
Telangana Geography
తెలంగాణ భౌగోళిక / నైసర్గిక స్వరూపం
తెలంగాణ కొండలు - గుట్టలు
Telangana kondalu, guttalu in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
తెలంగాణ రాష్ట్రం దక్కన్ ఫీఠభూమిలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ కొండలు గుట్టలు సమృద్దిగా ఉన్నాయి. తెలంగాణ పీఠభూమి ఉత్తర, వాయువ్య దిశలలో పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు అంజంతా శ్రేణి నుండి విడిపొయి వివిధ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. 800 మీటర్ల నుండి 900 మీటర్ల వరకు ఉండేవాటిని కొండలు అని, 600 నుండి 800 మీటర్ల ఎత్తువరకు ఉండే వాటిని గుట్టలు అని పిలుస్తారు.
ఉత్తరతెలంగాణలోని గుట్టలు పశ్చిమ కనుమల్లో నుండి విస్తరించి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సముద్రమట్టానికి దాదాపు 600 మీటర్ల ఎత్తువరకు ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో సత్మాల కొండలు విస్తరించి ఉన్నాయి. ఇవి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సత్వాల కొండలకు దక్షిణ భాగంలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ సత్వాల కొండల యొక్క ఘాట్స్‌ను కెరెమెరి ఘాట్స్ అని పిలుస్తారు. ఈ కెరిమెరి ఘాట్స్ కొమురంభీమ్ జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ కొండలు విస్తరించి ఉన్నాయి. నిర్మల్ కొండల యొక్క ఘాట్‌లను మహబూబ్ ఘాట్స్ అని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం అతిఎత్తయిన ఘాట్స్‌గా మహబూబ్ ఘాట్స్ పేరుగాంచాయి. తెలంగాణలో పశ్చిమకనుమలలో ఎత్తయిన శిఖరం మహబూబ్ కొండలు ఇవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. సిర్పుర్ కొండలు కొమురంభీమ్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
మద్యతెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జగిత్యాల కొండలు అని అంటారు. జగిత్యాల కింది వైపున రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు విస్తరించి ఉన్నాయి. సిర్నాపల్లి కొండలు నిజామాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. రామగిరి కొండలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. బూజుగుట్టలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. లక్ష్మిదేవునిపల్లి కొండలు సిద్దిపేట జిల్లాలో కలవు.
తూర్పు తెలంగాణలో పాండవుల కొండలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. కందికల్ కొండలు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కందికల్ కొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ఈ పాపికొండలు మద్యలో గోదావరి నది ప్రవహిస్తుంది. పాపికొండలలో గోదావరి నది బైసన్‌గార్జ్ అనే లోయను ఏర్పరుస్తుంది. ఖమ్మం జిల్లాలో కనిగిరి కొండలు కనిపిస్తాయి. యల్లందులపాడు గుట్టలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. వెరెన్ కొండలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి.
దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని బాలాఘాట్ కొండలు అధికంగా విస్తరించి ఉన్నాయి. నైఋతి వైపు వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు ఉన్నాయి. షాబాద్ కొండలు మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కోయల్ కొండలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి. ఇక్కడే పెద్దవాగు జన్మిస్తుంది. గోల్కొండ (గొల్లకొండ) హైద్రాబాద్ నగరంలో కలదు. రాచకొండలు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. నంది కొండలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌తో ఈ కొండలు నిండి ఉంటాయి. అమ్రాబాద్ గుట్టలు నాగర్‌కర్నూర్ ఉన్నాయి. ఈ అమ్రాబాద్ యొక్క ఎత్తు దాదాపు 520 మీటర్లు ఉంటాయి. నల్లమల కొండలు ఇవి నాగర్‌కర్నూల్ జిల్లాలో దాదాపు 1100 మీటర్ల ఎత్తుతో విస్తరించి ఉన్నాయి. ఈ అమ్రాబాద్, నల్లమల కొండలు కృష్ణా మరియు తుంగభద్ర నదుల మద్యలో ఉంటాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నల్లమల కొండలను తూర్పుకనుమలు అని పిలుస్తారు.
తెలంగాణ ప్రాంతం నిర్మాణం, స్వరూపాన్ని బట్టి రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించారు
1) తెలంగాణ ఫీఠభూమి :
తెలంగాణ ఫీఠభూమి దాదాపు 59,903 చ.కి.మీ విస్తీర్ణం కలదు. ఇది సముద్ర మట్టానికి దాదాపు 500 మీ నుండి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ దార్వార్ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ దార్వార్ శిలలు కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. దక్కన్ నాపాలు(లావా శిలలు) రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. గొండ్వానా శిలలు నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో ఉన్నాయి.
2) గోదావరి బెసిన్ ప్రాంతం :
ఈ గోదావరి పరివాహక ప్రాంతం 37,934 చ.కి.మీ విస్తరించి ఉన్నాయి. ఇవి నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం గొండ్వానా శిలలతో ఏర్పడిరది. కార్భోనిఫెరస్ రాళ్లు మరియు బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నాయి. తెలంగాణ వరదలు, వర్షాలు అధికంగా ఉండే ప్రాంతం.
3) కృష్ణా పర్వత పాద ప్రాంతం :
ఈ కృష్ణాపర్వత ప్రాంతం 14,240 చ.కి.మీ విస్తరించి ఉంది. ఈ ప్రాంతం దక్కన్ నాపలు / లావా శిలలతో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు అత్యంత సారవంతమైన నేలలు కల్గి ఉండి సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
సత్మాల కొండలు | ఆదిలాబాద్ |
కొమురంభీమ్ | |
ఆసిఫాబాద్ | |
కెరిమెరి ఘాట్స్ | కొమురంభీమ్ |
నిర్మల్ కొండలు (మహబూబ్ ఘాట్స్) | ఆదిలాబాద్ |
జగిత్యాల కొండలు | జగిత్యాల |
రాఖీ కొండలు | జగిత్యాల |
రాజన్నసిరిసిల్ల | |
సిర్నాపల్లి కొండలు | నిజామాబాద్ |
రామగిరి కొండలు | పెద్దపల్లి |
బూజుగుట్టలు | మెదక్ |
లక్ష్మిదేవి పల్లి గుట్టలు | సిద్దిపేట |
పాండవుల కొండలు | జయశంకర్ భూపాలపల్లి |
కందికల్ కొండలు | మహబూబాబాద్, |
భద్రాద్రి కొత్తగూడెం | |
పాపికొండలు, ఎల్లండ్లపాడు గుట్టలు, రాజుగుట్టలు | భద్రాద్రి కొత్తగూడెం |
కనిగిరి కొండలు | ఖమ్మం |
యల్లందులపాడు గుట్టలు | భద్రాద్రి కొత్తగూడెం |
వెరెన్ కొండలు | మహబూబాబాద్ |
అనంతగిరి కొండలు (తెలంగాణ ఉరిటి) | వికారాబాద్ |
షాబాద్ కొండలు | మహబూబ్‌నగర్ |
కోయల్‌కొండలు | నారాయణపేట |
రాచకొండలు | నల్గొండ |
రంగారెడ్డి | |
నంది కొండలు | రంగారెడ్డి |
అమ్రాబాద్ గుట్టలు, నల్లమలకొండలు | నాగర్‌కర్నూల్ |
0 Comments