కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ || The Cadence Scholarship Program 2023-24 in Telugu

Cadence Scholarship Program

The Cadence Scholarship Program 2023-24
 కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

నిరుపేద కుటుంబానికి చెందిన పేదవిద్యార్థులు తమ యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు కొనసాగించలేని విద్యార్థులకు కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కాడెన్స్‌ డిజైన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు కన్సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ మద్దతుతో విద్యార్థులు తమ యొక్క ఉన్నత విద్యను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. 

ఈ కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌, బెంగుళూరు, పూణె మరియు అహ్మదాబాద్‌ ప్రాంతాలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క అకడమిక్‌ సంవత్సరంలో ఫీజులు, హస్టల్‌ చార్జీలు, రవాణా చార్జీలు వంటి వాటి కోసం అయ్యే ఖర్చులను స్కాలర్‌షిప్‌ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. 

కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో చదువుతున్న నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి వారి యొక్క ఉన్నత చదువుకు కావాల్సిన ఖర్చులను తీర్చడానికి స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. ఈ కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ఢిల్లీ-ఎన్‌సిఆర్‌, బెంగుళూరు, పూణె మరియు అహ్మదాబాద్‌ ప్రాంతాలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. వారి యొక్క చదువులో కనబర్చిన ప్రతిభను ఆధారంగా ఎంపిక చేసి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. 

కాడెన్స్‌ డిజైన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు కన్సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కోసం www.buddy4study.com పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

➠ కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు కావాల్సిన అర్హతలు :

  • ఢిల్లీ ఎన్‌సిఆర్‌, బెంగళూరు, పూణే మరియు అహ్మదాబాద్‌లలో నివసిస్తున్న మరియు చదువుతున్న భారతీయ విద్యార్థులు 

➣ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు : 

  • 12వ తరగతిలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. (ప్రస్తుతం 12వ తరగతి చదివే విద్యార్థులు వారి యొక్క గత సంవత్సరంలో చూపించిన ప్రతిభ ఆధారంగా ధరఖాస్తు చేసుకోవచ్చు)

➣ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు: 

  • గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ కోర్సులను చదివే విద్యార్థులు, బాలికలు, ట్రాన్స్‌జెండర్స్‌ మరియు అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది. 

➠ స్కాలర్‌షిప్‌ అవార్డు :

  • విద్యార్థి యొక్క కోర్సు ఫీజులు, హాస్టల్‌ ఛార్జీలు, పుస్తకాలు మరియు రవాణా వంటి విద్యా ఖర్చుల కోసం  స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. 

➠ కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫోటో 
  • దరఖాస్తుదారుతో సంబంధం లేని మరియు వారి పాత్రపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు సూచనల నుండి సక్రమంగా సంతకం చేసిన సిఫార్సు లేఖలు/ క్యారెక్టర్‌ సర్టిఫికెట్లు 

➠ కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఎంపిక ప్రక్రియ :

  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చేసిన తర్వాత షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఇంటర్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 

స్కాలర్‌షిప్‌ పేరు కాడెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌
స్కాలర్‌షిప్‌ అందించేవారు కాడెన్స్‌ డిజైన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు కన్సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌
అవార్డు /బెనిఫిట్స్‌ కోర్సు ఫీజులు, హస్టల్‌ చార్జీలు, బుక్స్‌, కన్వీనియన్స్‌ చార్జీలు
కోర్సులు అండర్‌గ్రాడ్యువేట్‌ , పోస్టు గ్రాడ్యువేట్‌
దేశం ఇండియా
నగరాలు ఢిల్లీ, బెంగళూరు, పూణే, అహ్మదబాద్‌
కనీస వయస్సు లేదు
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
ఎంపిక ప్రతిభ ఆధారంగా
చివరి తేది 31 మే 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు Click Here

Post a Comment

0 Comments