Gk in Telugu || General Knowledge in Telugu

భారతదేశంలోని వివిధ పోటీపరీక్షలలో భారతదేశంలోని వివిధ రాజ్యాంగ స్థానాలకు కనీస మరియు గరిష్ట వయోపరిమితి, అలాగే ఆ స్థానాల పదవీకాలం మరియు ఇతర వివరాల గురించి తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. వీటిపై మనం పూర్తి అవగాహన ఉంటేనే సరైన సమాధానం ఎంచుకోవచ్చు. పోటీపరీక్షలను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగ స్థానాల యొక్క పదవీకాలం, అర్హత, గరిష్ఠ వయోపరిమితి, వేతనం వంటి వివరాలు సవివరంగా మీకు అందించడం జరుగుతుంది.
భారతదేశంలోని ముఖ్యమైన పదవులు వాటి పదవీకాలం, గరిష్ఠవయోపరిమితి వివరాలు | |||
---|---|---|---|
పదవులు | పదవీకాలం | గరిష్ఠ వయోపరిమితి | నెలకు వేతనం |
రాష్ట్రపతి (అర్హత వయస్సు 35 సం॥లు) | 5 సంవత్సరాలు | లేదు | 5 లక్షలు |
ఉపరాష్ట్రపతి (అర్హత వయస్సు 35 సం॥లు) | 5 సంవత్సరాలు | లేదు | 4 లక్షలు |
గవర్నర్ (అర్హత వయస్సు 35 సం॥లు) | 5 సంవత్సరాలు | రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు | 3 లక్షల 50 వేలు |
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి | - | 65 సంవత్సరాలు | 2 లక్షల 80 వేలు |
సుప్రీం కోర్టు న్యాయమూర్తి | - | 65 సంవత్సరాలు | 2 లక్షల 50 వేలు |
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | - | 62 సంవత్సరాలు | 2 లక్షల 50 వేలు |
హైకోర్టు న్యాయమూర్తి | - | 62 సంవత్సరాలు | 2 లక్షల 25 వేలు |
అటార్నీ జనరల్ | - | రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు | 2 లక్షల 50 వేలు |
కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ | 6 సంవత్సరాలు | 65 సంవత్సరాలు | 2 లక్షల 50 వేలు |
యు.పి.ఎస్.సి చైర్మన్ | 6 సంవత్సరాలు | 65 సంవత్సరాలు | 2 లక్షల 50 వేలు |
ప్రధాన ఎన్నికల కమీషనర్ | 6 సంవత్సరాలు | 65 సంవత్సరాలు | 2 లక్షల 50 వేలు |
ఇతర ఎన్నికల కమీషనర్లు | 6 సంవత్సరాలు | 65 సంవత్సరాలు | 2 లక్షల 50 వేలు |
లోన్‌సభ స్పీకర్ (అర్హత వయస్సు 25 సం॥లు) | 5 సంవత్సరాలు | లేదు | 1 లక్ష |
పార్లమెంటు సభ్యులు (అర్హత వయస్సు 25 సం॥లు) | 5 సంవత్సరాలు | లేదు | 1 లక్ష |
రాజ్యసభ సభ్యుడు (అర్హత వయస్సు 30 సం॥లు) | 6 సంవత్సరాలు | లేదు | 1 లక్ష |
రాష్ట్ర ముఖ్యమంత్రి (అర్హత వయస్సు 25 సం॥లు) | 5 సంవత్సరాలు | లేదు | - |
శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) (అర్హత వయస్సు 25 సం॥లు) | 5 సంవత్సరాలు | లేదు | - |
ఎమ్మెల్సీ (అర్హత వయస్సు 30 సం।లు) | 6 సంవత్సరాలు | లేదు | - |
0 Comments