United Nations Quiz Test in Telugu || ఐక్యరాజ్యసమితి క్విజ్‌ క్వశ్చన్స్‌ || gk questions in telugu

gk questions telugu 100 g.k. bits in telugu latest gk questions telugu gk bits in telugu pdf gk questions with answers gk questions in telugu with answers gk mock test in telugu

ఐక్యరాజ్యసమితి క్విజ్‌ క్వశ్చన్స్‌
United Nations Multiple Gk Questions in telugu

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

1) ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన రోజు ఏది ?
ఎ) 24 అక్టోబర్‌ 1945
బి) 24 అక్టోబర్‌ 1946
సి) 24 అక్టోబర్‌ 1948
డి) 24 అక్టోబర్‌ 1949

జవాబు ః ఎ (24 అక్టోబర్‌ 1945)

2) ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
ఎ) 24 జూలై
బి) 24 నవంబర్‌
సి) 24 డిసెంబర్‌
డి) 24 అక్టోబర్‌

జవాబు ః డి (24 అక్టోబర్‌ )
ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన రోజును అంతర్జాతీయంగా ఐక్యరాజ్యదినోత్సవం జరుపుకుంటారు.

3) ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) జేనివా
బి) న్యూయార్క్‌
సి) ప్యారిస్‌
డి) వియన్నా

జవాబు ః బి (న్యూయార్క్‌)
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని న్యూయార్క్‌ లో ఉంది.

4) ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఎన్ని ఉన్నాయి ?
ఎ) 5
బి) 8
సి) 6
డి) 9

జవాబు ః సి (అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీష్‌, స్పానిష్‌ అరబిక్‌ 6 భాషలు ఉన్నాయి)

5) ఐక్యరాజ్యసమితిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ?
ఎ) 195
బి) 186
సి) 179
డి) 193

జవాబు ః డి (193)

6) ప్రపంచ పార్లమెంట్‌ అని దేనిని పిలుస్తారు ?
ఎ) భద్రతా మండలి
బి) ఆర్థిక సమాజిక మండలి
సి) సాధారణ సభ
డి) సచివాలయం

జవాబు ః సి (సాధారణ సభ)

7) సాధారణ సభలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ?
ఎ) 195
బి) 186
సి) 179
డి) 193

జవాబు ః డి (193)
ఐక్యరాజ్యసమితిలో ఉన్న అన్ని దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉంటాయి.

8) సాధారణ సభలో హిందిలో ప్రసంగించిన తొలి భారతీయుడు ఎవరు ?
ఎ) విజయలక్ష్మి పండిట్‌
బి) అటల్‌బీహారి వాజ్‌పేయి
సి) మన్మోహన్‌ సింగ్‌
డి) నరేంద్రమోడీ

జవాబు ః బి(అటల్‌బీహారి వాజ్‌పేయి)
అటల్‌బీహారి వాజ్‌పేయి విదేశాంగ మంత్రి హోదాలో ఒకసారి, ప్రధాన మంత్రి హోదాలో ఒకసారి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు.

9) సాధారణసభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ?
ఎ) విజయలక్ష్మి పండిట్‌
బి) సుష్మస్వరాజ్‌
సి) ఇందిరాగాంధీ
డి) మయావతి

జవాబు ః ఎ (విజయలక్ష్మి పండిట్‌)

10) భద్రతామండలిలో ప్రస్తుతం ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ?
ఎ) 20
బి) 10
సి) 15
డి) 25

జవాబు ః సి (15)

11) భద్రతామండలిలో క్రిందివానిలో విటో అధికారం లేని దేశం ఏది ?
ఎ) చైనా
బి) రష్యా
సి) భారత్‌
డి) అమెరికా

జవాబు ః సి (భారత్‌)
భద్రతామండలిలో చైనా, ప్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికా దేశాలకు విటో అధికారం ఉన్నాయి.

12) భద్రతామండలిలో భారత్‌ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశం ఎన్నికైంది ?
ఎ) 6 సార్లు
బి) 7 సార్లు
సి) 5 సార్లు
డి) 8 సార్లు

జవాబు ః బి (7 సార్లు)

13) భద్రతామండలికి ఏ సంవత్సరంలో నోబెల్‌ శాంతిబహుమతి లభించింది. ?
ఎ) 1978
బి) 1983
సి) 1988
డి) 1990

జవాబు ః సి (1988)

14) జి4 కూటమిలో సభ్యదేశం కానిది ఏది ?
ఎ) భారత్‌
బి) బ్రెజిల్‌
సి) జర్మనీ
డి) రష్యా

జవాబు ః డి (రష్యా)
భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌ దేశాలు జి4 కూటమిగా ఏర్పడ్డాయి.

15) ఫసిపిక్‌ ఎకనమిక్‌ కమీషన్‌ ఎక్కడ ఉంది ?
ఎ) థాయిలాండ్‌
బి) చైనా
సి) రష్యా
డి) ఇండియా

జవాబు ః ఎ (థాయిలాండ్‌)
ఫసిపిక్‌ ఎకనమిక్‌ కమీషన్‌ థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో కలదు.

16) అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) ఇండోనేషియా (జకర్తా)
బి) అమెరికా (న్యూయార్క్‌)
సి) నెదర్లాండ్‌ (దిహేగ్‌)
డి) చైనా (బీజింగ్‌)

జవాబు ః సి నెదర్లాండ్‌ (దిహేగ్‌)

17) అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షునిగా పనిచేసిన భారతీయుడు ఎవరు ?
ఎ) బిఎన్‌ రావు
బి) ఆర్‌.ఎస్‌ ఫాఠక్‌
సి) దల్వీర్‌ భండారి
డి) నాగేందర్‌ సింగ్‌

జవాబు ః డి (నాగేందర్‌ సింగ్‌)
అంతర్జాతీయ న్యాయస్థానానికి బిఎన్‌ రావు, నాగేందర్‌ సింగ్‌ , ఆర్‌.ఎస్‌ ఫాఠక్‌, దల్వీర్‌ భండారిలు న్యాయమూర్తులుగా పనిచేసారు.

18) అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీకాలం ఎంత?
ఎ) 10 సంవత్సరాలు
బి) 9 సంవత్సరాలు
సి) 8 సంవత్సరాలు
డి) 7 సంవత్సరాలు

జవాబు ః బి (9 సంవత్సరాలు)
న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది.

19) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ పదవీకాలం ఎంత ?
ఎ) 5 సంవత్సరాలు
బి) 9 సంవత్సరాలు
సి) 8 సంవత్సరాలు
డి) 7 సంవత్సరాలు

జవాబు ః ఎ (5 సంవత్సరాలు)

20) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ?
ఎ) అటల్‌బీహారి వాజ్‌పేయి
బి) శశిథరూర్‌
సి) మన్మోహన్‌సింగ్‌
డి) మొరార్జి దేశాయి

జవాబు ః బి (శశిథరూర్‌)


Also Read :

21) ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఎవరు ?
ఎ) బాన్‌కీమూన్‌
బి) ఆంటోనియో గుటెరస్‌
సి) కోఫిఅన్నన్‌
డి) బౌత్రోస్‌ ఘలీ

జవాబు ః బి (ఆంటోనియో గుటెరస్‌)
పోర్చుగల్‌కు చెందిన ఆంటోనియో గుటెరస్‌ రెండుసార్లు ఎన్నికయ్యాడు. అతని రెండోవిడత పదవీకాలం 01-01-2022 నుండి ప్రారంభం అయింది.

22) ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్‌ ?
ఎ) డాగ్‌ హమ్మర్స్‌ ఓల్డ్‌ (స్వీడన్‌)
బి) యుథాంట్‌ (మయిన్మార్‌)
సి) ట్రిగ్వేలి (నార్వే)
డి) కుర్ట్‌ వాల్దిమ్‌ (ఆస్ట్రియా)

జవాబు ః సి) ట్రిగ్వేలి (నార్వే)

23) యూనిసెఫ్‌ (ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) జేనీవా
సి) బ్రస్సెల్స్‌
డి) బ్యాంకాక్‌

జవాబు ః ఎ (న్యూయార్క్‌)
యూనిసెఫ్‌ లో 191 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1965లో నోబెల్‌ శాంతిబహుమతి వచ్చింది.

24) యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) జేనీవా
సి) బ్రస్సెల్స్‌
డి) ప్యారిస్‌

జవాబు ః డి ( ప్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌)
యునెస్కోలో 195 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1946లో స్థాపించారు.

25) United Nations Development Programme (UNDP) (ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) జేనీవా
సి) బ్రస్సెల్స్‌
డి) ప్యారిస్‌

జవాబు ః ఎ ( అమెరికా రాజధాని న్యూయార్క్‌ )
యునెస్కోలో 177 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1965లో స్థాపించారు.

26) United Nations High Commissioner for Refugees (UNHCR )(ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషన్‌) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) జేనీవా
సి) బ్రస్సెల్స్‌
డి) ప్యారిస్‌

జవాబు ః బి ( జేనివా (స్విట్జర్‌లాండ్‌ )
దీనిని 1950లో స్థాపించారు. దీనికి 1955, 1981 లో నోబెల్‌ శాంతిబహుమతి లభించింది

27) United Nations Fund for Population Activities (UNFPA ) (ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) జేనీవా
సి) బ్రస్సెల్స్‌
డి) ప్యారిస్‌

జవాబు ః ఎ (న్యూయార్క్‌ )
దీనిని 1969 లో స్థాపించారు.

28) United Nations Environment Programme (UNEP ) (ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) నైరోబి
సి) ప్యారిస్‌
డి) బ్రస్సెల్స్‌

జవాబు ః బి (నైరోబి)
దీనిని 1972 లో స్థాపించారు.

29) World Health Organization (WHO )(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) ప్యారిస్‌
సి) బ్రస్సెల్స్‌
డి) జేనీవా

జవాబు ః డి (జేనివా)
దీనిని 1948 లో స్థాపించారు.

30) World Trade Organization (WTO )(ప్రపంచ వాణిజ్య సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) జేనీవా
బి) ప్యారిస్‌
సి) బ్రస్సెల్స్‌
డి) న్యూయార్క్‌

జవాబు ః ఎ (జేనివా)-స్విట్జర్లాండ్‌
దీనిని 1995 లో స్థాపించారు. 164 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

31) World Meteorological Organization (WMO )(ప్రపంచ వాతావరణ సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) బ్రస్సెల్స్‌
బి) ప్యారిస్‌
సి) జేనీవా
డి) న్యూయార్క్‌

జవాబు ః సి (జేనివా)-స్విట్జర్లాండ్‌
దీనిని 1950 లో స్థాపించారు.

32) Food and Agriculture Organization of the United Nations (FAO) (ప్రపంచ వ్యవసాయ సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) బ్యాంకాక్‌
బి) బీజింగ్‌
సి) బ్రస్సెల్స్‌
డి) రోమ్‌

జవాబు ః డి (రోమ్‌ - ఇటలీ)
దీనిని 1945 లో స్థాపించారు. 194 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.

33) World Food Programme (WFP) (ప్రపంచ ఆహార పథకం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) వాషింగ్టన్‌
బి) రోమ్‌
సి) వియన్నా
డి) దిహెగ్‌

జవాబు ః బి (రోమ్‌ - ఇటలీ)
దీనిని 1963 లో స్థాపించారు.

34) ఐక్యరాజ్యసమితి 193వ దేశంగా ఏ దేశం చేరింది ?
ఎ) దక్షిణ సుడాన్‌
బి) మయిన్మార్‌
బి) చిలీ
డి) ఇండోనేషియా

జవాబు ః ఎ (దక్షిణ సుడాన్)

35) International Labour Organization (ILO)(అంతర్జాతీయ కార్మిక సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) వియన్నా
సి) జేనీవా
డి) ప్యారిస్‌

జవాబు ః సి (జేనీవా ` స్విట్జర్లాండ్‌)
దీనిని 1919 లో స్థాపించారు. 1946 లో యుఎన్‌లో ప్రత్యేక ప్రాతినిద్య సంస్తగా ఏర్పడిరది.

36) IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూయార్క్‌
బి) ప్యారిస్‌
సి) జకార్తా
డి) వియన్నా

జవాబు ః డి (వియన్నా - ఆస్ట్రియా)
దీనిని 1957 లో స్థాపించారు. దీనికి 2005లో శాంతిబహుమతి లభించింది

37) ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) జకార్తా (ఇండోనేషియా)
బి) రోమ్‌ (ఇటలీ)
సి) బీజీంగ్‌ (చైనా)
డి) టోక్యో (జపాన్‌)

జవాబు ః డి (టోక్యో)
దీనిని 1972 లో స్థాపించారు

38) United Nations Office on Drugs and Crime (UNODC) (ఐక్యరాజ్యసమితి మాదవ ద్రవ్య నిరోధక కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రోమ్‌ (ఇటలీ)
బి) ప్యారిస్‌ (ప్రాన్స్‌)
సి) వియన్నా (ఆస్ట్రియా)
డి) జకార్తా (ఇండోనేషియా)

జవాబు ః సి వియన్నా (ఆస్ట్రియా)

39) World Bank (ప్రపంచ బ్యాంక్‌) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రోమ్‌ (ఇటలీ)
బి) వాషింగ్టన్‌ (అమెరికా)
సి) టోక్యో (జపాన్‌)
డి) బీజింగ్‌ (చైనా)

జవాబు ః బి (వాషింగ్టన్‌)
దీనిని 1944 లో స్థాపించగా 1945 నుండి అమల్లోకి వచ్చింది. దీని పురాతన పేరు ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రికన్‌స్ట్రక్షన్‌ (ఐబిఆర్‌డి)

40) World Trade Organization (ప్రపంచ వాణిజ్య సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) జకార్తా (ఇండోనేషియా)
బి) ప్రాన్స్‌ (ప్యారిస్‌)
సి) వాషింగ్టన్‌ (అమెరికా)
డి) లండన్‌ (ఇంగ్లండ్‌)

జవాబు ః సి (వాషింగ్టన్‌)
దీనిని 1944 లో స్థాపించగా 1945 నుండి అమల్లోకి వచ్చింది.


Also Read :

Post a Comment

0 Comments