International Organizations and Their Head Quarters
Gk in Telugu || General Knowledge in Telugu
అంతర్జాతీయ సంస్థలు

➠ జి20 :
జి20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) అనేది 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్‌తో కూడిన అంతర్జాతీయ సంస్థ. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే విధానాలను చర్చించడానికి మరియు సమన్వయం చేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చడానికి ఇది 1999లో స్థాపించబడింది.
జి20 సభ్య దేశాలు
- అర్జెంటీనా
- ఆస్ట్రేలియా
- బ్రెజిల్
- కెనడా
- చైనా
- ఫ్రాన్స్
- జర్మనీ
- ఇండియా
- ఇండోనేషియా
- ఇటలీ
- జపాన్
- మెక్సికో
- రష్యా
- సౌదీ అరేబియా
- దక్షిణాఫ్రికా
- దక్షిణ కొరియా
- టర్కీ
- యునైటెడ్ కింగ్‌డమ్
- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
- యూరోపియన్ యూనియన్‌లు
మొత్తం 20 సభ్యదేశాలుగా ఉన్నాయి.
జి20 నాయకులు ఆర్థిక మరియు రాజకీయ సమస్యల శ్రేణిని చర్చించడానికి మరియు వాతావరణ మార్పు, అంతర్జాతీయ వాణిజ్యం మరియు ప్రజారోగ్యం వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో పని చేయడానికి ప్రతి సంవత్సరం జి20 సమ్మిట్ ద్వారా సమావేశమవుతారు.
జి20 సభ్యులు ప్రపంచ జిడిపిలో 85%, ప్రపంచ వాణిజ్యంలో 75% పైగా మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జి20 గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి
➠ ఏసియాన్ (ASEAN) Association of South East Asian Nations :
ఏసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్) అనేది పది ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ సంస్థ. ఏసియాన్ మొత్తం 10 సభ్యదేశాలుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది.
సభ్యదేశాలు-
- బ్రూనై
- కంబోడియా
- ఇండోనేషియా
- లావోస్
- మలేషియా
- మయన్మార్
- ఫిలిప్పీన్స్
- సింగపూర్
- థాయిలాండ్
- వియత్నాం
- ఏసియాన్ డిక్లరేషన్ (బ్యాంకాక్ డిక్లరేషన్) సంతకంతో ఆగష్టు 8, 1967న స్థాపించబడినది. అప్పుడు స్థాపక సభ్యులుగా ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్ దేశాలున్నాయి.
- ఏసియాన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి మరియు సాంస్కృతిక అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడం మరియు సభ్య దేశాలకు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై పరస్పరం మరియు సహకరించడానికి అవకాశాలను అందించడం. ఏసియాన్ ఏకాభిప్రాయం-ఆధారిత నిర్ణయం తీసుకునే ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది మరియు దాని కార్యకలాపాలు వాణిజ్యం మరియు పెట్టుబడి, విద్య, ఇంధనం మరియు పర్యావరణంతో సహా అనేక రకాల సమస్యలపై దృష్టి సారించాయి.
- ఆసియాన్ ఒక ముఖ్యమైన ప్రాంతీయ సంస్థగా మారింది, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక ఏకీకరణ మరియు వివిధ ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై సహకారాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు యూరోపియన్ యూనియన్‌తో సహా దాని సంభాషణ భాగస్వాములతో సన్నిహిత సంబంధాలను కూడా ఏర్పరచుకుంది.
- 2023 ఏసియాన్ సమ్మిట్ ఇండోనేషియాలో జరుగుతుంది.
- 2024 ఏసియాన్ సమ్మిట్ లావోస్‌లో జరుగుతుంది.
➠ ఆసియాన్ - భారత్ :
- ఏసియాన్ కూటమి, భారతదేశానికి మద్య 1992 లో చర్చాభగస్వాములుగా అంగీకారం కుదిరింది. 1996 నాటికి పూర్తిస్థాయి చర్చల భాగస్వామి అయింది.
- భారతదేశం తొలిసారిగా 1996 లో ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియాన్ సమావేశానికి చర్చల భాగస్వామిగా హజరైంది.
- 2002 లో కంబోడియాలో మొట్టమొదటిసారిగా ఆసియాన్ - భారత్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. అప్పటి నుండి అది ప్రతిసంవత్సరం జరుగుతుంది.
- ఆసియాన్ దేశాల వార్షిక సమావేశానంతరం ఆసియాన్ - భారత శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.
- 18వ ఆసియాన్ - భారత్ శిఖరాగ్ర సదస్సు -2021 బ్రూనై అధ్యక్షతన జరిగింది.
- 2022 నాటికి ఆసియాన్ - భారత్ భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అందువల్ల ఆసియాన్-భారత స్నేహ సంవత్సరంగా జరుపుకుందామని భారత ప్రధాన పిలుపునిచ్చారు.
➠ EAST ASIA SUMMIT (EAS) :
- తూర్పు ఆసియా దేశాల తొలి శిఖరాగ్ర సదస్సు 2005 డిసెంబర్ 14న కౌలాలంపూర్ (మలేషియా)లో జరిగింది. ఈ సదస్సులు వార్షిక ఆసియాన్ సదస్సులు ముగిసిన వెంటనే అదే నగరంలో జరుగుతాయి.
- ప్రస్తుతం సభ్యదేశాలు 18 ఉన్నాయి. (ఆసియాన్ 18 దేశాలు + ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా)
➠ నాటో NATO(నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్):
- దీనిని 1949 లో ఏప్రిల్ 4 న స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో కలదు.
- ప్రస్తుతం 30 (రష్యా డైలాగ్ పార్ట్‌నర్‌గా ఉంటుంది) సభ్యదేశాలు కలవు.
- ఇది ఉత్తర అమెరికా మరియు ఐరోపాలోని 30 సభ్య దేశాల రాజకీయ మరియు సైనిక కూటమి. దీని యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం దాని సభ్యులకు సామూహిక రక్షణ మరియు భద్రతను అందించడం, పరస్పర రక్షణ సూత్రంతో ఒక సభ్యునిపై దాడిని అందరిపై దాడిగా పరిగణిస్తారు. నాటో దాని సభ్యుల మధ్య రాజకీయ మరియు ఆర్థిక సహకారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక శాంతి పరిరక్షణ మరియు మానవతా కార్యకలాపాలలో పాలుపంచుకుంది. సంస్థ తన సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా నిర్ణయాధికారంతో కమిటీల వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది.
➠ ఇంటర్‌పోల్ (INTERPOL)(ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) :
- దీనిని 1923 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం లయోన్స్ (ప్రాన్స్) లో కలదు.
- ప్రారంభంలో సభ్యదేశాల సంఖ్య 20 ఉండేవి. ప్రస్తుతం 194 దేశాలు ఉన్నాయి.
- ఇది ప్రపంచ పోలీసుబాసుగా పనిచేస్తుంది.
- అంతర్జాతీయ పోలీసు సహకారాన్ని సులభతరం చేసే అంతర్ ప్రభుత్వ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట అమలు సంస్థలను సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, ప్రయత్నాలను సమన్వయం చేసుకోవడానికి మరియు పరిశోధనలు మరియు కార్యకలాపాలలో పరస్పరం సహకరించుకోవడానికి అనుమతించే నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. ఈ సంస్థ తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలు మరియు మానవ అక్రమ రవాణా వంటి వివిధ రకాల అంతర్జాతీయ నేరాలపై దృష్టి సారిస్తుంది.
➠ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ AMNESTY INTERNATIONAL (ప్రపంచ మానవహక్కుల సంస్థ) :
- దీనిని 1961 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో కలదు.
- ఈ సంస్థను న్యాయవాది పీటర్ బెన్సన్ (బ్రిటన్) స్థాపించారు.
- ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. ఈ సంస్థకు 1977 నోబెల్ శాంతిబహుమతి లభించింది.
➠ అంతర్జాతీయ నేర న్యాయస్థానం - ICC (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) :
- దీనిని 2002 జూలై 1 న స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం దిహేగ్ (నెదర్లాండ్స్) లో కలదు.
- ఇది మారణహోమం, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలు మరియు దురాక్రమణ నేరం వంటి అంతర్జాతీయ నేరాలకు వ్యక్తులను విచారించడానికి ఏర్పాటు చేయబడిరది.
➠ ఓపెక్ - OPEC (ఆర్గనేజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రిస్) :
- దీనిని 1960 సంవత్సరంలో స్థాపించారు.
- దీనిని ప్రధాన కార్యాయం వియన్నా(ఆస్ట్రియా) లో కలదు.
- దీనిని ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాలు కలిసి 1960 లో ఓపెక్ ను స్థాపించారు. 2021 జూన్ నాటికి 13 సభ్యదేశాలు కలవు.
- ఇది పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ. ఇది పెట్రోలియం ఉత్పత్తిదారులకు సరసమైన మరియు స్థిరమైన ధరలను మరియు వినియోగదారులకు సాధారణ సరఫరాను నిర్ధారించే లక్ష్యంతో దాని సభ్య దేశాల పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం మరియు ఏకీకృతం చేయడం ఓపెక్ యొక్క లక్ష్యం. దీని సభ్యదేశాలు
- అల్జీరియా
- అంగోలా
- కాంగో
- ఈక్వటోరియల్ గినియా
- గాబోన్
- ఇరాన్
- ఇరాక్
- కువైట్
- లిబియా
- నైజీరియా
- సౌదీ అరేబియా
- యున్కెటెడ్ అరబ్ ఎమిరేట్స్
- వెనిజులా
➠ అపెక్ - APEC (ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య) :
- దీనిని 1989లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో కలదు.
- ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు.
- ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దాని సభ్యదేశాల ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక సహకారం, వాణిజ్యం మరియు పెట్టుబడిని ప్రోత్సహించే అంతర్ ప్రభుత్వ ఫోరమ్.
- దీని 21 సభ్యదేశాలు కలవు. అవి. ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పాపువా న్యూ గినియా, పెరూ, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, తైవాన్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, మరియు వియత్నాం.
➠ ఆసియా అభివృద్ది బ్యాంక్ - ADB (ఏసియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) :
- దీనిని 1966లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్ (మనీలా) లో కలదు.
- దీని సభ్యదేశాల సంఖ్య 68.
- ప్రస్తుత అధ్యక్షుడు మసత్సుగు అసకవా
- ఏడిబి ముఖ్య లక్ష్యం సభ్యదేశాల ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, పేదరికాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని రక్షించడం.
- ఆసియాలోనే తొలి పారిశ్రామిక దేశంగా గుర్తింపు పొందిన జపాన్ సారథ్యంలో ADBని ఏర్పాటు చేశారు.
➠ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) :
- దీనిని 1894లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం లుసానే (స్విట్జర్లాండ్) లో కలదు.
- దీని యొక్క ముఖ్యలక్ష్యం ఒలింపిక్ క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహించడం. ఒలింపిక్ ఉద్యమాన్ని ప్రోత్సహించడం
- 2021 ఒలింపిక్స్ జపాన్‌లో జరిగాయి
- 2024 ఒలింపిక్స్ ప్రాన్స్‌లో జరుగుతాయి.
- 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరుగుతాయి.
- 2032 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి.
➠ IPCC (ఇంటర్‌గవర్నెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్) :
- దీనిని 1988లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- ప్రపంచంలో వాతావరణ మార్పులకు మానవ కారణాలను అన్వేషించే సంస్థ. దీనిని WMO, UNEP అనే సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి.
- దీనికి 2007 సంవత్సరంలో నోబెల్ శాంతిబహుమతి అప్పటి అధ్యక్షుడు మరియు భారత పర్యావరణ వేత్త ఆర్.కె పచౌరిలకు సంయుక్తంగా లభించింది.
➠ BIMSTEC (Bay of Bengal initiative for Multi - Sectoral Technical & Economic co-operation) :
- దీని ప్రధాన కార్యాలయం డాకా (బంగ్లాదేశ్) లో కలదు.
- దీని ఇంధనవనరుల కేంద్రం బెంగళూరులో కలదు.
- మొదట 1997 లో BISTECగా ఏర్పాటు చేశారు.
- దీనిలో మొదటగా బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలుండేవి. తర్వాత మయన్మార్ 5వ సభ్యదేశంగా చేరింది. 2004 లో నేపాల్, భూటాన్ లు 6వ, 7వ సభ్యదేశాలుగా చేరినందువల్ల దీని పేరును BIMSTEC (Bay of Bengal initiative for Multi - Sectoral Technical & Economic co-operation) (బంగాళాఖాత తీర దేశాల బహుళార్ధ సాంకేతిక ఆర్థిక సహకార వ్యవస్త) గా మార్చడం జరిగింది.
Also Read :
దీని సభ్యదేశాలు
1) Bangladesh
2) India
3) Myanmar
4) Srilanka
5) Thailand
6) Nepal
7) Bhutan
- ఇది సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, శక్తి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలలో ప్రాంతీయ సహకారం మరియు ఏకీకరణను ప్రోత్సహించడంతోపాటు ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక శిఖరాగ్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తుంది.
- 2020 లో శ్రీలంలో జరగాల్సిన సమావేశాలు కోవిడ్ కారణాంగా వాయిదా వేయడం జరిగింది.
➠ BRICS :
- BRICS అనే పదాన్ని తొలిసారిగా 2001 లో అమెరికాకు చెందిన ఇన్వేస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన గోల్డ్ మన్ శాక్స్ కు చెందిన జిమ్ ఓ నీల్ అనే ఆర్థిక వేత్త ఉపయోగించారు.
- ఈ కూటమి ఏర్పాటుకు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ముఖ్య కారకుడు
- 2021 బ్రిక్స్ సమావేశాలు ఇండియా (న్యూఢిల్లీ)లో ఆన్‌లైన్ విధానంలో జరిగింది.
- 2022 బ్రిక్స్ సమావేశాలు చైనాలో, 2023 బ్రిక్స్ సమావేశాలు దక్షిణాఫ్రికాలో జరగనున్నాయి.
- ఇందులో సభ్య దేశాల నాయకులు పరస్పర ప్రయోజనాలను చర్చించడానికి, ప్రాధాన్యతలను నిర్ణయించడానికి మరియు ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రతి సంవత్సరం సమావేశమవుతారు.
బ్రిక్స్ సభ్యదేశాలు
- BRAZIL
- RUSSIA
- INDIA
- CHINA
➠ అలీనోద్యమ కూటమీ NAM (Non-Aligned Movement) :
- నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ అనేది ఏదైనా ప్రధాన శక్తి కూటమితో తమను తాము పొత్తు పెట్టుకోని దేశాల సమూహం. ఇది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1961లో స్థాపించారు. ప్రస్తుతం 120 సభ్య దేశాలను కలిగి ఉంది. నామ్ యొక్క ప్రాథమిక లక్ష్యాలు దాని సభ్యుల మధ్య శాంతి, సహకారం మరియు పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడం, అలాగే వారి రాజకీయ మరియు ఆర్థిక స్వాతంత్య్రం కోసం వాదించడం.
➠SAARC (South Asian Association for Regional Cooperation) :
- దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య
- దీనిని 1985 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖట్మాండ్ లో కలదు.
దీని సభ్యదేశాలు
- ఇండియా
- మాల్దీవులు
- బంగ్లాదేశ్
- భూటాన్
- శ్రీలంక
- పాకిస్తాన్
- ఆప్ఘనిస్తాన్
- నేపాల్
ఇది తన సభ్య దేశాల మధ్య ఆర్థిక మరియు సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించడం, పేదరిక నిర్మూలనపై దృష్టి సారించడం మరియు ఈ ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
➠ కామన్వేల్త్ ఆఫ్ నేషన్స్ Commonwealth Heads of Government Meeting (CHOGM) :
- దీనిని 1931 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో కలదు.
- బ్రిటిష్ రాజు/రాణి ఈ కూటమికి అధిపతిగా వ్యవహరిస్తారు.
- కామన్వేల్త్ అనేది పూర్వపు బ్రిటిష్ వలస రాజ్యాల కూటమి. అయితే బ్రిటిష్ వలస రాజ్యంకాని స్వతంత్ర దేశాలు కూడా స్వచ్చందంగా ఇందులో చేరవచ్చు.
- కామన్వేల్త్ దేశాలలో అతిపెద్ద దేశం ఇండియా
- సభ్యదేశాల సంఖ్య 53 ఉన్నాయి.
➠ ఆఫ్రికన్ యూనియన్ :
- దీనిని 1963 లో తొలుత ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ గా ఏర్పడిరది. దాని స్థానంలో 2002 లో ఆఫ్రికన్ యూనియన్‌గా ఏర్పాటు చేశారు.
- దీని ప్రధాన కార్యాలయం అడిస్ అబాబా (ఇథియోపియా) లో కలదు.
- ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 54
- ఆఫ్రికన్ యూనియన్ యొక్క లక్ష్యాలు రాజకీయ మరియు ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహించడం, శాంతి మరియు భద్రతను అభివృద్ధి చేయడం మరియు ఖండంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం.
➠ భారత్ - ఆఫ్రికా ఫోరం :
- భారత్ - ఆఫ్రికా ఖండ దేశాల మద్య సంబంధాలను నిర్వహించే అధికార వేదిక భారత్ - ఆఫ్రికా ఫోరం
- ఈ సదస్సు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
- ఈ ఫోరమ్ భారత్ మరియు ఆఫ్రికన్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
- 2015 లో 3వ సదస్సు న్యూఢిల్లీ జరిగింది.
➠ యూరోపియన్ యూనియన్ (ఈయు) :
- దీనిని 1951 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం బ్రస్సెల్‌లో ఉంది.
- 2020 నాటికి ఈయు సభ్యదేశాల సంఖ్య 27
- ఈయు యొక్క న్యాయస్థానం మరియు ఆడిటర్ ల కోర్టు లగ్జెంబర్గ్‌లో కలదు.
- ఈయు యొక్క సెంట్రల్ బ్యాంక్ ఫ్రాంక్ ఫర్ట్(జర్మనీ)లో కలదు.
- యూరోపియన్ యూనియన్ అనేది ప్రధానంగా ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాల రాజకీయ మరియు ఆర్థిక సంఘం. ఇది దాని సభ్యుల మధ్య శాంతి, స్థిరత్వం మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్థాపించబడినది. దీనిలో యూరోపియన్ కమిషన్, యూరోపియన్ పార్లమెంట్, కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ మరియు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఈయు ఒక సాధారణ వాణిజ్య విధానం, కస్టమ్స్ యూనియన్ మరియు ఉమ్మడి కరెన్సీ యూరోతో ఒకే మార్కెట్‌ను కలిగి ఉంది. దీనిని 19 సభ్య దేశాలు ఉపయోగిస్తాయి.
యూరో కరెన్సీ కల్గిన దేశాలు
- ఆస్ట్రియా
- బెల్జియం
- సైప్రస్
- ఎస్టోనియా
- ఫిన్లాండ్
- ఫ్రాన్స్
- జర్మనీ
- గ్రీస్
- ఐర్లాండ్
- ఇటలీ
- లాట్వియా
- లిథువేనియా
- లక్సెంబర్గ్
- మాల్టా
- నెదర్లాండ్స్
- పోర్చుగల్
- స్లోవేకియా
- స్లోవేనియా
- స్పెయిన్
ఈయులో సభ్యత్వం కల్గి ఉండి యూరో కరెన్సీ అంగీకరించని దేశాలు
- డెన్మార్క్
- స్వీడన్
- పోలెండ్
- చెక్‌రిపబ్లిక్
- హంగేరీ
- బల్గేరియా
- రుమేనియా
- క్రోయేషియా
యూరోపియన్ యూనియన్ 27 సభ్యదేశాలు జాబితా -
- ఆస్ట్రియా
- బెల్జియం
- బల్గేరియా
- క్రొయేషియా
- సైప్రస్
- చెక్ రిపబ్లిక్
- డెన్మార్క్
- ఎస్టోనియా
- ఫిన్లాండ్
- ఫ్రాన్స్
- జర్మనీ
- గ్రీస్
- హంగేరి
- ఐర్లాండ్
- ఇటలీ
- లాట్వియా
- లిథువేనియా
- లక్సెంబర్గ్
- మాల్టా
- నెదర్లాండ్స్
- పోలాండ్
- పోర్చుగల్
- రొమేనియా
- స్లోవేకియా
- స్లోవేనియా
- స్పెయిన్
- స్వీడన్
➠ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ :
- దీనిని 1863 లో స్థాపించారు. అధికారికంగా 1864 లో అమలులోకి వచ్చింది.
- దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- దీని యొక్క నినాదం చారిటి ఇన్‌వార్ (యుద్దసేవ)
- దీనిని హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి స్థాపించాడు.
- ప్రకృతి వైపరీత్యాలు, యుద్దాలు సంభవించినప్పుడు బాదితులకు ఉచితంగా, స్వచ్ఛందంగా వైద్య సేవలు అందిస్తుంది.
- ఈ సంస్థకు 1917, 1944, 1963 సంవత్సరాలలో మూడుసార్లు నోబెల్ శాంతిబహుమతి లభించింది.
- ముస్లీం దేశాలలో దీనిని రెడ్‌క్రీసెంట్ పేరుతో పిలుస్తారు.
- ఇజ్రాయెల్ కోరిక మేరకు మాజెన్ డేవిడ్ ఆడమ్ (రెడ్ స్టార్ ఆఫ్ డేవిడ్ లేదా రెడ్ క్రిస్టల్)చిహ్నాన్నికూడా చేర్చేందుకు రెడ్‌క్రాస్ సంస్థ అంగీకరించింది. అయితే ఈ చిహ్నానికి ఇజ్రాయెల్ బయట గుర్తింపు లేదు.
➠ జి-8 కూటమి :
- దీనిని 1975 లో 6 దేశాలతో ఏర్పాటు చేసారు. 1976లో 7వ దేశంగా కెనడా చేరింది.
- 1997 లో రష్యా చేరికతో జి`8 కూటమిగా మారింది. (2014 మార్చి 25న జి`8 నుంచి రష్యాను సస్పెండ్ చేసారు.)
- ఇందులో సభ్యత్వం ఉన్న ఏకైనా ఆసియా దేశం జపాన్
- ఇది ప్రపంచంలోని ఎనిమిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వాల కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వేదిక
సభ్యదేశాలు
- కెనడా
- ఫ్రాన్స్
- జర్మనీ
- ఇటలీ
- జపాన్
- బ్రిటన్
- అమెరికా
- 2022 సమావేశాలు జర్మనీలో జరిగాయి.
- 2023 సమావేశాలు జపాన్‌లో జరుగుతాయి.
➠ జి-15 కూటమి :
- 1989 లో బెల్‌గ్రేడ్‌లో జరిగిన 9వ నామ్ శిఖరాగ్ర సమావేశంలో 15 వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాలు జి-15ను ఏర్పాటు చేశాయి.
- దీనిలో ప్రారంభంలో 15 సభ్య దేశాలను కలిగి ఉంది. అప్పటి నుంచి 18 దేశాలకు సభ్యత్వం విస్తరించింది.
జి-15 సభ్య దేశాలు:
- అల్జీరియా
- అర్జెంటీనా
- బ్రెజిల్
- చిలీజి
- ఈజిప్ట్
- భారతదేశం
- ఇండోనేషియా
- ఇరాన్
- జమైకా
- కెన్యాజి
- మలేషియా
- మెక్సికో
- నైజీరియా
- పెరూజి
- సెనెగల్
- శ్రీలంక
- వెనిజులా
- జింబాబ్వే
➠ IBSA - కూటమి :
- దీనిని 2003 లో ప్రారంభించారు.
- పేద దేశాల మద్య సహకారం , సమగ్ర ప్రపంచాభివృద్దిలో కీలకాపాత్ర పోషించడం ఈ కూటమి యొక్క ముఖ్య లక్ష్యం
- India
- Brazil
- South Africa
➠ నానాజాతి సమితి :
- దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు.
➠ ఎకనామిక్ కమీషన్ ఆఫ్ యూరప్ :
- దీనిని 1947 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు.
➠ గల్ఫ్ దేశాల మండలి :
- దీనిని 1981 లో స్థాపించారు.
- దీనిలో 6 సభ్యదేశాలు కలవు.
అంతర్జాతీయ సంస్థలు క్విజ్ టెస్ట్ |
---|
0 Comments