
అంతర్జాతీయ సంస్థలు క్విజ్ టెస్ట్
పోటీపరీక్షల ప్రత్యేకం
international organization gk questions in telugu
1) క్రింది వానిలో జి-20 కూటమిలో లేని దేశం ఏది ?
ఎ) ఆస్ట్రేలియా
బి) ఇండియా
సి) ఇండోనేషియా
డి) మలేషియా
జవాబు ః డి (మలేషియా)
2) 2023 సంవత్సరం 18వ జి`20 సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
ఎ) జర్మని
బి) ఇండియా
సి) అమెరికా
డి) మెక్సికో
జవాబు ః బి (ఇండియా)
ఇండియా రాజధాని న్యూఢల్లీిలో జరగనున్నాయి.
3) 19వ జి20 సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి?
ఎ) బ్రెజిల్
బి) అర్జెంటినా
సి) ఇటలీ
డి) జపాన్
జవాబు ః ఎ (బ్రెజిల్)
4) ఏసియాన్ (అసోసియేషన్‌ఆఫ్ ఈస్ట్ ఏషియాన్ నేషన్స్) ను లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ?
ఎ) 10
బి) 15
సి) 9
డి) 18
జవాబు ః ఎ (10)
ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
5) ఏసియాన్ కూటమిలో భారత్ ఎప్పుడు చర్చాభాగస్వామిగా చేరింది ?
ఎ) 1993
బి) 1992
సి) 1995
డి) 1999
జవాబు ః బి (1992)
భారత్ 1996 నాటికి పూర్తి స్థాయి చర్చా భాగస్వామిగా అయింది.
6) మొట్టమొదటి ఆసియాన్ - భారత్ శిఖరాగ్ర సదస్సు 2002 సంవత్సరంలో ఎక్కడ జరిగినది ?
ఎ) ఇండోనేషియా
బి) మలేషియా
సి) లావోస్
డి) కంబోడియా
జవాబు ః డి (కంబోడియా)
7) 2022 నాటికి ఆసియాన్-భారత్ భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు పూర్తి అయినందు వల్ల 2022 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా జరుపుకుందామని భారత ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు ?
ఎ) ఆర్థిక ఏకీకరణ సంవత్సరం
బి) పర్యావరణ సంవత్సరం
సి) స్నేహ సంవత్సరం
డి) సమాఖ్య సంవత్సరం
జవాబు ః సి (స్నేహ సంవత్సరం)
8) నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (NATO) ను ఎప్పుడు స్థాపించారు ?
ఎ) 1947 జనవరి 10
బి) 1965 ఏప్రిల్ 6
సి) 1949 ఏప్రిల్ 4
డి) 1950 జూన్ 15
జవాబు ః సి (1949 ఏప్రిల్ 4)
నాటో ఉత్తర అమెరికా మరియు ఐరోపాలోని రాజకీయ మరియు సైనిక కూటమి
9) నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (నాటో) లో ఎన్ని సభ్యదేశాలున్నాయి ?
ఎ) 30
బి) 25
సి) 35
డి) 40
జవాబు ః ఎ (30)
10) నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (నాటో) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) లండన్ (ఇంగ్లాడ్)
బి) బ్రసెల్స్ (బెల్జియం)
సి) న్యూయార్క్ (అమెరికా)
డి) ప్యారిస్ (ప్రాన్స్)
జవాబు ః బి (బ్రసెల్స్ (బెల్జియం))
11) ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రోమ్ (ఇటలీ)
బి) బీజింగ్ (చైనా)
సి) లయోన్స్ (ప్రాన్స్)
డి) లండన్ (ఇంగ్లాండ్)
జవాబు ః సి (లయోన్స్ (ప్రాన్స్))
12) ఇంటర్‌పోల్‌లో ఎన్ని సభ్యదేశాలున్నాయి ?
ఎ) 194
బి) 186
సి) 165
డి) 175
జవాబు ః ఎ (194)
13) ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ ను 1961 లో ఎవరు స్థాపించారు ?
ఎ) పీటర్ బెన్సన్
బి) హెన్రీ డ్యూనాంట్
సి) క్వామిక్వైయా
డి) థాబో ఎంబేకీ
జవాబు ః ఎ (పీటర్ బెన్సన్ )
14) ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) జెనీవా (స్విట్జర్లాండ్)
బి) రోమ్ (ఇటలీ)
సి) వాషింగ్టన్ (అమెరికా)
డి) లండన్ (ఇంగ్లాండ్)
జవాబు ః డి (లండన్ (ఇంగ్లాండ్))
15) ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ మానవహక్కుల పరిరక్షణకు గాను ఈ సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ శాంతిబహుమతి లభించింది ?
ఎ) 1987
బి) 1986
సి) 1977
డి) 1979
జవాబు ః సి (1977)
16) అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) బెర్లిన్ (జర్మనీ)
బి) న్యూఢిల్లీ (ఇండియా)
సి) జకార్తా (ఇండోనేషియా)
డి) ది హేగ్ (నెదర్లాండ్)
జవాబు ః డి) ది హేగ్ (నెదర్లాండ్)
దీనిని 2002 సంవత్సరంలో అంతర్జాతీయ నేరాలకు పాల్పడే వ్యక్తలను విచారించడానికి నెలకొల్పినారు.
17) ఓపెక్ (ఆర్టనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రిస్) సభ్యత్వం లేని దేశం ఏది ?
ఎ) అల్జీరియా
బి) ఈక్వేడార్
సి) సౌదీ అరేబియా
డి) గాబోస్
జవాబు ః బి ( ఈక్వేడార్ )
ఓపెక్‌ను 1960 సంవత్సరంలో స్థాపించారు.
18) ఓపెక్ (ఆర్టనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రిస్) ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ?
ఎ) 15
బి) 20
సి) 9
డి) 13
జవాబు ః డి (13)
ఓపెక్‌లో అల్జీరియా, అంగోలా, కాంగో, గినియా, గాబోస్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరెబియా, యుఏఈ, వెనిజులాలున్నాయి.
19) ఓపెక్ (ఆర్టనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రిస్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) ఆస్ట్రియా
బి) సౌదిఅరేబియా
సి) గాబోస్
డి) వెనిజులా
జవాబు ః ఎ (ఆస్ట్రియా)
20) అపెక్ (ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య) లో సభ్యదేశం కానిది ఏది ?
ఎ) చిలీ
బి) చైనా
సి) ఇండియా
డి) ఇండోనేషియా
జవాబు ః సి (ఇండియా)
21) అపెక్ (ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) సింగపూర్
బి) చైనా
సి) జపాన్
డి) దక్షిణ కొరియా
జవాబు ః ఎ (సింగపూర్)
అపెక్‌ను 1989లో స్థాపించారు. దీనిలో మొత్తం 21 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
22) ఏడిబి (ఏషియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ?
ఎ) అటోనియో గుటెరస్
బి) ఇమ్మాన్యూయల్ మక్రన్
సి) మసత్సుగు అసకవా
డి) బాన్‌కిమూన్
జవాబు ః సి (మసత్సుగు అసకవా)
ఏడిబిని 1966లో స్థాపించారు.
23) ఏడిబి (ఏషియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) జకార్తా (ఇండోనేషియా)
బి) బీజింగ్ (చైనా)
సి) మనీలా (ఫిలిప్పైన్స్)
డి) టోక్యో (జపాన్)
జవాబు ః సి (మనీలా (ఫిలిప్పైన్స్)
ఏడిలో మొత్తం 68 సభ్యదేశాలు ఉన్నాయి.
24) ఏడిబి (ఏషియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్)ను ఏ దేశ సారథ్యంలో 1966 స్థాపించారు?
ఎ) ఇండియా
బి) మలేషియా
సి) చైనా
డి) జపాన్
జవాబు ః డి (జపాన్)
25) అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూఢిల్లీ (ఇండియా)
బి) లుసానే (స్విట్జర్లాండ్)
సి) వియన్నా (ఆస్ట్రియా)
డి) రోమ్ (ఇటలీ)
జవాబు ః బి (లుసానే (స్విట్జర్లాండ్))
26) ఒలంపిక్ జరిగే ప్రదేశాలను బట్టి కిందివానిలో జతకానిది ఏది ?
ఎ) ఖతర్ - 2021
బి) ప్రాన్స్ - 2024
సి) అమెరికా - 2028
డి) ఆస్ట్రేలియా - 2032
జవాబు ః ఎ ( ఖతర్ - 2021)
27) ఇంటర్‌గవర్నెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్‌కి ఏ సంవత్సరంలో శాంతిబహుమతి వచ్చింది ?
ఎ) 2004
బి) 2005
సి) 2009
డి) 2007
జవాబు ః డి (2007)
28) ఇంటర్‌గవర్నెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్‌కి ఏయే సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి ?
ఎ) UNDP, UNHCR
బి) UNESCO, UNFPA
సి) UNCTAD, ILO
డి) UNEP, WMO
జవాబు ః డి (UNEP, WMO)
29) ఇంటర్‌గవర్నెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) వియన్నా
బి) రోమ్
సి) జేనీవా
డి) లండన్
జవాబు ః సి (జేనీవా)
30) BIMSTEC ఇంధన వనరుల కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూఢిల్లీ
బి) బెంగళూరు
సి) ముంబాయి
డి) లక్నో
జవాబు ః బి (బెంగళూరు)
31) BIMSTEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూఢల్లీి (ఇండియా)
బి) భూటాన్ (నేపాల్)
సి) బ్యాంకాక్ (థాయిలాండ్)
డి) డాకా (బంగ్లాదేశ్)
జవాబు ః డి (డాకా (బంగ్లాదేశ్))
దీనిని 1997 లో ఏర్పాటు చేశారు.
32) BRICS సభ్యదేశాలను బట్టి కిందివానిలో సరైనది ఏది ?
ఎ) బ్రెజిల్ - రష్యా - ఇండియా - చైనా
బి) రష్యా-ఇండియా- ఇండోనేషియా - చైనా
సి) ఇండియా - రష్యా - బ్రెజిల్ - భూటాన్
డి) రష్యా - చైనా - మలేషియా - బ్రెజిల్
జవాబు ః ఎ (బ్రెజిల్ - రష్యా - ఇండియా - చైనా )
బ్రిక్స్ అనే పదాన్ని 2001 లో అమెరికాకు చెందిన ఇన్వేస్ ్టమెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన గోల్డ్‌మన్‌శాక్స్ కు చెందిన జిమ్ ఓ నీల్ ఉపయోగించారు.
33) BRICS 2023 సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి ?
ఎ) రష్యా
బి) ఇండియా
సి) దక్షిణాఫ్రికా
డి) చైనా
జవాబు ః సి (దక్షిణాఫ్రికా)
34) BRICS 2022 సమావేశాలు ఎక్కడ జరిగాయి. ?
ఎ) రష్యా
బి) ఇండియా
సి) దక్షిణాఫ్రికా
డి) చైనా
జవాబు ః డి (చైనా)
35) SAARC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) నేపాల్ (ఖట్మాండ్)
బి) ఇండియా (New Delhi)
సి) బంగ్లాదేవ్ (డాకా)
డి) శ్రీలంక (కొలంబో)
జవాబు ః ఎ (నేపాల్ (ఖట్మాండ్))
36) SAARC ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ?
ఎ) 10
బి) 8
సి) 12
డి) 15
జవాబు ః బి (8)
ఇండియా, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, నేపాల్
37) యూరోపియన్ యూనియన్‌లో ఎన్ని సభ్యదేశాలున్నాయి ?
ఎ) 27
బి) 30
సి) 35
డి) 20
జవాబు ః ఎ (27)
38) యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) వియన్నా
బి) రోమ్
సి) బెర్లిన్
డి) బ్రస్సెల్స్
జవాబు ః డి (బ్రస్సెల్స్)
39) యూరోపియన్ యూనియన్ న్యాయస్థానం, ఆడిటర్ల కోర్టు ఎక్కడ ఉంది ?
ఎ) రోమ్
బి) లగ్జెంబర్గ్
సి) దిహెగ్
డి) వియన్నా
జవాబు ః బి (లగ్జెంబర్గ్)
40) యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ ఏది ?
ఎ) యువాన్
బి) డాలర్
సి) యూరో
డి) పౌండ్
జవాబు ః సి (యూరో)
41) యూరోపియన్ యూనియన్ యూరో కరెన్సీ కల్గిన దేశాలు ఎన్ని ?
ఎ) 18
బి) 19
సి) 21
డి) 12
జవాబు ః బి (19)
42) క్రింది వానిలో జేనీవా (స్విట్జర్లాండ్) ప్రధాన కార్యాలయంగా లేని అంతర్జాతీయ సంస్థ ఏది ?
ఎ) వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్
బి) వరల్డ్ ట్రేడ్ ఆర్గనేజేషన్
సి) అంతర్జాతీయ కార్మిక సంస్థ
డి) అంతర్జాతీయ న్యాయస్థానం
జవాబు ః డి (అంతర్జాతీయ న్యాయస్థానం)
అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం దిహేగ్ (నెదర్లాండ్) లో కలదు.
43) క్రింది వానిలో భారత్ సభ్యదేశంగా లేనిది ?
ఎ) ASEAN
బి) BRICS
సి) ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (APEC)
డి) కామన్వేల్త్ ఆఫ్ నేషన్స్
జవాబు ః సి (ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్))
44) క్రింది వానిలో యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం లేని దేశం ఏది ?
ఎ) ఇంగ్లాండ్
బి) స్లోవేకియా
సి) జర్మనీ
డి) పోర్చుగల్
జవాబు ః ఎ (ఇంగ్లాండ్)
45) క్రింది వానిలో జి4 కూటమికి సంబందించిన సరైన క్రమం ఏది ?
ఎ) జర్మనీ - జపాన్ - భారత్ - చైనా
బి) భారత్ - జపాన్ - రష్యా - జర్మనీ
సి) జర్మనీ - ప్రాన్స్ - భారత్- జపాన్
డి) జర్మనీ - జపాన్ - భారత్ - బ్రెజిల్
జవాబు ః డి (జర్మనీ, జపాన్, భారత్, బ్రెజిల్)
జి4 కూటమిని భద్రతమండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలని ఏర్పాటు చేశారు.
46) జి15 కూటమిని ఏయే దేశాలు ఏర్పాటు చేశాయి ?
ఎ) అభివృద్ది చెందిన దేశాలు
బి) అభివృద్ది చెందుతున్న దేశాలు
సి) వెనుబడిన దేశాలు
డి) కామల్వేల్త్ దేశాలు
జవాబు ః బి (అభివృద్ది చెందుతున్న దేశాలు)
47) ఆలీనోద్యమ కూటమి ఏర్పాటు కొరకు కృషి చేసిన భారత ప్రధానమంత్రి ఎవరు ?
ఎ) జవహర్ లాల్‌నెహ్రూ
బి) గుర్జారిలాల్ నంద
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) ఇందిరాగాంధీ
జవాబు ః ఎ ( జవహర్ లాల్‌నెహ్రూ)
48) జి8 (ప్రస్తుతం జి7 గా మారింది) కూటమి యొక్క 2022 సమావేశాలు జర్మనీలో జరగగా 2023 సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) జపాన్
డి) ప్రాన్స్
జవాబు ః సి (జపాన్)
49) కింది దానిలో సంస్థ - దాని ప్రధాన కార్యాలయాలతో జతచేయండి
ఎ) నానాజాతి సమితి
బి) యూరోపియన్ యూనియన్
సి) ఆఫ్రికన్ యూనియన్
డి) కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్
1) లండన్
2) బ్రస్సెల్స్
3) జేనీవా
4) అడ్డిస్ అబాబా
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-1, బి-4, సి-2 డి-3
సి) ఎ-3, బి-2, సి-4, డి-1
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
సి (ఎ-3, బి-2, సి-4, డి-1)
50) భారత్ - ఆఫ్రికా ఫోరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమావేశమవుతాయి ?
ఎ) 5
బి) 2
సి) 1
డి) 3
జవాబు ః డి (3)
0 Comments