ఐక్యరాజ్యసమితి (UNITED NATIONS in Telugu) || Gk in Telugu || General Knowledge in Telugu

united nations in telugu

 ఐక్యరాజ్యసమితి (UNITED NATIONS)

UNITED NATIONS in Telugu

Gk in Telugu || General Knowledge in Telugu

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.  

ఐక్యరాజ్యసమితి (United Nations) అనేది దేశాల మధ్య శాంతి, భద్రత మరియు సహకారాన్ని ప్రోత్సహించడం మరియు పేదరికం, వాతావరణ మార్పు మరియు అసమానత వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 1945లో స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం 193 సభ్య దేశాలు ఉన్నాయి, ఇవి అనేక కార్యక్రమాలు మరియు ఏజెన్సీల ద్వారా దాని లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేస్తాయి.

ఐక్యరాజ్యసమితి అధికారికంగా 24 అక్టోబర్‌ 1945 రోజు నుండి పనిచేయడం ప్రారంభించింది.ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 24 తేదిని ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి తొలి సమావేశం 17 జనవరి 1946 రోజున లండన్‌ లో జరిగింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. ఐక్యరాజ్యసమితి చిహ్నాన్ని రెండు ఆలివ్‌ కొమ్మల మద్య గ్లోబుతో రూపొందించారు. 

ఐక్యరాజ్యసమితి అధికార భాషలు 6 :

  • అరబిక్‌ 
  • చైనీస్‌ 
  • ఫ్రెంచి
  • రష్యన్‌
  • ఇంగ్లీష్‌ 
  • స్పానిష్‌ 
  • అరబిక్‌ ఉన్నాయి. 

ఇందులో మొత్తం 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 193 వ దేశంగా దక్షిణ సుడాన్‌ చేరింది. 

ఐక్యరాజ్యసమితిలో 6 ప్రధాన విభాగాలు ఉన్నాయి. 

I) సాధారణ సభ (General Assembly) :

ఈ సాధారణ సభను ప్రపంచ పార్లమెంట్‌గా పిలుస్తారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని న్యూయార్క్‌లో ఉంది. ఈ సభ యొక్క అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు అన్నియు ఈ సాధారణ సభలో సభ్యులుగా వ్యవహరిస్తాయి. ప్రతి దేశానికి ఒక ఓటుహక్కు ఉంటుంది. జనరల్‌ అసెంబ్లీలో నిరాయుధీకరణ మరియు అంతర్జాతీయ భద్రతా కమిటీ, ఆర్థిక మరియు ఆర్థిక కమిటీ మరియు సామాజిక, మానవతావాద మరియు సాంస్కృతిక కమిటీ వంటి నిర్దిష్ట సమస్యలను పరిగణించే అనేక కమిటీలు ఉన్నాయి. జనరల్‌ అసెంబ్లీకి ప్రత్యేక ఏజెన్సీలను స్థాపించడానికి మరియు అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క న్యాయమూర్తులను ఎన్నుకునే అధికారం కూడా ఉంది.

దీని యొక్క విధులు :

  • భద్రతామండలి 10 తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకోవడం, బడ్జెట్‌ను ఆమోదించడం 
  • సంవత్సరానికి ఒకసారి సమావేశం కావడం , భద్రతామండలి సిఫార్సు మేరకు సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవడం.

సాధారణ సభలో భారతీయులు సాధించిన ఘనతలు :

  • సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్‌ 
  • సాధారణ సభలో హిందీలో ప్రసింగించిన తొలి భారత విదేశీ వ్యవహరాల మంత్రి అటల్‌ బీహారి వాజ్‌పేయి(మొరార్జి దేశాయి ప్రధాని ఉన్న సమయంలో ) 
  • సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని అటల్‌ బీహారి వాజ్‌పేయి
  • సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారత ప్రధాన నరేంద్ర మోడీ 

II) భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్‌) :

ఈ భద్రతా మండలిలో ప్రారంభంలో 11 దేశాలు సభ్యదేశాలుగా ఉండేవి. వీటిని 1965 సంవత్సరంలో 15కు పెంచారు. ప్రస్తుతం ఇందులో 15 సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో విటో అధికారంతో శాశ్వత సభ్యదేశాలుగా 5 ఉన్నాయి. అవి.

  1. చైనా
  2. ఫ్రాన్స్‌
  3. రష్యా
  4. బ్రిటన్‌
  5. అమెరికా లు ఉన్నాయి. 

తాత్కాలిక సభ్యులుగా 10 దేశాలున్నాయి.ఇవి సాధారణ సభచే 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు మెజారీటితో ఎన్నికవుతాయి. భద్రతామండలికి భారత్‌ ఇప్పటివరకు 7సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఏర్పడినది. భత్రామండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రోటేషన్‌ పద్దతిలో నెలకొకసారి నిర్వహిస్తాయి. భద్రతామండలికి 1988 లో నోబెల్‌ శాంతిబహుమతి లభించింది. 

ఈ భద్రతా మండలి సాయుధ పోరాటం, ఉగ్రవాదం మరియు సామూహిక విధ్వంసక ఆయుధాల విస్తరణ వంటి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ముప్పులను పరిష్కరించడానికి సమిష్టి చర్య తీసుకునే అధికారంతో సహా భద్రతా మండలి అనేక అధికారాలు మరియు బాధ్యతలను కలిగి ఉంది. భద్రతా మండలి ఆంక్షలు విధించవచ్చు, బలప్రయోగానికి అధికారం ఇవ్వవచ్చు, శాంతి పరిరక్షక బృందాలను ఏర్పాటు చేయవచ్చు మరియు పరిస్థితులను అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు సూచించవచ్చు.

జి4 కూటమి :

భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కొరకు జర్మనీ, జపాన్‌, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు జి4 కూటమిగా ఏర్పడ్డాయి.  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం సంపాదించడం వీటి దీని లక్ష్యం. 

III) ఆర్థిక సామాజిక మండలి (ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌) :

ఇది అంతర్జాతీయ ఆర్థిక మరియు సామాజిక సహకారం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర వేదికగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక మరియు సామాజిక పురోగతిని మరియు విస్తృత స్వేచ్ఛలో మెరుగైన జీవన ప్రమాణాలను ప్రోత్సహించడం కోసం ఇది పనిచేస్తుంది.

ఇందులో 54 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. సాధారణ సభలోని 2/3 వంతు సభ్యులను 3 సంవత్సరాల పదవికాలంతో ఈ 54 సభ్యదేశాలను ఎన్నుకుంటారు. 

దీనికి ప్రపంచవ్యాప్తంగా 5 ప్రాంతీయ కమీషన్లు కలవు 

  1. ఆసియా    -    పసిఫిక్‌ ఎకనమిక్‌ కమీషన్‌ -     బ్యాంకాక్‌ (థాయిలాండ్‌)
  2. వెస్ట్రన్‌ ఆసియా ఎకనమిక్‌ కమీషన్‌     -    బీరుట్‌ (లెబనాన్‌)
  3. యూరప్‌ ఎకనమిక్‌ కమీషన్‌     -    జేనీవా (స్విట్జర్లాండ్‌)
  4. లాటిన్‌ అమెరికా మరియు కరేబియన్‌ ఎకనామిక్‌ కమీషన్‌     -     శాంటియాగో (చిలీ)
  5. ఆఫ్రికా ఎకనమిక్‌ కమీషన్‌     -    అడిస్‌అబాబా 

IV) ధర్మ కర్తృత్వ మండలి :

ఇతర దేశాల పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ధర్మ కర్తృత్వ మండలి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో వీటో అధికారం కల్గిన చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికా సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం నూయార్క్‌లో కలదు. 

V) అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌) :

ఇది దేశాల మధ్య చట్టపరమైన వివాదాలను పరిష్కరిస్తుంది మరియు ఇతర యుఎన్‌ విభాగాలు మరియు ప్రత్యేక ఏజెన్సీలచే సూచించబడిన చట్టపరమైన ప్రశ్నలపై సలహా అభిప్రాయాలను అందిస్తుంది.

ఇందులో 15 మంది స్వతంత్ర న్యాయమూర్తులు ఉంటారు, వీరు యుఎన్‌ యొక్క జనరల్‌ అసెంబ్లీ మరియు భద్రతా మండలిచే తొమ్మిది సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. యుఎన్‌ సభ్యదేశాల మద్య తలెత్తే సమస్యలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిష్కరిస్తుంది. దీని తీర్పు అంతిమం, అప్పీలుకు అవకాశం ఉండదు. అంతర్జాతీయ న్యాయస్తానానికి రోసలైన్‌ హిగ్గిన్స్‌ (బ్రిటన్‌) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. 

ఇందులో  పనిచేసిన  భారతీయులు న్యాయమూర్తులు 

  • బిఎన్‌రావు
  • నాగేందర్‌ సింగ్‌ 
  • ఆర్‌.ఎస్‌ ఫాఠక్‌ 
  • దల్వీర్‌ భండారి 
  • అంతర్జాతీయ న్యాయస్థానికి అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి - నాగేందర్‌ సింగ్‌ 

దీని యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌ లోని దిహెగ్‌ నగరంలో ఉంది. ఇందులో పనిచేసే న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యాక్షుల పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. 

VI. సచివాలయం (సెక్రటేరియట్‌) :

దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో కలదు. ఇది ఐక్యరాజ్యసమితి కార్యాకలాపాలను నిర్వహిస్తుంది. దీని యొక్క సెక్రటరీ జనరల్‌ పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. సెక్రటరీ జనరల్‌ పదవికి పోటీచేసిన తొలి భారతీయుడు శశిథరూర్‌ (కేరళ). 

ఇప్పటివరకు పనిచేసిన సెక్రటరీ జనరల్స్‌ వివరాలు
సెక్రటరీ జనరల్‌ కాలం దేశం
ట్రిగ్వేలి 1946-52 నార్వే (ఐరోపా)
డాగ్‌ హమ్మర్స్‌ ఓల్డ్‌ 1953-61 స్వీడన్‌ (ఐరోపా)
యుథాంట్‌ (రెండుసార్లు) 1961-71 మయిన్మార్‌
కుర్ట్‌ వాల్డీమ్‌ (రెండుసార్లు) 1972-81 ఆస్ట్రియా(ఐరోపా)
జేవియర్‌ పెరెజ్‌ డెక్యులర్‌ (రెండుసార్లు) 1982-91 పెరూ(దక్షిణ అమెరికా)
బౌత్రోస్‌ ఘలీ 1992-97 ఈజిప్టు (ఆఫ్రికా)
కోఫిఅన్నన్‌ (రెండుసార్లు) 1997-2006 ఘనా (ఆప్రికా)
బాన్‌కిమూన్‌ (రెండుసార్లు) 2007-16 దక్షిణ కొరియా(ఆసియా)
ఆంటోనియో గుటెరస్‌ (రెండుసార్లు) 2017 నుండి ఇప్పటివరకు పోర్చుగల్‌ (ఐరోపా)
ఆంటోనియో గుటెరస్‌ రెండోవిడత పదవీకాలం 01-01-2022 నుండి ప్రారంభం అయింది.
-

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు 

1) ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్‌) (United Nations International Children's Emergency Fund) :

  • దీనిని 1946 సంవత్సరంలో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
  • దీనిలో 191 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 
  • ఇది 2వ ప్రపంచ యుధ్దానంతరం చిన్నపిల్లల అవసరాల కోసం ఏర్పాటు చేయబడినది. యునిసెఫ తన సేవలకు గాను 1965 లో నోబెల్‌శాంతి బహుమతి పొందింది. 
  • తన కార్యక్రమాలు మరియు కార్యక్రమాలకు మద్దతుగా ప్రభుత్వాలు, వ్యక్తులు, ఫౌండేషన్‌లు, కార్పొరేషన్లు మరియు ఇతర సంస్థల నుండి నిధులను సేకరించి పిల్లల అవసరాలకు వినియోగిస్తుంది. 


Also Read :


2) ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) (United Nations Educational, Scientific and Cultural Organization) :

  • దీనిని 1946 నవంబర్‌ 4వ తేదిన స్థాపించారు. 
  • దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కలదు. 
  • దీనిలో 195 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 11 దేశాలు అసోసియేట్‌ సభులుగా ఉన్నాయి. 
  • ఇది విద్య, విజ్ఞానం మరియు సంస్కృతి ద్వారా దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచంలో శాంతి మరియు భద్రత చేకూర్చేందుకు పనిచేస్తుంది. 
  • యునెస్కో యొక్క లక్ష్యం శాంతిని నిర్మించడం, పేదరికాన్ని నిర్మూలించడం మరియు విద్య, శాస్త్రాలు, సంస్కృతి, కమ్యూనికేషన్‌ మరియు సమాచారం ద్వారా స్థిరమైన అభివృద్ధిని నడపడం. సంస్థ విద్య, సహజ శాస్త్రాలు, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి మరియు కమ్యూనికేషన్‌ మరియు సమాచారంతో సహా అనేక కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది.

3) ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) అభివృద్ది కార్యాక్రమం United Nations Development Programme (UNDP)

  • దీనిని 1965 సంవత్సరంలో స్థాపించారు. 
  • దీనిలో 177 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 
  • దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో కలదు. 
  • ఇది వైజ్ఞానిక, పూర్వ పెట్టుబడుల సహకరానికి సంబందించిన అతిపెద్ద బహుళ సంస్థ. ఐక్యరాజ్యసమితి వైజ్ఞానిక సహయ కార్యక్రమాలకు కావాల్సిన నిధులను సమకూరుస్తుంది. 

4) ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషన్‌ United Nations High Commissioner for Refugees (UNHCR) :

  • దీనిని 1950 సంవత్సరంలో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్‌) లో కలదు. 
  • ఇది శరణార్థులకు రక్షణ కల్పించడం, అత్యవసర సహాయాన్ని అందించడం, శరణార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనుట వంటి లక్ష్యాలు గల ఈ సంస్థ 1955, 1981 లలో నోబెల్‌ శాంతిబహుమతి పొందింది.

5) ఐక్యరాజ్యసమితి జనాభా కార్యాకలాపాల  నిధి United Nations Fund for Population Activities(UNFPA) :

  • దీనిని 1969 సంవత్సరంలో ప్రారంభించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో కలదు. 
  • ఇది జనాభా కార్యకలాపాల రక్షణ నిధిగా వ్యవహరిస్తుంది. 

6) యునైటేడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ United Nations Conference on Trade and Development (UNCTAD):

  • దీనిని 1964 సంవత్సరంలో ప్రారంభించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం జేనివా (స్విట్జర్లాండ్‌)లో కలదు. 
  • ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అభివృద్ది చెందని దేశాలలో త్వరితగతిన ఆర్థికాభివృద్దికి కృషి చేయడం వంటివి ఈ సంస్థ యొక్క లక్ష్యం 

7) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యాక్రమం -United Nations Environment Programme (UNEP) :

  • దీనిని 1972 సంవత్సరంలో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం నైరోబి (కెన్యా) లో కలదు. 
  • ఇది మానవ పర్యావరణానికి సంబందించిన అన్ని విషయాలలో అంతర్జాతీయ సహకారం, పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు ఆలోచించేలా చేస్తుంది. 

8) ప్రపంచ ఆరోగ్య సంస్థ World Health Organization (WHO) :

  • దీనిని 1948 సంవత్సరంలో ప్రారంభించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్‌) లో కలదు. 
  • ఇది ప్రపంచంలోని ప్రజలందరికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసం పనిచేస్తుంది. 

9) ప్రపంచ వాణిజ్య సంస్థ -World Trade Organization (WTO) :

  • దీనిని 1995 సంవత్సరంలో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్‌) లో కలదు. 
  • ఇందులో 164 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. (164వ దేశం ఆప్ఘానిస్తాన్‌) 
  • ఇది ప్రపంచ దేశాల మద్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించుటకు 1948 లో గాట్‌ (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారిఫ్‌ అండ్‌ ట్రేడ్‌) ఏర్పడినది. 1994 ఏప్రిల్‌లో మొరాకోలో జరిగిన మారకేష్‌ ఒప్పందం ప్రకారం గాట్‌ స్థానంలో 1995 జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చింది.  

10) ప్రపంచ వాతావరణ సంస్థ World Meteorological Organization (WMO) :

  • దీనిని 1950 లో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్‌) లో కలదు. 
  • ఇది వాతావరణ కార్యాకాలాపాలను సమన్వయ పరిచి వాటి స్థాయిన పెంచడానికి అవసరమైన సహాయం చేస్తుంది. 

11) ఆహార, వ్యవసాయ సంస్థ - Food and Agriculture Organization of the United Nations (FAO) :

  • దీనిని 1945 అక్టోబర్‌ 16 ప్రారంభించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం రోమ్‌ లో కలదు. 
  • ఇందులో 194 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 
  • ఇది పౌష్టికాహార జీవన ప్రమాణాలు స్థాయిలను పెంచడం, అన్ని ఆహార వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచడం, గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం పనిచేస్తుంది. 

12) ప్రపంచ ఆహార పథకం (World Food Programme) : 

  • దీనిని 1963 సంవత్సరంలో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం రోమ్‌ లో కలదు. 
  • ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి తోడ్పడుతుంది. 

13) అంతర్జాతీయ కార్మిక సంస్థ - International Labour Organization (ILO) : 

  • దీనిని 1919 లో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్‌) లో కలదు.
  • నానాజతి సమితికి అనుబంధంగా ఒక స్వంతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా 1919లో స్థాపించారు.తర్వాత 1946 లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రాతినిద్య సంస్థగా ఏర్పడినది. 

14) అంతర్జాతీయ అణుశక్తి సంస్థ - IAEA :

  • దీనిని 1957 లో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా) లో కలదు. 
  • ఇది అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించేటట్లు చేయడం దీని లక్ష్యం. అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడంలో చేసిన కృషికి అప్పటి అధ్యక్షుడు మహ్మద్‌ అల్‌బరాదికి 2005 లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. 

15) అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ది నిధి -  International Fund for Agricultural Development (IFAD)

  • దీని ప్రధాన కార్యాలయం రోమ్‌(ఇటలీ) లో కలదు. 
  • ఇది అభివృద్ది చెందుతున్న దేశాలలో ఆహార ఉత్పత్తి, నిల్వలు, పంపిణిని పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాజేక్టులకు పెట్టుబడులను అందిస్తుంది. 
  • 1977 లో దీని కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి.  

16) ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం :

  • దీనిని 1972 లో స్థాపించారు. 
  • దీని ప్రధాన కార్యాలయం టోక్యో (జపాన్‌) లో ఉంది. 
  • ఇది అభివృద్ది సంక్షేమం, మానవ మనుగడం విషయాలలో పరిశోధనతో పాటు శిక్షణ ఇస్తుంది. 

17) ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్య నిరోధక కార్యాక్రమం -United Nations Office on Drugs and Crime (UNODC) : 

  • దీని ప్రధాన కార్యాలయం వియన్నాలో కలదు. 
  • ఇది మాదక ద్రవ్య వినియోగించడాన్ని నిరోధించేందుకు తగు చర్యలు తీసుకుంటుంది. 

18) బ్రెట్టాన్‌ ఉడ్స్‌ కవలలు (Bretton Woods) : 

1944 జూలై 22న అమెరికాలోని బ్రెట్టాన్‌ ఉడ్స్‌ నగరంలో UN Monnnetary and Financial Conference   సమావేశం జరిగింది. ఈ సమావేశంలో IMF and IBRD లు ఏర్పర్చే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ 2 సంస్థలను బ్రెట్టాన్‌ ఉడ్స్‌ కవలలు అంటారు. 

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌)

  • దీనిని 1944 జూలై 22న స్థాపించగా 1945 డిసెంబర్‌ 27 నుండి అమల్లోకి వచ్చింది. దీని అధికారిక  కార్యాకలాపాలు 1947 మార్చి 1 నుండి ప్రారంభమయ్యాయి. 
  • దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డిసిలో కలదు
  • అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక స్థిరత్వం మరియు అంతర్జాతీయ వాణిజ్యం విస్తరణకు ఆర్థిక సహాయం చేయం దీని ప్రధాన ధ్యేయం 

ప్రపంచ బ్యాంక్‌ 

  • దీని పురతాన పేరు ఐబిఆర్‌డి (ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)
  • దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డిసిలో కలదు. 
  • దీనిని 1944 లో స్థాపించారు. 
  • 1945 నుండి అమల్లోకి వచ్చింది. 
  • 1947 నుండి కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి. 

జి20 సమావేశాలు - 2023 (ఇండియా)


Also Read :

Post a Comment

0 Comments