
కేంద్ర ఆర్థిక (ఎకనామిక్) సర్వే - 2023
India Economic Survey -2023 highlights in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
భారత ఆర్థిక సర్వే 2023 జనవరి 31 తేదిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితులు రాబోయే కాలంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేది ఆర్థిక(ఎకనామిక) సర్వే. ఇది కేంద్ర బడ్జెట్ రూపొందించడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దేశంలోని జాతీయాదాయం, తలసరిఆదాయం, ఎగుమతులు, దిగుమతులు, విదేశీమారకపు నిల్వలు, వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం గురించి విశ్లేషిస్తుంది.
ఈ ఆర్థిక సర్వేను కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందుగా దీనికి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. భారతదేశంలో మొదటి ఆర్థిక సర్వేను 1950-51 లో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వే (ఎకనామిక్) సర్వేను 1964 వరకు బడ్జెట్‌లో భాగంగానే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 1964 నుండి ఎకనామిక్ సర్వే ను వేరు చేసి ప్రత్యేకంగా బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందుగా ప్రవేశపెడుతున్నారు. దీనిని కేంద్ర ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలోని ప్రత్యేక బృందం తయారు చేస్తుంది.
➠ కేంద్ర ఆర్థిక సర్వే - 2023 ముఖ్యాంశాలు :
జిడిపి వృద్ది రేటు స్థిరధరల ప్రకారం(2011-2012 బేస్ ఇయర్ ప్రకారం) 2022-23 సంవత్సరంలో 7% శాతంగా ఉంది. 2023-24 సంవత్సరంలో 6.0% నుండి 6.8% గా అంచనా వేయడం జరిగింది.
వ్యవసాయరంగం :
వ్యవసాయరంగం స్థిరధరల ప్రకారం 2021-22లో 3.0 శాతం గా ఉంది. ఇది 2022-23 ఇది 3.5%కు పెరిగింది. గత సంవత్సరంలో పోలీస్తే 0.5 శాతం వృద్ది నమోదు చేసింది.
పారిశ్రామిక రంగం :
పారిశ్రామిక రంగం స్థిరధరల ప్రకారం 2021-22లో 10.3 శాతం గా ఉంది. ఇది 2022-23 ఇది 4.1%కు పెరిగింది. గత సంవత్సరంలో పోలీస్తే 6.2 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
సేవారంగం :
సేవారంగం స్థిరధరల ప్రకారం 2021-22లో 5.4 శాతం గా ఉంది. ఇది 2022-23 ఇది 9.1%కు పెరిగింది. గత సంవత్సరంలో పోలీస్తే 0.7 శాతం వృద్ది నమోదు చేసింది.
విదేశీమారక నిల్వలు :
2021-22 లో విదేశీమారక నిల్వలు 607 యుఎస్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అవి 2022-23 నాటికి 562.85 యుఎస్ బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ద్రవ్యోల్భణం :
ద్రవ్యోల్భణం లెక్కించడానికి రెండు రకాల పద్దతులు ఉన్నాయి.
- హోల్‌సేల్ ధరల ఇండిక్స్ (డబ్యూపిఐ) -టోకు ధరల సూచి
టోకు వర్తకుడు చెల్లించే ధరలలో వచ్చే మార్పును ఇది సూచిస్తుంది.
- కన్‌స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగదారుల ధరల సూచి)
వినియోగదారులు చెల్లించే ధరలలో వచ్చే మార్పును ఇది సూచిస్తుంది.
టోకు ధరల సూచి(wholesale Price Index) ప్రకారం
ద్రవోల్భణం 2021-22 లో 13.0 % గా ఉంది.
ఇది 2022-23 లో 11.5% కు చేరుకుంది.
వినియోగదారుల ధరల సూచి (Consumer Price Index) ప్రకారం
ద్రవోల్భణం 2021-22 లో 5.5 % గా ఉంది.
ఇది 2022-23 లో 6.8% కు చేరుకుంది.
దీనిని ద్రవ్యోల్భణం కొలవడానికి ఉత్తమైన కొలమానంగా చెప్పవచ్చు.
కోశ/ద్రవ్య/విత్త లోటు (ఫిస్కల్ డిఫిసిట్) :
ఒక ప్రభుత్వ యొక్క అప్పులను తెలియజేసేది ద్రవ్యలోటు. దీనికి జిడిపిలో శాతంగా లెక్కించడం జరుగుతుంది.
ద్రవ్యలోటు 2021-22 లో 6.7% గా ఉంది.
ద్రవ్యలోటు 2022-23 లో ఇది 6.4% కు చేరుకుంది.
తలసరి ఆదాయం :
ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల విలువను పౌరులందరికి సమానంగా విభజించినట్లయితే ప్రతి వ్యక్తికి అందుబాటు ఉండే మొత్తాన్ని తలసరి ఆదాయం అంటారు.
భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 2020-21 లో 1,50,007 గా ఉంది.
ఇది 2021-2022 లో 1,70,620. ఇది గత సంవత్సంతో పోలీస్తే 20,613 పెరిగింది.
అధిక తలసరి ఆదాయం గల రాష్ట్రాలు
1) గోవా
2) సిక్కిం
3) ఢిల్లీ
4) ఛంఢీఘర్
అత్యల్ప తలసరి ఆదాయం గల రాష్ట్రాలు
1) బీహార్
2) ఉత్తరప్రదేశ్
3) మణిపూర్
4) అస్సాం
- ఆహార ధాన్యల ఉత్పత్తులు 2021-22 సంవత్సరంలో 315.7 మిలియన్‌టన్నులుగా ఉన్నాయి.
- పాల ఉత్పత్తులు 2021-22 లో 221.06 టన్నులుగా ఉన్నాయి.
రెమిటెన్సిస్ :
విదేశాల్లోని భారతీయులు ఇండియాకు పంపే నిధులను రెమిటెన్సిస్ అంటారు. ఇది భారతదేశంలో 100 యుఎస్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అత్యధిక రెమిటెన్స్‌లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్, ఈజిప్టు లు ఉన్నాయి.
ఒకదేశం యొక్క కరెన్సీ కొనుగోలు శక్తిని తెలియజేసే దాన్ని పర్చేసింగ్ పవర్ పారిటి అంటారు. కొనుగోలు శక్తి సామర్థ్యం అత్యధిక గల దేశాలు 1) చైనా 2) యుఎస్‌ఏ 3) ఇండియా 4) జపాన్ 5) జర్మనీలున్నాయి.
➠ కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే - 2023 ప్రధానాంశాలు :
1) దేశంలో 6 కోట్లు ఎంఎస్‌ఎంఈలలో 12 కోట్ల మంది పనిచేస్తున్నారు.
2) ఎలక్ట్రానిక్ ఎగుమతుల్లో 55% వృద్ది నమోదు అయింది.
3) పెట్టుబడి ఉపసంహరణ ద్వారా గడిచిన 9 సంవత్సరాలలో 4.07 లక్షల కోట్లు నిధులు సమీకరించడం జరిగింది.
4) అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత అవతరించింది.
5) 220 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
6) 2005-06 మరియు 2019-20 మద్య భారతదేశంలో 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికంలో నుండి బయటపడ్డారని 2022 బహుమితియ పేదరిక సూచీపై యూఎస్‌డిపి సర్వే తెలియజేయడం జరిగింది.
7) 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.
8) నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2047 నాటికి భారతదేశాన్ని ఇంధన స్వతంత్రంగా మార్చాలి అనే లక్ష్యం పెట్టుకుంది.
9) 2020-21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి 9.3% వృద్ది చెందింది.
10) జాతీయ ఆహార భద్రత చట్టం కింద సుమారు 81.4 కోట్ల మంది లబ్దిదారులకు ఒక సంవత్సరం పాటు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి.
11) ఏప్రిల్ - జూలై 2022-23 నాటికి సుమారు 11.3 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ ద్వారా లబ్ది పొందడం జరిగింది.
12) 2022 ఏప్రిల్-డిసెంబర్ నాటికి 332.8 యుఎస్ బిలియన్ డాలర్ల సరుకుల ఎగుమతులు జరిగాయి.
0 Comments