Indian Constitution in telugu ( భారత రాజ్యాంగం)

Indian constitution features in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
➠ భారత రాజ్యాంగం :
భారత రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూల్స్, 448 ఆర్టికల్స్, 104 సవరణలు కల్గి ఉండి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజ్యాంగాలలో ఒకటిగా ఉంది. భారత రాజ్యాంగాన్ని స్వతంత్ర భారతదేశం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ లిఖించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి 2 సంవత్సరాలు, 11 నెలలు, మరియు 18 రోజులు సమయం పట్టింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. కానీ ఇది మొదటిసారిగా 26 నవంబర్ 1949న అధికారికంగా ఆమోదించబడిరది. అందుకే భారతదేశంలో నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు.భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి నుండి ప్రేరణ పొంది లిఖించారు.
➠ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు:
రాజ్యాంగం అనేది ఒక రాష్ట్రం/దేశంలోని వివిధ వ్యవస్థల అనుబంధాన్ని కూలంకషంగా చర్చించే చట్టాల సమితి. అనగా ఒక దేశం/రాష్ట్రం లోని కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మరియు శాసనసభ వంటి సంస్థల యొక్క అనుబంధాన్ని వివరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలుగా విభజించబడ్డాయయి.
➠ రాజ్యాంగ ప్రవేశిక :
భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మింకునేందుకు పౌరులందరికి సాంఘిక ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వేచ్చను అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మాణించుకొని 1949 నవంబర్ 26న ఆమోదించి శాసనంగా రూపొందించుకొని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. 1976 లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
➠ స్వతంత్ర, సమీకృత న్యాయవ్యవస్థ :
భారతదేశంలో ఒకేఒక సమీకృత న్యాయవ్యవస్థ ఉంది.(అమెరికాలో రెండంచెల న్యాయవ్యవస్థ కలదు). భారతదేశంలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం కేవలం సర్వోన్నత/సుప్రీం కోర్టుకు మాత్రమే కలదు. భారతదేశంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం అనే వ్యవస్థ ద్వారా నియమింపబడతారు. ఏదేని కారణాల వల్ల కొలిజియంలోని న్యాయమూర్తిని తొలగించాల్సిన అవసరం వస్తే అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించడం జరుగుతుంది. న్యాయమూర్తుల జీతాలు మరియు పెన్షన్ భారతదేశం యొక్క ఏకీకృత నిధి నుండి చెల్లిస్తుంది. న్యాయమూర్తులు పదవీవిరమణ తర్వాత ప్రాక్టీస్ చేయరాదు.
➠ పార్లమెంటరీ విధానం :
దేశంలో మెజారీటి ఉన్న రాజకీయ పార్టీ పరిపాలించే ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. మంత్రిమండలి దిగువ సభకు భాద్యతగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల్లో మెజారిటీ పొందడం ద్వారానే సవరణలు చేయవచ్చు. మొత్తం సభ్యులలో 2/3 వంతు మెజారిటీ ఉండాల్సి ఉంటుంది.
➠ భారతదేశ భూభాగము :
భారతదేశ భూభాగము గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 1 నుండి 4 వరకు పొందుపరచడం జరిగింది.
➢ ఆర్టికల్ -1
ఇది భారతదేశంలో యొక్క పేరు మరియు భూభాగము గురించి చెబుతుంది.
ఇండియా అనగా భారత్ అని, భారత్ అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కలయిన గురించి చెబుతుంది.
➢ ఆర్టికల్ - 2
నూతన రాష్ట్రాల విలీనము, ఏర్పాటు
పార్లమెంటు శాసనం ద్వారా కొత్త ప్రదేశాలను భారత్‌లో విలీనం చేసి నూతన రాష్ట్రాలుగా ఏర్పాటు చేయచ్చు. 36వ రాజ్యాంగా సవరణ ద్వారా సిక్కింను 1975 లో భారత్‌లో విలీనం చేసినారు.
➢ ఆర్టికల్ - 3
కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, సరిహద్దులు మార్పులు చేయడం.
భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే పూర్తి అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. ఒక రాష్ట్రం నుండి మరోక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కురాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయవచ్చు.
➢ ఆర్టికల్ - 4
మొదటి, నాలుగవ ఆర్టికల్‌లో మార్పులు చేయడం
1) 2, 3 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు 1, 4వ ఆర్టికల్‌లో మార్పుడు చేయడం
2) నూతన రాష్ట్రాలు ఏర్పాటుకు సంబందించిన శాసనాలు రాజ్యాంగ సవరణలుగా పరిగణించబడవు.
➠ భారత పౌరసత్వం :
భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఆర్టికల్ 5 నుండి 11 వరకు పొందుపరిచినారు. భారతదేశంలో ఏక పౌరసత్వం అమలులో ఉంది.
➢ ఆర్టికల్ -5
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారతదేశంలో శాశ్వత నివాసం ఉండటమే కాకుండా కింది అర్హతలు ఉండాలి.
ఎ) భారతదేశంలో జన్మించి ఉండాలి.
లేదా
బి) పౌరుని యొక్క తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతదేశంలో జన్మించి ఉండాలి.
లేదా
సి) రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి కంటే ముందు కనీసం 5 సంవత్సరం భారతదేశంలో నివాసం ఉండాలి.
➢ ఆర్టికల్ - 6
పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వారి యొక్క పౌరసత్వం
ఎ) జూలై 18, 1948 లోపు ఇండియాకు వలస వచ్చి ఉండాలి
బి) జూలై 18, 1948 తర్వాత వచ్చిన వారు భారత కమీషనరేట్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
(నమోదుకు ముందే 6 నెలలు భారత్‌లో ఉండాలి)
➢ ఆర్టికల్ - 7
పాకిస్తాన్‌కు వలస వెళ్లినవారి పౌరసత్వం
1947 మార్చి 1 తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్లిన భారతీయులు తిరిగి భారత్‌లోకి వచ్చినవారు 1948 జూలై 18 లోగా భారత కమీషనరేట్‌లో పేరు నమోదు చేయించుకొని ఉండాలి.
➢ ఆర్టికల్ -8
భారత్ వెలుపల నివసించే భారత సంతతి ప్రజల పౌరసత్వం
భారత్‌కు బయట నివాసం ఉండే పౌరుని తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారత్‌లో జన్మించి ఉండాలి.
అట్టి తాను నివసిస్తున్న దేశంలోని భారత రాయభార కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవడం ద్వారా పౌరసత్వం పొందవచ్చు.
➢ ఆర్టికల్ - 9
ఒక వ్యక్తి తాను సొంతంగా విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే భారతదేశంలోని తన యొక్క పౌరసత్వం రద్దు చేయడం
➢ ఆర్టికల్ - 10
భారతీయ పౌరుడు ఎప్పటికీ భారతీయుడే
➢ ఆర్టికల్ - 11
పౌరసత్వం గురించి శాసనాలు చేయడం
పౌరసత్వాన్ని కల్పించడం, తొలగించడం వంటిపై శాసనాలు చేసే అధికారి పార్లమెంట్‌కు ఉండడం.
➠ ప్రాథమిక హక్కులు :
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు మానవహక్కులను ఉపయోగించుకోవచ్చు అని తెలుసు. అయితే భారత రాజ్యాంగంలో ఇట్టి ప్రాథమిక హక్కులను పార్ట్`3 లో 12 నుండి 35 అధికరణం మద్య పొందుపరిచారు. 3వ భాగాన్ని మాగ్నాకార్టా అంటారు. ప్రాథమిక హక్కులు మొత్తం 6 ఉన్నాయి.
1) సమానత్వపు హక్కు
2) స్వేచ్చ, స్వతంత్రపు హక్కు
3) దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు
4) మత స్వాతంత్రపు హక్కు
5) సాంస్కృతిక విద్యాషయపు హక్కు
6) రాజ్యాంగ పరిహారపు హక్కులు ఉన్నాయి.
1978 లో ఆస్తిహక్కును 44 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించినారు. అయితే ఇట్టి ఆరు ప్రాథమిక హక్కులలో రాజ్యాంగ పరిహారపు హక్కు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇట్టి రాజ్యాంగ పరిహారపు హక్కు మిగతా ఐదు హక్కులను పరిరక్షిస్తుంది. అందుకే రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగం యొక్క గుండె / ఆత్మ అని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అభివర్ణించాడు.
➠ ప్రాథమిక విధులు :
ప్రాథమిక విధులను 1976 లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రాథమిక విధులు మొత్తం 11 ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదిన ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రాథమిక విధులను విభాగం 4ఎ, ఆర్టికల్ 51ఎ లో పొందుపరిచారు.
1) రాజ్యంగానికి కట్టుబడి ఉండి, దాని ఆదర్శాలను, సంస్థలను జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
2) జాతీయ స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో ఉన్నత ఆదర్శాలను పాటించాలి.
3) భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించాలి.
4) దేశరక్షణకు, జాతీయ సేవకు సదా సంసిద్దంగా ఉండాలి.
5) భారత ప్రజల మద్య మత, భాస, ప్రాంతీయ, వర్గ వైవిద్యాలకు అతీతంగా సోదరభావాన్ని, స్పూర్తిని పెంపొందించాలి. స్త్రీలను గౌరవించాలి
6) భారత మిశ్రమ సంస్కృతి ఔనత్యం, సాంప్రాదాయాలను గౌరవించి పరిరక్షించాలి.
7) అడవులు, సరస్సులు నదులు, వన్యప్రాణులు ప్రకృతిని కాపాడాలి. జీవుల పట్ల కారుణం ఉండాలి.
8) శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోదన, సంస్కరణ సూర్పిని పెంపొందించుకోవాలి.
9) ప్రజల ఆస్తిని సంరక్షించాలి. హింసను ప్రేరేపించే చర్యలలో పాల్గొనరాదు.
10) వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలో అత్యున్నత స్థాయి ఎదగడానికి కృషి చేయాలి.
11) 6 నుండి 14 సంవత్సరాలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించుట తల్లిదండ్రులు/సంరక్షకుని బాద్యత ( దీనిని 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
➠ భారత రాజ్యాంగ 12 షెడ్యూల్ల వివరాలు :
➢ షెడ్యుల్ 1
భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి సరిహద్దులు
➢ షెడ్యుల్ 2
ప్రముఖుల జీతభత్యాలు వివరణ
➢ షెడ్యుల్ 3
ప్రముఖుల ప్రమాణ స్వీకారం గురించి వివరిస్తుంది.
➢ షెడ్యుల్ 4
కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు కేటాయించిన రాజ్యసభ స్థానాల గురించి వివరణ
➢ షెడ్యుల్ 5
షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పరిపాలన, నియంత్రణ గురించి వివరిస్తుంది.
➢ షెడ్యుల్ 6
అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలలో నివసించే తెగల యొక్క పరిపాలన వ్యవస్థను వివరిస్తుంది.
➢ షెడ్యుల్ 7
కేంద్ర, రాష్ట్రాల మద్య అధికారాల విభజన గురించి వివరణ
➢ షెడ్యుల్ 8
భాషల గురించి వివరిస్తుంది. ప్రస్తుతం 22 భాషలు గుర్తింపు పొందినాయి.
➢ షెడ్యుల్ 9
కొన్ని చట్టాలను న్యాయ సమీక్ష నుండి మినహాయించడం గురించి వివరిస్తుంది.
➢ షెడ్యుల్ 10
పార్టీ ఫిరాయింపుల గురించి వివరిస్తుంది.
➢ షెడ్యుల్ 11
పంచాయితీ సంస్థల అధికారాల్ని వివరిస్తుంది.
➢ షెడ్యుల్ 12
మున్సిపాలిటీల అధికారల గురించి వివరిస్తుంది.
0 Comments