
కాళేశ్వరం ప్రాజేక్టు (KALESHWARAM PROJECT)
Kaleshwaram lift irrigation project in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. GK పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ప్రాజేక్టులను అది అందించే సాగునీటిని, సాగునీటి విస్తీర్ణంను బట్టి మూడు రకాలుగా విభజించారు.
1) భారీ తరహ ప్రాజేక్టులు
2) మద్యతరహ ప్రాజేక్టులు
3) చిన్నతరహా ప్రాజేక్టులు గా విభజించారు.
1) భారీ తరహ ప్రాజేక్టులు :
25,000 ఎకరాలకు పైగా మరియు 10,000 హెక్టార్ల (1 హెక్టారు = 2 1/2 ఎకరాలు) భూమికి పైగా సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించిన ప్రాజేక్టులను భారీ తరహ ప్రాజేక్టులు అంటారు.
2) మద్యతరహ ప్రాజేక్టులు :
5000 ఎకరాల నుండి 25000 ఎకరాలకు లేదా 2000 హెక్టార్ల నుండి 10000 హెక్టార్ల భూమికి సాగునీరు అందించే వాటిని మద్యతరహ ప్రాజేక్టులు అంటారు.
3) చిన్నతరహ ప్రాజేక్టులు :
5000 ఎకరాలు కంటే తక్కువ లేదా 2000 హెక్టార్ల కంటే తక్కువ భూమికి సాగునీరు అందించే ప్రాజేక్టులను చిన్నతరహ ప్రాజేక్టులు అంటారు.
ప్రవహించే నీటిని దారి మళ్లించడానికి ఉపయోగబడే నిర్మాణాలను బ్యారేజీలు అంటారు. అలాగే నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్ నిర్మాణం చేస్తారు. అలాగే ఒక ప్రాజేక్టు యొక్క గరిష్ట నీటిమట్టం యొక్క ఎత్తును ఎఫ్‌ఆర్‌ఎల్(FRL) అని పిలుస్తారు. రిజర్వాయర్‌లలో నిల్వ చేసే నీటి యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి టిఎంసి(TMC) కొలమానాన్ని ఉపయోగిస్తారు. 1 టిఎంసి దాదాపు 2832 కోట్ల లీటర్లకు సమానం. నీటి యొక్క ప్రవాహ రేటును కొలవడానికి క్యూసెక్ కొలమానాన్ని ఉపయోగిస్తారు. ఒక సెకను కాలంలో నీరు ఎంత వేగంతో పరుగెడుతుందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పంపుహౌజ్‌లోని వాల్వ్‌పై నీటి ఒత్తిడిని తగ్గించడానికి నిర్మించే బావులవంటి నిర్మాణాలను సర్జిపూల్ అంటాము.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజేక్టు (లిప్టు ఇరిగేషన్)
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజేక్టును జయశంకర్ భూపాల పల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలం, కన్నెపల్లి వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాణహిత`చేవేళ్ల ప్రాజేక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరంగా నామకరణం చేసి ఈ ప్రాజేక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజేక్టును 2 మే 2016 రోజున తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు శంకుస్థాపన చేసినారు. ఇది ప్రాణహిత, గోదావరి సంగమం వద్ద ఉంది. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మురు వద్ద కలిసే ఇంద్రావతి నదుల 195 టిఎంసిల నీటిని వినియోగంలోకి తెచ్చి రాష్ట్రంలోని 13జిల్లాలలో వెనకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజేక్టు రూపొందింది.
ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజేక్టును తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దాదాపు 80 వేల 500 కోట్ల వ్యయంతో నిర్మాణం చేస్తుంది. ఈ ప్రాజేక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలు లబ్ది పొందుతున్నాయి. గోదావరి నది నుండి 90 రోజుల పాటు ప్రతి రోజు 2 టిఎంసిల చొప్పున 180 టిఎంసీల నీటిని ఎత్తిపోయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఇది దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఆసియా ఖండలోనే అతిపెద్ద సర్జిపూల్‌ను ఈ కాళేశ్వరం ప్రాజేక్టు కోసం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజేక్టు ద్వారా 18,25,700 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందుతుంది. అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరికరించనున్నారు. ఈ ప్రాజేక్టు కోసం దాదాపు 80 వేల ఎకరాల భూమిని సేకరించారు. అటవీ భూమి 3050 హెక్టార్లను వినియోగిస్తున్నారు. 18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 134.5 టిఎంసీల నీటిని వాడకంలోకి తీసుకురానున్నారు. ప్రాజేక్టు కింద 169 టిఎంసిలను సాగునీటికి, ఆయకట్టు స్థిరికరణకు 34.5 టిఎంసీల నీటిని కేటాయిస్తారు. కాళేశ్వరం నుండి హైద్రాబాద్ త్రాగునీటికి 30 టీఎంసీలు, గ్రామాల త్రాగునీటికి 10 టిఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టిఎంసీల నీటిని అందిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నీటిని కాలువల్లోకి తరలించడానికి ఉన్న పెద్ద సమస్య ఈ ప్రాంతం దక్కన్‌పీఠభూమిలో ఉండటం. గోదావరి నది నుండి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలోకి పోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను లిప్టు ఇరిగేషన్(ఎత్తిపోతల) పథకం అంటారు. నది నుండి నీరు కాలువలోకి రావడం, అక్కడి నుండి సొరంగం ద్వారా ప్రయాణించడం, అక్కడి భూమిలోపల ఉన్న పంపుల ద్వారా తిరిగి పైకి రావడం, అక్కడి నుండి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం ఈ కాళేశ్వరం ప్రాజేక్టులో జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ కోసం 203 కిలోమీటర్ల పొడవైన భూగర్భ టన్నెల్స్, 2 సర్జిపూల్స్, 139 మెగావాట్ల సామర్థ్యం కల్గిన 7 పంపులు వాడుతున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజేక్టులో భాగంగా 140 టిఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో, 1531 కిలోమీటర్ల ప్రధాన కాలువల డిస్ట్రిబ్యూషన్ పొడవు, 203 కి.మీ పోడవైన సొరంగాలు, 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిప్టులు నిర్మాణం చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజేక్టులో భాగంగా మొత్తం 7 లింకుల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు.
➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - I
మేడిగడ్డం రిజర్వాయర్ వద్ద కాళేశ్వరం ప్రాజేక్టు ప్రారంభమవుతుంది. ఈ మేడిగడ్డం (లక్ష్మి) రిజర్వాయర్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 100 మీటర్ల ఎత్తుతో 25 గేట్లతో 16.17 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేసినారు. ఇట్టి నీటిని పంపుహౌజ్ ద్వారా రివర్స్ పంపింగ్ విధానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతి) బ్యారేజికి తరలిస్తారు. ఈ అన్నారం బ్యారేజి నుండి పంపుహౌజ్ ద్వారా పెద్దపల్లి జిల్లాలో ఉన్న సుందిల్ల (పార్వతి) బ్యారేజికి ఎత్తిపోస్తారు. అక్కడినుండి శ్రీపాదఎల్లంపల్లి ప్రాజేక్టుకు తరలిస్తారు. ఈ లింకు`1 లో 3 బ్యారేజిలు, 3 లింకులతో మొత్తం 46.3 కి.మీ నీటిని తరలిస్తారు. దీనిద్వారా దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - II
ఈ లింకు-2 శ్రీపాద సాగర్ నుండి మిడ్‌మానేరు వరకు ఉంటుంది. శ్రీపాదసాగర్‌కు కొద్ది దూరంలో ట్విన్ టన్నెల్‌లు ఏర్పాటు చేసినారు. ఈ ట్విన్‌టన్నెల్‌లు 10 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించారు. పెద్దపల్లి జిల్లాలోని నందిమేడారం నుండి మరో రెండు ట్విన్ టన్నెల్‌లు గాయత్రి పంప్‌హౌజ్ వరకు నీటిని చేరుస్తాయి. ఈ గాయత్రి పంప్‌హౌజ్‌ను కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసినారు. ఇక్కడే ఆసియాలోనే అతిపెద్ద సర్జిపూల్ (ప్రాజేక్టు నీటి ప్రవాహన్ని అదుపు చేసే పెద్ద పెద్ద బావులు) 92 మీటర్ల లోతుతో, 56 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసినారు. ఇక్కడ 139 మెగావాట్లు కల్గిన 7 మోటర్లతో ఈ సర్జిపూల్ నుండి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ వరదకాలువలోకి తీసుకువస్తాయి. అక్కడి నుండి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తారు.
➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - III
ఈ లింకు - 3 మిడ్ మానేరు నుండి అప్పర్ మానేరు వరకు ఉంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా, మల్కపేట వద్ద ఏర్పాటు చేసిన మల్కపేట రిజర్వాయర్‌లోకి మద్యమానేరు నుండి నీటిని తరలిస్తారు. ఇక్కడి నుండి అప్పర్ మానేరుకు తరలిస్తారు. మల్కపేట, మద్యమానేరు, అప్పర్ మానేరు రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే ఉంటాయి. అప్పర్ మానేరు నుండి కామారెడ్డి జిల్లాలోని ఇసాయిపేటకు, ఇసాయిపేట నుండి అమర్లబండ వరకు నీటిని తరలిస్తారు. అమర్లబండ నుండి పైకి భూంపల్లి, గుజ్జార్లు, కాటేవాడికు, కిందివైపు మోతే, తిమ్మక్కపల్లి, కచ్చపూర్ వరకు ఉన్న చిన్న చిన్న రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు.

➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - IV
ఈ లింకు మిడ్ మానేరు నుండి శామిర్‌పేట ట్యాంక్ వరకు ఉంటుంది. మిడ్ మానేరు నుండి అనంతగిరి రిజర్వాయర్‌కు అక్కడి నుండి రంగనాయక సాగర్‌కు అటునుండి మల్లన్న సాగర్‌కు అక్కడినుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు అక్కడి నుండి శామిర్‌పేట ట్యాంక్ వరకు నీటిని తరలిస్తారు. మిడ్ మానేరు ప్రాజేక్టు (శ్రీరాజరాజేశ్వర ప్రాజేక్టు), అనంతసాగర్ ( శ్రీ అన్నపూర్ణ రిజర్వాయర్ 3.5 టిఎంసి నిల్వ సామర్థ్యం కలదు) రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. రంగనాయక్‌సాగర్ (3 టిఎంసిలు) , మల్లన్నసాగర్ , కొండపోచమ్మ రిజర్వాయర్‌లు సిద్దిపేట జిల్లాలో కలవు. కాళేశ్వరం ప్రాజేక్టులో చేపట్టిన అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఈ మల్లన్న సాగర్ 50 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యం కల్గి ఉంది. శామిర్‌పేట ట్యాంక్ ద్వారా జంట నగరాలకు నీటిని అందిస్తారు.
➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - V
ఈ లింకు- 5 మల్లన్న సాగర్ నుండి బస్వాపురం వరకు ఉంటుంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి బస్వాపురం వరకు ఉంటుంది. మల్లన్నసాగర్ నుండి గందమల్ల రిజర్వాయర్ వరకు అక్కడినుండి బస్వాపురం రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తారు.
➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - VI
ఈ లింకు - 6 మల్లన్నసాగర్ నుండి సింగూర్ వరకు ఉంటుంది. దీని ద్వారా మల్లన్న సాగర్ నుండి మంజీరా నదిపై ఉన్న సింగూర్ ప్రాజేక్టు (సంగారెడ్డి) కు అక్కడి నుండి నిజాంసాగర్‌కు అక్కడి నుండి గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజేక్టుకు నీటిని తరలిస్తారు.
➺ కాళేశ్వరం ప్రాజేక్టు లింకు - VII
ఈ లింకు - 7 ద్వారా శ్రీరాంసాగర్ నుండి ఇతర ప్రాంతాలకు నీటిని తరలిస్తారు. దీని ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజేక్టు నుండి దాని చుట్టుపక్కల నుండి చిన్న ట్యాంక్‌ల వంటి రిజర్వాయర్ లకు నీటిని తరలిస్తారు. శ్రీరాంసాగర్ ప్రాజేక్టు పైన గల హగర్ల, దిల్భారా ప్రాంతాలకు అలాగే కింద ఉన్న మసాని ట్యాంక్ , కొండెం ట్యాంక్‌లకు నీటిని తరలించడం ద్వారా ఈ లింకు పూర్తవుతుంది.

గ్రావిటి కెనాల్ | 1531 కి.మీ |
టన్నెల్ | 203 కి.మీ |
ప్రెషర్ / డెలివరి మేయిన్ | 98 కి.మీ |
వాటర్ కండక్టర్ పొడవు | 1832 కి.మీ |
మొత్తం లిప్టులు | 20 |
మొత్తం రిజర్వాయర్ | 20 |
మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యం | 147.71 టిఎంసి |
గోదావరి నది నుండి లిప్టు చేసే వాటర్ కెపాసిటి | 195 టిఎంసి |
గ్రౌండ్ వాటర్ | 25 టిఎంసి |
అందుబాటులోకి వచ్చే నీరు | 240 టిఎంసి |
ఇరిగేషన్ వాటర్ | 169 టిఎంసి |
త్రాగునీటి కోసం కేటాయించిన నీరు | 40 టిఎంసి |
పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన నీరు | 16 టిఎంసి |
డిజైన్డ్ పవర్ రేటింగ్ | 4627 మెగావాట్లు |
లబ్ది పొందే జిల్లాలు | 13 |
పేరు | కెపాసిటి (టిఎంసిలలో) |
మేడిగడ్డ బ్యారేజ్ | 16.17 |
అన్నారం బ్యారేజ్ | 11.9 |
సుందిళ్ల బ్యారేజ్ | 5.11 |
మేడారం బ్యారేజ్ | 0.78 |
అనంతగిరి రిజర్వాయర్ | 3.50 |
శ్రీ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ | 3.00 |
శ్రీ మల్లన్నసాగర్ రిజర్వాయర్ | 50.00 |
మల్కపేట రిజర్వాయర్ | 3.00 |
కొండపోచమ్మ రిజర్వాయర్ | 7.00 |
అమర్లబండ రిజర్వాయర్ | 5.00 |
కచ్చపూర్ రిజర్వాయర్ | 2.50 |
తిమ్మక్కపల్లి | 3.00 |
ఇసాయిపేట | 2.50 |
భూపల్లి రిజర్వాయర్ | 0.09 |
గుజ్జాల్ రిజర్వాయర్ | 1.50 |
కట్టెవాడి రిజర్వాయర్ | 5.00 |
మోతే రిజర్వాయర్ | 2.90 |
కొండం చెరువు | 3.50 |
గందమల్ల రిజర్వాయర్ | 9.87 |
బస్వాపురం రిజర్వాయర్ | 11.39 |
Link No | Particulars | Hectares | Acres |
Link - I | From Medigadda Barrage on Godavari River to Sripada Yellampally Project | 12141 | 30000 |
Link - II | From Sripada Yellampally Project to Mid Manair Reservoir (Package 6, 7, 8) | - | - |
Link - III | From Mid Manair Reservoir to Upper Manair Reservoir (Package 9) | 34864 | 86150 |
Link - IV | From Mid Manair Reservoir to Konda Pochamma Reservoir (Package 10, 11, 12, 13, 14) | 238478 | 589280 |
Link - V | From Anicut to Chityala (Package 15, 16) | 101902 | 251800 |
Link - VI | From Sri Komaravelly Mallanna Sagar to Singur Reservoir (Package 17, 18, 19) | 133161 | 329042 |
Link - VII | From SRSP Foreshore to Nizam Sagar Canals and upto Kondem Cheruvu (package 20, 21, 22) and to Dilwapur (package 27) and hangarga (package 28) village for Nirmal and Mudhole Constituency | 218304 | 539428 |
Total | 7,38,851 | 18,25,700 |
0 Comments