క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులు సరైన ధృవీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్థులను తమ అకడమిక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా 10 ఫిబ్రవరి 2023 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. 

క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ కావాల్సిన అర్హతలు  :

1) కింద తెలిపిన ఇనిస్టిట్యూట్‌లో ఏదేని ఒకదానిలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొంది ఉండాలి.

  • ఢిల్లీ స్కూల్ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూఢిల్లీ లో ఎం.ఏ (ఎకనామిక్స్‌) లో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 
  • సిమ్‌బయోసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మేంట్‌, పుణేలో ఎం.బి.ఏ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

2) అభ్యర్థులు ఖచ్చితంగా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

3) అభ్యర్థుల యొక్క కుటుంబ సంవత్సర ఆదాయం 5 లక్షలకు మించరాదు.

➠ విద్యార్థులకు క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ మొత్తం :

విద్యార్థులకు మొత్తం ఫీజులో 80 శాతం లేదా 2,00,000 రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తుంది. (ఏది తక్కువ అయితే అది అందిస్తుంది) 

➠ క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ కోసం కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

1) పాస్‌పోర్టు సైజు ఫోటో 

2) మార్కుల మెమో 

3) గుర్తింపు ధృవపత్రం ( ఆధార్‌ కార్డు)

4) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్‌ గుర్తింపు కార్డు ( అడ్మిషన్‌ లెటర్‌/ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌) 

5) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న ఫీజు రశీదు

6) అభ్యర్థి బ్యాంక్‌ ఖాతా బుక్‌ / క్యాన్సల్‌ చెక్‌ 

7) ఆదాయం సర్టిఫికేట్‌ / అఫిడవిట్‌ 

స్కాలర్‌షిప్‌ పేరు క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌
ఎవరి కోసం భారత విద్యార్థుల కోసం
ఎవరు అర్హులు ఎం.ఏ / ఎం.బి.ఏ విద్యార్థులు
స్కాలర్‌షిప్‌ మొత్తం 2 లక్షలు / సంవత్సరానికి
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
ధరఖాస్తుకు చివరి తేది 10 ఫిబ్రవరి 2023
ఎన్ని మార్కులు రావాలి 60 శాతం మార్కులు
వార్షిక ఆదాయం ఎంత ఉండాలి 5 లక్షల లోపు

➠ క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలి :

1) తమ రిజిస్ట్రేషన్‌ ఐడితో బడ్డీ4స్టడీ లోకి లాగిన్‌ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్‌ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్‌ బటన్‌ నొక్కి ఈమేయిల్‌/మోబ్కెల్‌/ఫేస్‌బుక్‌/జిమేయిట్‌ అకౌంట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.)

2) లాగిన్‌ అయిన తర్వాత మీరు క్రెడిట్‌ సూయిస్‌ స్కాలర్‌షిప్‌ అప్టికేషన్‌కు రిడ్కెరెక్ట్‌ అవుతారు.

3) తర్వాత స్టార్ట్‌ అప్లికేషన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. (స్టార్ట్‌ అప్లికేషన్‌ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి) 

4) ఆన్‌ల్కెన్‌ స్కాలర్‌షిప్‌ అప్లికేషన్‌ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి

5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్‌ చేయాలి

6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి 

7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్‌ బటన్‌ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది. 

ఆన్‌లైన్‌ ధరఖాస్తు మరియు పూర్తి సమాచారం కోరకు

Click Here


Post a Comment

0 Comments