తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే - 2022 తెలుగులో
Telangana Economic Outlook in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రతి సంవత్సరం ముద్రించి బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెడుతుంది. ఇది వివిధ రంగాలలో రాష్ట్రం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని తెలియజేస్తు, ఎక్కడైనా అభివృద్దిలో నిర్ధిష్ట అంతరాలు మరియు సమస్యలు ఉంటే వాటిని సకాలంలో గుర్తించి పరిష్కరించడానికి తోడ్పడుతుంది. ఇది ప్రభుత్వం యొక్క విధివిధానాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని అందిస్తూ వాటి యొక్క పురోగతిని వివరిస్తుంది. 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే - 2022 ప్రకారం కింది విషయాలను తెలియజేస్తుంది.
కోవిడ్ కారణంగా ఏర్పడిన సవాళ్లను తెలంగాణ విజయవంతంగా అధిగమించింది. ఈ
విజయానికి నాలుగు అంశాలు ముఖ్య పాత్ర పోషించాయి.
1) సానుకూల ఆర్థిక
వ్యవస్థ
2) సమర్థవంతమైన ఆర్థిక
నిర్వహణ
3) సార్వత్రిక సేవలు అందించంలో
క్రమబద్దమైన మెరుగుదల
4) సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక
దృష్టి
1) 2020-21 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల
రాష్ట్రీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం సానుకూల వృద్దిరేటు 2.2 % సాధించింది.
అదే సమయంలో దేశ స్థూల జాతీయ ఉత్పత్తి 1.4%కి క్షీణించింది. 2020-21 లో స్థూల
జాతీయ ఉత్పత్తి 6.6% కు క్షీణించగా, స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి 3.5% మాత్రమే
క్షీణించింది.
2) 2011-12 స్థిర ధరల వద్ద స్థూల
జాతీయోత్పత్తి 8.9% పెరగగా, స్థూల రాష్ట్రీయోత్పత్తి 11.2% పెరిగి
జాతీయోత్పత్తి కన్న 3.6% పెరిగింది. 2021-2022 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ
స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి 19.1 %కు పెరిగింది.
3) 2021-2022 తెలంగాణ తలసరి ఆదాయం
2.79 లక్షలు, జాతీయ తలసరి ఆదాయం 1.50 లక్షలుగా ఉంది. జాతీయ తలసరి ఆదాయంతో
పోలీస్తే రాష్ట్రీయ తలసరి ఆదాయం 1.86 రెట్లు పెరుగుదల నమోదు
చేసింది.
4) రాష్ట్రంలో వ్యవసాయం మరియు అనుబంధ
రంగాలు పుంజుకున్నాయి. 2020-21 లో 12.24 %, 2021-2022 లో 9.09% వృద్దిని
సాధించాయి. రైతుబంధు పథకం 50,000 కోట్ల రూపాయలు దాటింది. మొత్తం 63 లక్షల మంది
లబ్ది పొందారు. 20వ పశుగణన (వరుసగా 2012 మరియు 2019) ప్రకారం 22.21% పశుసంపద
పెరుగుదలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. రాబోయే కాలంలో 20 లక్షల ఎకరాల్లో
ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
5) 2020-21 లో ప్రస్తుత ధరల ప్రకారం
తెలంగాణ పరిశ్రమల రంగం స్థూల అదనపు విలువ (వృద్ది రేటు 1.73%) క్షీణతను నమోదు
చేసింది. ఇది 2021-2022 లో 20.23% వృద్దిరేటును నమోదు చేసింది.
6) 2020-2021 లో 0.91% వృద్ది
సాధించగా, 2021`22 లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల అదనపు విలువలో 18.32% వృద్ది
సాధించింది.
7) 2021-2022 లో 6,965 కోట్లు విలువైన
పెట్టుబడులతో 3,185 పరిశ్రమలు అనుమతి పొందాయి.
8) ఎగుమతులు 2014-15 మరియు 2020-21
మద్య 66,276 కోట్ల నుండి 1,45,522 కోట్లకు చేరుకున్నాయి.
9) ఐటి రంగంలో ఉద్యోగ కల్పన రెట్టింపు
అయింది. (3,71,774 నుండి 6,28,615 వరకు)
10) 2021 లో రామప్ప దేవాలయాన్ని
యూనెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. అలాగే పోచంపల్లి గ్రామం The United Nations World Tourism Organisation (UNWTO) ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించింది.
11) తెలంగాణ అభివృద్ది కొరకు అదనంగా
1.14 లక్షల కోట్లను వెచ్చిచింది. దీంతో మొత్తం మూలధన వ్యయం 2.82 లక్షల కోట్లకు
చేరుకోవడంతో ఇది రాష్ట్ర విభజనకు ముందు 10 సంవత్సరాలలో చేసిన మూలధన వ్యయం కంటే
5 రెట్లు ఎక్కువ.
12) ప్రభుత్వ ఆసుపత్రులలో జననాలు 30.5
% నుండి 49.7% కి పెరిగింది.
➠ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) :
ఒక నిర్ధిష్ట సంవత్సరంలో ఆర్థిక
వ్యవస్థలో ఉత్పత్తి అయిన తుది సరుకులు మరియు సేవల మొత్తం ద్రవ్య విలువన స్థూల
రాష్ట్రీయ ఉత్పత్తి అంటారు. 2021-22 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల
రాష్ట్రీయ ఉత్పత్తి విలువ రూ.11.55 లక్షల కోట్లుగా ఉంది. దీనిని గత సంవత్సరంలో
పోల్చితే 19.1% వృద్ది సాధించింది. 2014-15 లో తెలంగాణ వృద్దిరేటు దేశ వృద్ది
రేటు కంటే 1% ఎక్కువగా ఉంది. ఇది 2020-21 నాటికి 3.6 %కు పెరిగింది. (దీనిని వి
ఆకారపు వృద్ది పోల్చడం జరిగింది). తెలంగాణ రాష్ట్రీయ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి
2019-20తో పోలీస్తే 202-`22 నాటికి 21.8% ఎక్కువగా నమోదు అయింది. ఇదే కాలానికి
భారతదేశ జాతీయ ఉత్పత్తి రెండేళ్లలో 17.8% గా ఉంది. దీనిని ఇండియాలోని 14 సాధారణ
రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ 4వ స్థానంలో ఉంది. దేశంలో స్థూల జాతీయ ఉత్పత్తికి
తెలంగాణ రాష్ట్రం అత్యధిక సహాకారం అందించిన 6వ రాష్ట్రంగా నమోదు కావడం
జరిగింది.
స్థిర ధరల వద్ద స్థూల రాష్ట్రీయ
ఉత్పత్తి
స్థిర ధరల (2011-12) వద్ద తెలంగాణ
స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి గత సంవత్సరంతో పోలీస్తే 11.2% పెరిగింది. దేశంలో ఇది
8.9% శాతంగా ఉంది. దేశంతో పోలీస్తే స్థిర ధరల ప్రకారం స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి
3.6% ఎక్కువగా పెరిగింది.
ప్రస్తుత ధరల వద్ద తెలంగాణలో అత్యధిక స్థూల జిల్లా ఉత్పత్తి సాధించిన మొదటి 5
జిల్లాలు
విలువలన్ని కోట్లలో లెక్కించడం జరిగింది.
1) రంగారెడ్డి (1,93,507)
2) హైద్రాబాద్ (1,62,877)
3) మేడ్చల్ (70,870)
4) నల్గొండ (37,948)
5) సంగారెడ్డి (36,951)
ప్రస్తుత ధరల వద్ద తెలంగాణలో అత్యల్ప స్థూల జిల్లా ఉత్పత్తి సాధించిన చివరి 5
జిల్లాలు
1) ములుగు(5,746)
2) కొమురంభీమ్ (8,211)
3) నారాయణపేట్ (9,308)
4) వనపర్తి (10,073)
5) రాజన్నసిరిసిల్ల (10,082)
➠ తెలంగాణ తలసరి ఆదాయం :
ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి
చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల విలువను పౌరులందరికి సమానంగా
విభజించినట్లయితే ప్రతి వ్యక్తికి అందుబాటు ఉండే మొత్తాన్ని తలసరి ఆదాయం
అంటారు.జాతీయ తలసరి ఆదాయం 2021-2022 లో 1,49,848 గా ఉంది. తెలంగాణలో 2021-2022
లో తలసరి ఆదాయం 2.78,833 లుగా ఉంది. 2014-15 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం
జాతీయ తలసరి ఆదాయం కంటే 1.43 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది 2021-22 నాటికి 1.86
రెట్లకి పెరిగింది. (తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే 1,28,985
రూపాయలు ఎక్కువగా నమోదు అయింది)
2021-22 సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయ వృద్దిరేటు 18.1% గా ఉంది. తెలంగాణ
రాష్ట్ర తలసరి ఆదాయ వృద్దిరేటు 18.8% గా ఉంది. జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే
తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 0.7 శాతం ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి ఆదాయం
రెట్టింపు అవడానికి 5 నుండి 6 సంవత్సరాలు పడితే భారత తలసరి ఆదాయం రెట్టింపు
కావడానికి 8 నుండి 9 సంవత్సరాలు పడుతుంది.
ప్రస్తుత ధరల వద్ద తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం సాధించిన మొదటి 5
జిల్లాలు
-
రంగారెడ్డి (6,58,757)
-
హైద్రాబాద్ (3,51,332)
-
మేడ్చల్ - మల్కాజ్‌గిరి (2,40,008)
-
మెదక్ (2,29,833)
-
మహబూబ్ నగర్ (2,23,348)
అత్యల్ప తలసరి ఆదాయం సాధించిన జిల్లాలు చివరి నుండి 5 జిల్లాలు
-
వికారాబాద్ (1,32,479)
-
కొమురంభీమ్ (1,37,488)
-
వరంగల్ అర్భన్ (1,38,387)
-
నారాయణపేట్ (1,43,428)
-
జోగులాంబ గద్వాల్ (1,49,606)
2021-22 లో తెలంగాణ స్థూల రాష్ట్ర అదనపు విలువలో సేవల రంగం 61.3%, పారిశ్రామిక
రంగం 20.4%, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు 18.3% గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో
యొక్క స్థూల రాష్ట్ర అదనపు విలువలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా 2014-15 లో
16.3 % నుండి 2021-2022 నాటికి 18.3 % పెరిగింది. వ్యవసాయ రంగం 48 శాతం మందికి
ఉపాధి కల్పిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి
జిల్లా అత్యధిక తలసరి ఆదాయం (6,58,757) సాధించింది. సిద్దిపేట మరియు
మహబూబాబాద్ జిల్లాలు ఆయా తలసరి ఆదాయంలో రెండకెల వృద్దిని సాధించాయి.తెలంగాణలో
ప్రస్తుత ధరల వద్ద స్థూల రంగారెడ్డి జిల్లా ఉత్పతి అత్యధికంగా
సాధించింది.
➠ పబ్లిక్ ఫైనాన్స్ :
2017 - 2020 వరకు తెలంగాణ సొంత పన్ను
రాబడి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో 7.4 శాతం కలదు. ఇది దేశంలోని 18 సాధారణ
రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. 202-22 లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలలో
రెవెన్యూ రాబడులు రూ॥1,76,127 కోట్లు మరియు మూలధన వసూల్లు రూ॥45,560 కోట్లుగా
ఉంది. తలసరి అభివృద్ది వ్యయం 2017-20 కాలంలో గోవాను మినహాయిస్తే తెలంగాణ
మొదటి స్థానంలో ఉంది.
తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్/ ఉద్యోగులందరి సంక్షేమం
కోసం సి.ఆర్ బిస్వాల్ అధ్యక్షులుగా మరో ఇద్దరిని సభ్యులుగా నియమించి వేతన
సవరణ కమీషన్ ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ సిఫార్సుల ప్రకారం అన్ని స్థాయిల
ఉద్యోగ వర్గాలకు 7.5% ఫీట్‌మెంట్, కనీస వేతనం 19000 రూపాయలు
చేసింది.
➠ వ్యవసాయం-అనుబంధ కార్యక్రమాలు :
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో
వ్యవసాయం, అటవీ, పశుసంపద, మత్యరంగాలు అదనపు స్థూల విలువ ప్రస్తుత ధరల
సమ్మిళిత వార్షిక వృద్దిరేటు 13.94% గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం
పశుసంపద 49.73%, పంటలు 44.66%, ఫిషింగ్, అక్వా 3.23%, అటవీ మరియు లాగింగ్
2.38% గా ఉన్నాయి. 2012-19 లో పశుసంపద వృద్ది రేటులో పశ్చిమ బెంగాల్ తర్వాత
తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. 2018 నుండి 2021 వరకు రైతుబందు పథకం
ద్వారా 63 లక్షల మంది రైతులకు 50,448 కోట్లను పంపిణీ చేసింది.
తెలంగాణలో 2014-15 నుండి 2021-22
(వాస్తవ అంచనాలు) మద్యకాలంలో వ్యవసాయం, అటవీ, పశుసంపద మరియు మత్యసంపద యొక్క
స్థూల రాష్ట్ర అదనపు విలువ (ప్రస్తుత ధరల ప్రకారం) సమ్మిళిత వార్షిక వృద్ది
రేటు 19.94% కనిపించింది. సమ్మిళిత వార్షిక వృద్ది రేటు 18.2 %కు చేరటానికి
పశుసంపద రంగం ప్రధాన పాత్ర పోషించింది. ఈ రంగం యొక్క సహకారంతో వ్యవసాయం మరియు
దాని అనుబంధ కార్యకలాపాలలో పెరుగుదల ఏర్పడి అదనపు స్థూల రాష్ట్ర విలువ
2014-15 లో 37.47% నుండి 2021-22 లో 49.73 కి పెరిగింది.
2014-15 నుండి 2021-22 మద్య
ప్రస్తుత ధరలలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సమ్మిళిత వార్షిక వృద్ది
రేటులో వ్యవసాయ రంగ అదనపు స్థూల రాష్ట్ర విలువ ప్రత్యేక కేటగిరి కాని
రాష్ట్రాల దోరణి ప్రకారం మద్యప్రదేశ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రెండవ
స్థానంలో ఉంది.
నీటిపారుదల ప్రాంతం 2014-15 లో
62.48 లక్షల ఎకరాల నుండి 2020-21 కి 136.86 లక్షల ఎకరాలకు పెరిగింది. 2020-21
లో నీటిపారుదల సామర్థ్యం 85.89 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి ఉత్పత్తి
61% అధికంగా పెరిగింది.
నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక
ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2013 లో మొత్తం గ్రామీణ కుటుంబాలలో వ్యవసాయ
కుటుంబాలు 51.5% గా ఉంది. ఇది 2019 లో 54.2% శాతంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రం 276.96 లక్షల
ఎకరాల (112.08 లక్షల హెక్టార్లు) కల్గి ఉండి భౌగోళిక విస్తీర్ణంలో దేశంలో 11వ
స్థానంలో ఉంది. మొత్తం భూమి విస్తీర్ణంలో 49.07 శాతం సాగుబడిలో ఉంది. ఇందులో
దాదాపు 24.07 % అటవీ భూమి, వ్యవసాయేతర ఉపయోగాలకు వాడుకుంటున్న భూమి 7.46%,
బీడు భూములు 9.02%, బంజరు మరియు సాగు చేయలేని భూమి 5.42% గా
ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో 59.72 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 59.48 లక్షల
కమతాలు సాగుబడి ఉన్నాయి. తెలంగాణలో 2020-21 లో 1322.4 మిల్లీమీటర్ల
వర్షపాతం రికార్డు అయింది.
సాగు విస్తీర్ణం :
తెలంగాణలో నీటి పారుదల
విస్తీర్ణం 2014-15 లో 131 లక్షల ఎకరాలు ఉండగా 2020-21 నాటికి 210
లక్షల ఎకరాలకు పెరిగింది. తెలంగాణ వరి, పత్తి, మొక్కజొన్న,
రెడ్‌గ్రామ్ ప్రధాన పంటలుగా ఉన్నాయి. వరి 50%, పత్తి 28% శాతంగా
ఉన్నాయి.
తెలంగాణలో ప్రధాన పంటల ఉత్పత్తి 2014-15 లో 232 లక్షల మెట్రిక్ టన్నులు
ఉండగా 2020-21 నాటికి 353 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది.
పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ 10వ స్థానంలో కలదు. జిల్లా స్థాయి
పంటల సాంద్రత అత్యధిక కల్గిన జిల్లా నిజామాబాద్, అత్యల్పంగా సంగారెడ్డి
జిల్లాలు ఉన్నాయి.
వ్యవసాయ గణాంకాల అభివృద్దికి 4 ప్రధాన అంశాలు ఉన్నాయి.
ఎ) భూదస్తావేజుల నవీకరణ
బి) పంటల నమోదు
సి) సర్వే సిటివో అప్లికేషన్
డి) పంట కోత ప్రయోగాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగం 2018లో 28 లక్షల మెట్రిక్ టన్నులు
ఉండగా 2020-21 నాటికి 39 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వృద్దిరేటు
4.13%గా ఉంది. జిల్లాల వారీగా ఎరువుల వినియోగంలో మహబూబాబాద్ ముందుండగా
వరంగల్ అర్భన్ చివరిస్థానంలో ఉంది.
రాష్ట్రంలో ఉద్యావ పంటల సాగు
విస్తీర్ణం 2020-21 లో 11.57 లక్షల ఎకరాలు కల్గి ఉంది. ఇద్ది మొత్తం
వ్యవసాయ విస్తీర్ణంలో 5.39% గా ఉంది. దీని ఉత్పత్తి 59.03 లక్షల మెట్రిక్
టన్నులుగా ఉంది.2015-16 తో పోలిస్తే 2020-21 లో మొత్తం ఉద్యాన పంటల
ఉత్పత్తి 59.03 లక్షల మెట్రిక్ టన్నులతో 101% వృద్దిని
సాధించాయి.
పశుసంపదలో తెలంగాణ గొర్రెల సంపద
19.1 మిలియన్లతో మొదటి స్థానంలో ఉంది. దేశ పశుసంపదలో పశ్చిమబెంగాల్ తర్వాత
తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. 2012-2019 లో తెలంగాణ పశుసంపద 22.09% వృద్ది
రేటు సాధించింది.
రాష్ట్ర ప్రభుత్వం విత్తన
పంపిణీతో పాటు విత్తనోత్పత్తి మరియు నాణ్యత ప్రమాణాల ధృవీకరణ కూడా
చేస్తుంది. ఇందుకు గాను తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్
కార్పోరేషన్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ విత్తన అవసరాన్ని తీర్చే నోడల్
ఏజన్సీగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్‌ఘడ్
రాష్ట్రాలకు విత్తనాలను సరఫరా చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం దేశంలో పత్తి ఉత్పత్తిలో 2వ స్థానంలో, మొక్కజొన్న
ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది.
2015-16 వరి 25 లక్షల ఎకరాలు ఉండగా 2021 నాటికి 104 లక్షల ఎకరాలకు
చేరుకొని 303% పెరిగింది. అలాగే 2015-16 లో పత్తి 43 ఎకరాలు ఉండగా 2021
లో 58 లక్షలకు చేరుకొని 33% వృద్దిని నమోదు చేసుకున్నాయి.
వరి ఉత్పత్తి 2015-16 లో
దాదాపు 45 లక్షల టన్నులుండగా ఇది 2021నాటికి 218.5 లక్షలకు చేరుకొని 378%
వృద్దిని నమోదు చేసుకుంది. అలాగే పత్తి ఉత్పత్తి 2015-16 లో దాదాపు 18
లక్షల టన్నులుండగా ఇది 2021 నాటికి 30.42 లక్షల టన్నులకు చేరుకొని 61%
వృద్దిని సాధించింది.
➠ నీటి పారుదల సౌకర్యాలు :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
తర్వాత భారీ మరియు మద్యతరహ ప్రాజేక్టులపై 1,28,596 కోట్ల రూపాయలను
ప్రభుత్వ ఖర్చు చేసింది. 2014-15 మరియు 2020-21 మద్య స్థూల నీటిపారుదల
ప్రాంతం 119% వృద్దిసాధించింది. 72.70 లక్షల ఎకరాలకు సాగునీటిని
అందిస్తుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం లోతట్టు చేపల పెంపకంలో 3వ స్థానం,
చేపల ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది. గత 6 సంవత్సరాలలో భూగర్భ జలాలు 4.14
మీటర్లు పెరిగాయి.
పంట వైవిద్యం
రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయ
వృద్దికి పంటల వైవిద్యం అవసరం. ఇది రైతుల ఆదాయాలను, ధరల హెచ్చుతగ్గులను
తట్టుకునేలా చేస్తూ అధిక వ్యవసాయ ఆదాయాన్ని పొందుటకు సహకరిస్తుంది. ఒకే
రకమైన పంటపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం పంటల
వైవిద్యానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇందుకు గాను వేరుశేనగ, ఎండుపువ్వు,
నువ్వులు, బెంగాల్ పెసర, నల్ల శనగ, పచ్చి శనగ, ఆముదం, ఆవాలు, కుసుమ,
ఆయిల్‌ఫామ్ మరియు జొన్నవంటి పంటలను సిఫార్సు చేసింది. 2020-21 లో
పెద్దపల్లి, కరీంనగర్ మరియి సూర్యాపేట లో అతి తక్కువ వైవిద్యం కల్గి
ఉన్నాయి. నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు అత్యంత ఎక్కువ
వైవిద్యం కల్గి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా నిర్మించిన ప్రాజేక్టులు
1) కాళేశ్వరం ప్రాజేక్టు (18.25
లక్షల ఎకరాలు)
2) సీతారామ ఎత్తిపోతల పథకం
(3.87 లక్షల ఎకరాలు)
3) చొక్కారావు దేవాదుల
ఎత్తిపోతల పథకం (5.58 లక్షల ఎకరాలు)
4) రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం
(2.03 లక్షల ఎకరాలు)
5) మహత్మగాంధీ కల్వకుర్తి
ఎత్తిపోతల పథకం (4.24 లక్షల ఎకరాలు)
6) జవహర్ నెట్టంపాడు ఎత్తిపోతల
పథకం (2.00 లక్షల ఎకరాలు)
వచ్చే నాలుగు సంవత్సరాలలో
వ్యవసాయ యాంత్రీకరణను 45 శాతం నుండి 90 శాతానికి పెంచాలని తెలంగాణ
ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలో తెలంగాణ రాష్ట్రం
ఆయిల్ పామ్ విస్తీర్ణంలో 6వ స్థానంలో, ఉత్పాదకతలో 1వ స్థానం, చమురు
వెలికితీతలో 1వ స్థానంలో కలదు.
2019-20 లో అఖిల భారత
స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, గుడ్ల ఉత్పత్తిలో
3వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. సిద్దిపేట, భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాలలో ఇద్దరు రైతులు నల్ల, ఎర్ర వరి పంటను విజయవంతంగా
పండిరచారు. ఈ నల్ల, ఎర్ర వరి ధాన్యం కార్డియో వాస్కులర్, మధుమేహం
మరియు క్యాన్సర్‌ను నివారిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల
సామార్థ్యాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్
హౌసింగ్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పుటి నుండి
గిడ్డంగుల సంఖ్య 70 నుండి 313కు చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో
తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, మాంసం, పత్తి మొ॥లగు ఉత్పత్తులు ఎగుమతులలో
ప్రధానంగా చెప్పుకోవచ్చు.
నేషనల్ అగ్రికల్చర్
మార్కెట్ (ఈ`నామ్) వ్యవసాయ మార్కెటింగ్ లో ఏకరూపకత సాధించడం,
దేశవ్యాప్తంగా మార్కెట్‌లను ఏకీకృతం చేయడం, సమాచార అసమానతలను తొలగించడం
కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆహారధాన్యాలు, నూనెగింజలు, పండ్లు,
కూరగాయాలతో పాటు 175 వస్తువులు ఈ`నామ్‌లో వర్తకం చేయబడతాయి.
నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో విజయవంతంగా ఈ`నామ్ అమలు చేసినందుకు
గాను ప్రధానమంత్రి ఎక్కలెన్స్ అవార్డు లభించింది.
➠ పరిశ్రమలు :
దేశంలో తెలంగాణ రాష్ట్రం
ఓడరేవులు లేని రాష్ట్రాలో రెండవ స్థానంలో ఉంది. 2020-21 లో తెలంగాణ
రాష్ట్రం 64,539 కోట్ల విలువ గల సరుకులను ఎగుమతి చేసింది. తెలంగాణ
రాష్ట్రం నుండి 26.3 % దిగుమతులతో అమెరికా అతిపెద్ద దిగుమతి దేశంగా
ఉంది.
2021-22 లో మొత్తం పారిశ్రామిక
రంగం (గనుల తవ్వకం సహా) అదనపు స్థూల విలువ ( ప్రస్తుత ధరల వద్ద)
రూ॥2,12,069 కోట్లుగా ఉంది. 2021-22 లో పారిశ్రామిక రంగ అదనపు స్థూల
విలువ 20.23% పెరిగింది. మొత్తం పారిశ్రామి రంగంలో తయారీ రంగం 56.9%
(1,20,665 కోట్లు), నిర్మాణ రంగం 19.9%(42,229 కోట్లు), గనులు
మరియు క్వారీయింగ్ రంగం 14.7% (31,208 కోట్లు), విద్యుత్ మరియు ఇతరాలు
8.5%(17,967) కోట్లు గా ఉంది. తెలంగాణ తయారీ రంగంలో 58.6%, నిర్మాణరంగంలో
36.3%, గనులు మరియు క్వారీయింగ్ లో 3.4%, ఇతరాలు 1.7% మంది కార్మికులు
పనిచేస్తున్నారు.
2014-15 మరియు 2021-22
మద్యకాలంలో 18,761 పారిశ్రామిక అనుమతులు రూ॥2,26,806 కోట్ల పెట్టుబడులతో
అంగీకారం పొందాయి. ఈ పెట్టుబడులు 16.32 లక్షల మందికి ఉద్యోగాలు
కల్పించాయి.
అత్యధిక పరిశ్రమలు ఏర్పాటు చేయబడిన జిల్లా మేడ్చల్ కాగా, అత్యధిక
పెట్టుబడులు ఆకర్షించిన జిల్లాగా సంగారెడ్డి ఉంది. ఉద్యోగ ఉపాధి
కల్పనలో వరంగల్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ సుల్తాన్‌పూర్ లో
వైద్యపరికరాల పార్కు, హైద్రాబాద్‌లో ఫార్మసిటి పార్కు ఏర్పాటు
చేసినారు.
టి-ఐడియా
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక
అభివృద్ది మరియు పారిశ్రామిక వేత్తల పురోగతి) పరిశ్రమల అభివృద్దికి
సబ్సిడీలు కల్పిస్తుంది.
టి-ప్రైడ్ తెలంగాణ రాష్ట్ర
దళిత పారిశ్రామిక వేత్తలకు శీఘ్రగతిన అనుకూలతలు కల్పించే ప్రోత్సహక
పథకం. తెలంగాణలో హైద్రాబాద్ జిల్లాలో అత్యధిక సూక్ష్మ, చిన్న మరియు
మద్యతరహ పరిశ్రమలున్నాయి. అతితక్కువ ములుగు జిల్లాలో కలవు. 2019 లో
ప్రభుత్వం టిఎస్ గ్లోబల్ లింకర్‌ను ప్రారంభించింది. ఇది ఎంఎస్‌ఎంఈలను
ప్రపంచస్థాయి కొనుగోలు మరియు అమ్మకందారులతో అనుసంధానం చేస్తుంది. చేనేత
వస్త్ర తయారీ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కుటీర పరిశ్రమగా
ఉంది.
ఒక జిల్లా - ఒక ఉత్పత్తి వస్తువు
ఇది కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టిన పథకం. జిల్లాల వారీగా ఉత్పత్తి చేయగలిగే
వస్తువులను గుర్తించి అమ్మడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
2020-21 లో తెలంగాణ 64,539.42
కోట్ల విలువైన సరుకులను ఎగుమతి చేసింది. మొత్తం ఎగుమతులలో ఔషదాలు 33.41%,
సేంద్రీయ రసాయనాలు 31.12%, అణుయంత్రాలు 5.37% యాంత్రిక పరికరాలు
4.67% గా ఉన్నాయి. తెలంగాణ నుండి అమెరికా(26.3%), చైనా (6.8%)
రష్యా (4.0%) దిగుమతులు చేసుకుంటున్నాయి. తెలంగాణ నుండి అత్యధిక సరుకులను
ఎగుమతి చేసిన జిల్లాలు 1) మేడ్చల్ 2) హైద్రాబాద్ 3) సంగారెడ్డి 4)
రంగారెడ్డి 5) మెదక్‌లున్నాయి. 2019-20 లో ప్రపంచబ్యాంక్ భారతదేశంలో
వ్యాపారం చేయడంలో తెలంగాణను 3వ అత్యంత ఆకర్షనీయమైన గమ్యస్థానంగా
ప్రకటించింది.
2021-22 లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల విలువలో సేవారంగం 61.3%
(6,37,476 కోట్లు), వ్యవసాయ మరియు అనుబంధరంగాలు 18.3% (1,89,826
కోట్లు) పారిశ్రామిక రంగం 20.4%(2,12,069 కోట్లు) గా
ఉన్నాయి.
సేవారంగంలో 2014-15 నుండి 2021-2022 నాటికి 122.89 శాతం
వృద్దిని సాధించింది. సేవారంగం అదనపు స్థూల విలువ ప్రస్తుత ధరల ప్రకారం
0.91% వృద్దిరేటు కలదు.
ఆర్థిక సేవారంగంలో
2014-15 నుండి 2021-2022 నాటికి 80.62 శాతం వృద్దిని
సాధించింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం
1,07,871 కి.మీ రహాదారి కలదు. ఇందులో 67,276 కి.మీ గ్రామీణ రహదారులు,
3,910 కి.మీ జాతీయ రహదారులు కలవు. మొత్తం వాహనాల సంఖ్య 1,42,73,565
ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 74.2% శాతంగా ఉన్నాయి. తెలంగాణ
రాష్ట్ర పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ది సంస్థ ఎనర్జీ కన్సర్వేషన్
అవార్డులలో ఇంధన సంరక్షణలో సత్తుపల్లి డిపోకు గోల్డ్‌మెడల్
వచ్చింది.
రంగారెడ్డి జిల్లాలోని
ఇబ్రహీంపట్నం నందు మంగలపల్లి లాజిస్టిక్స్ పార్క్ ను 22 ఎకరములలో
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాజిస్టిక్ పార్కు ప్రభుత్వ, ప్రైవేటు
భాగస్వామ్యములో నిర్మిస్తున్న దేశంలోనే మొదటీ సమీకృత లాజిస్టిక్
పార్కు.
2020 లో ప్రపంచ టాయిలేడ్ డే
సందర్భంగా రాష్ట్రంలోని సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు దేశంలోనే ఉత్తమ
జిల్లాలుగా అవార్డు అందుకున్నాయి. గందగి ముక్త్ భారత్ కార్యక్రమం
కింద గరిష్ట శ్రమదాన్ లో తెలంగాణ మొదటి స్థానం
సాధించింది.
➠ ఆరోగ్య రంగం
:
నీతిఆయోగ్ యొక్క వార్షిక
ఆరోగ్య సూచిక 2019-20 ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం పనితీరు పై 19
పెద్దరాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంగా మంచి ప్రతిభను కనబర్చింది.
అంతేకాక పనితీరులో కూడా క్రమంగా పెరుగుదలను సాధిస్తుంది. ఈ రెండు
అంశాల్లో రాష్ట్రం 3వ స్థానం సాధించింది.
➠ మాతా - శిశు సంరక్షణ :
గత దశాబ్ద కాలంలో మాతృ మరణాల
రేటు 43 శాతం తగ్గింది. శిశుమరణాల రేటు 27.7 నుండి 26.4కు
తగ్గింది.
-
తెలంగాణ రాష్ట్రంలో 2020-21 నాటికి
-
అంగన్‌వాడీ కేంద్రాలు -35,700
-
పాఠశాలలు - 41,220
-
జూనియర్ కళాశాలలు - 3,712
-
డిగ్రీ కళాశాలలు - 1086
-
టెక్నికల్ కళాశాలలు - 1410 ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం
26,969.54 చ.కి.మీ అటవీ విస్తీర్ణము కల్గి ఉంది. ఇది రాష్ట్ర భౌగోళిక
విస్తీర్ణంలో 24.05 శాతం ఉంది. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల
భద్రాద్రి కొత్తగూడెం.
తెలంగాణలో 2022 నాటికి పట్టణ
జనాభా 46.8 % ఉంటుందని అంచనా. ఇది 2036 నాటికి 57.3 శాతానికి
చేరుతుందని అంచనా వేయడం జరిగింది.
భూ కమతాలు
1) సన్నకారు (1 హెక్టారు
(2.47 ఎకరాలు) లేదా అంతకంటే తక్కువ)
భూకమతాల సంఖ్య -3840 లక్షలు (64.6%)
2) చిన్నకారు (2.48 ఎకరాల
నుండి 4.94 ఎకరాల వరకు)
భూకమతాల సంఖ్య - 1,409
లక్షలు (23.7%)
3) మధ్యస్థ (4.95 నుండి 9.88
ఎకరాల వరకు)
భూకమతాల సంఖ్య - 564 లక్షలు
(9.5%)
4) మద్య (9.89 నుండి 24.77
ఎకరాల వరకు)
భూకమతాల సంఖ్య - 126 లక్షలు
(2.1%)
5) పెద్ద (24.79 ఎకరాల కంటే
ఎక్కువ)
భూకమతాల సంఖ్య - 9 లక్షలు
(0.2%)
సామాజిక వర్గాల వారీగా భూకమతాలు
షెడ్యూల్డ్ కులాలు - 700 లక్షలు (11.8%)
షెడ్యూల్డ్ తెగలు - 712 లక్షలు (12%)
సంస్థలు - 1 లక్షలు (0%)
ఇతరాలు - 4,535 లక్షలు (76.2%)
0 Comments