Mahila Samman Saving Certificate Scheme - Eligibility, How to Apply, Calculation, Interest Rate, Tax Benefitsin Telugu || మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం 2023

Mahila Samman Saving Certificate Scheme in telugu

Mahila Samman Saving Certificate Scheme in telugu

Gk in Telugu || General Knowledge in Telugu

దేశంలోని మహిళలు మరియు బాలికల కోసం  కేంద్ర ప్రభుత్వం సరికొత్త పొదుపు పథకం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2023-24 లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చిన్న మొత్తాల పొదుపు పథకం కింద మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ - 2023 పేరిట నూతన పథకానికి తపాలా (పోస్టాఫిస్‌) శాఖ ద్వారా శ్రీకారం చుట్టింది. దేశంలోని మహిళలు ఆర్థికాభివృద్ది, ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టింది. 

ఈ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌  పథకం 2023, మార్చి 31 తేది నుండి ప్రారంభం అవుతుంది. ఇది కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధితో 2025, మార్చి 31న ముగుస్తుంది. ఆ లోపు అకౌంట్‌ తెరిచిన వారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. ఈ పథకంలో చేరడానికి  కేవలం మహిళలు లేదా  బాలికలు మాత్రమే అర్హులు. ఇది కేవలం సింగిల్‌ అకౌంట్‌ మాత్రమే, జాయింట్‌ అకౌంట్‌ కాదు. 

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే వన్‌-టైమ్‌ స్కీమ్‌. మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికేట్‌ అకౌంట్‌ ను మహిళలు లేదా బాలికలు రూ॥ 1000/- రూపాయల ప్రారంభ మొత్తం నుండి గరిష్టంగా రూ॥2,00,000/-(రెండు లక్షలు) వరకు డిపాజిట్‌ చేసి ఖాతా తెరవచ్చు. ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కూడా తెరవచ్చు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరవాలంటే రెండు  అకౌంట్‌ల మద్య కనీసం మూడు నెలల వ్యవధి ఉండాలి.  ఈ పథకం ద్వారా తెరిచిన ఖాతాలోని డబ్బులకు మెచ్యురిటి కాలం పూర్తి అయిన తర్వాత 7.5% కాంపౌండ్‌ వడ్డీతో కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో ని వడ్డీని ప్రతి త్రైమాసికానికి కలిపి ఖాతాలో జమచేస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుండి సంవత్సరం తర్వాత  అర్హత ఉన్న బ్యాలెన్స్‌ నుండి 40 శాతం వరకు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.  కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మద్యలోనే విరమించుకునే అవకాశం ఉంది. ఖాతాదారుడి మరణం, ప్రాణాంతక వ్యాధులు ఉన్నప్పుడు ముందస్తుగా ఖాతా విరిమించుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో స్కీం వడ్డీ, అసలు మొత్తం పై చెల్లిస్తారు. ఈ అకౌంట్‌ను మీ దగ్గరలోని పోస్టాఫిసులో ఓపేన్‌ చేయవచ్చు. ఈ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం యొక్క అర్హతలు, మెచ్యురిటి కాలం, వడ్డీ లెక్కింపు, చెల్లింపు విధానం, విరమించుకునేందుకు కారణాలు తదితర సందేహాల గురించి కింద సవివరంగా తెలియజేయడం జరిగింది 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం యొక్క అర్హతలు :

  • కేవలం మహిళలు లేదా బాలికలు మాత్రమే ఖాతా తెరవడానికి అర్హులు 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం యొక్క కాలపరిమితి :

  • ఈ పథకం యొక్క కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది. 
  • 31 మార్చి 2023 నుండి 31 మార్చి 2025 వరకు అమలులో ఉంటుంది. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం వడ్డీ శాతం :

  • 7.5 శాతం సంవత్సరానికి 
  • ఈ వడ్డీని కాంపౌండ్‌ ఇంటరస్ట్‌ పద్దతిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు.

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం డిపాజిట్‌ పరిమితి :

  • ఇందులో కనిష్టంగా రూ॥1000/- జమ చేసుకోవచ్చు 
  • గరిష్టంగా రూ॥2,00,000/- వరకు జమ చేసుకోవచ్చు 

(అయితే ఈ యొక్క రెండు లక్షల పరిమితికి లోబడి ఎన్ని ఖాతాలు అయిన తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఖాతాల మద్య వ్యవధి కనీసం మూడు నెలలు ఉండాలి. )

ఉదాహరణకు 

  1. రూ॥50,000/- లతో ఒక అకౌంట్‌ తెరిచిన తర్వాత రెండో ఖాతా రూ॥1,50,000/- లతో తెరవచ్చు. 
  2. ఒక ఖాతా  రూ॥50,000/- లతో తెరిస్తే రెండో ఖాతా రూ॥1,00,000/- లతో మిగిలిన రూ॥50,000/-లతో మూడో అకౌంట్‌ తెరవచ్చు. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం మెచ్యురిటి :

  • ఖాతా ప్రారంభించిన రోజు నుండి రెండు సంవత్సరాల వ్యవధి వరకు మెచ్యురిటి ఉంటుంది. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం రకం :

  • ఇది కేవలం సింగిల్‌ అకౌంట్‌ మాత్రమే. జాయింట్‌ అకౌంట్‌ కాదు. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం విత్‌డ్రా విధానం :

  • ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత 40 శాతం వరకు అమౌంట్‌ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం రద్దు విధానం :

  • సాధారణంగా ఎలాంటి కారణం లేకుండా 6 నెలల తర్వాత అకౌంట్‌ రద్దు చేసుకోవచ్చు.  (వడ్డీ లెక్కింపు తక్కువగా ఉంటుంది.(7.5% - 2% = 5.5% ఉంటుంది.) 
  • డిపాజిటర్‌ మరణిస్తే / ప్రాణాంతక వ్యాధులు / ఇతరములు  ఉన్నట్లయితే ఎప్పుడైన ముందుగానే  రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం వడ్డీ శాతం :

  • డిపాజిట్‌ చేసిన మొత్తానికి సంవత్సరానికి 7.5 శాతం ఫిక్స్‌డ్‌ వడ్డీ చెల్లిస్తారు. 
  • మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ ఫిక్స్‌డ్‌ లేదా టైమ్‌ డిపాజిట్‌ లాగా పనిచేస్తుంది, ఇక్కడ వడ్డీ త్రైమాసికానికి లెక్కించబడుతుంది మరియు పెట్టుబడి పెట్టిన ప్రిన్సిపల్‌తో పాటు ఉంటుంది.  ఉదాహరణకు, రూ. 2 లక్షల పెట్టుబడిపై, మొదటి త్రైమాసికానికి వడ్డీ రూ. 3,750 అవుతుంది. రెండవ త్రైమాసికానికి, ఇది త్రైమాసికానికి సమ్మేళనం చేయబడినందున ఇది రూ. 2,03,750 (రూ. 2 లక్షలు + రూ. 3,750)గా లెక్కించబడుతుంది. దీని ప్రకారం, ముగింపులో మెచ్యూరిటీ విలువ రూ. 2.32 లక్షలు చెల్లించడం జరుగుతుంది. 

➠ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకం అకౌంట్‌ ఎక్కడ ఓపేన్‌ చేయాలి :

పోస్టాఫీసులో 

పథకం పేరు మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికేట్‌
ఎవరు అర్హులు మహిళలు లేదా బాలికలు
పథకం రకం సేవింగ్‌ అకౌంట్‌ పొదుపు పథకం
మినిమమ్‌ డిపాజిట్‌ రూ॥1000/-
మ్యాక్సిమమ్‌ డిపాజిట్‌ రూ॥2,00,000/-
కాలపరిమితి 2 సంవత్సరాలు
వడ్డీ శాతం 7.5% (సంవత్సరానికి)
పాక్షిక విత్‌డ్రా 40% వరకు
ప్రారంభ తేది 31 మార్చి 2023
ముగింపు తేది 31 మార్చి 2025
అకౌంట్‌ ఓపేన్‌ పోస్టాఫీస్‌


How is interest calculated in Mahila Samman Savings Certificate (MSSC)
Quarter Opening Balance Interest earned Closing Balance
2,00,000 - 2,00,000
At the end of first quarter 2,00,000 3,750 2,03,750
At the end of second quarter 2,03,750 3,820 2,07,570
At the end of third quarter 2,07,570 3,892 2,11,462
At the end of fourth quarter 2,11,462 3,965 2,15,427
At the end of fifth quarter 2,15,427 4,039 2,19,466
At the end of sixth quarter 2,19,466 4,115 2,23,581
At the end of seventh quarter 2,23,581 4,192 2,27,774
At the end of two years 2,27,774 4,271 2,32,044
Rate of interest assumed at 7.5% per annum compounded quarterly

Post a Comment

0 Comments