Buddy4Study - IDFC FIRST Bank Education Loan Programme in Telugu

Buddy4Study - IDFC FIRST Bank Education Loan Programme

Buddy4Study - IDFC FIRST Bank ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ 

నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థలలో చదువుకోవాలంటే వారికి తలకు మించిన భారం అవుతుంది. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు భారతదేశం లేదా విదేశాలలో ఉన్న కాలేజిలలో చదువు కొనసాగించలేకపోతారు. ఇలాంటి వారి కోసం Buddy4Study మరియు IDFC FIRST Bank సంయుక్తంగా ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఋణసదుపాయం అందిస్తున్నారు. దీనిద్వారా భారతదేశంలో లేదా విదేశాలలో ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తమ యొక్క చదువును నిరాటంకంగా కొనసాగించడానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. 

Buddy4Study మరియు IDFC FIRST Bank సంయుక్తంగా చేపట్టిన ఎడ్యుకేషనల్‌ లోన్‌ ద్వారా విద్యార్థుల చదువుల కొరకు 40 లక్షల వరకు ఋణ సదుపాయం కల్పిస్తుంది. ఈ ఋణాన్ని విద్యార్థులు తమ విద్యాసంవత్సరంలో ఎదురయయ్యే ట్యూషన్‌ ఫీజు, ఎగ్జామ్‌ ఫీజు, లైబ్రరీ ఫీజు, లాబోరేటరీ ఫీజు, యూనిఫామ్స్‌, బుక్స్‌, హస్టల్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులు, ల్యాప్‌టాప్‌ / కంప్యూటర్‌ కొనుగోలు, హెల్త్‌ ఇన్సురెన్స్‌ వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు. 

ఈ ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులు నచ్చిన విద్యాసంస్థల్లో పైచదువులు చదవడానికి  రూ॥ 40 లక్షల వరకు కొలేటరల్‌-రహిత ఎడ్యుకేషనల్‌ లోన్‌ అందించడం జరుగుతుంది. ఇట్టి ప్రోగ్రామ్‌ ద్వారా  ఎడ్యుకేషనల్‌ లోన్‌ సులభమైన పద్దతిలో పొందడం జరుగుతుంది. దీని కోసం ఎలాంటి ఆర్థిక పత్రాలు అవసరం లేదు. ఇట్టి ఎడ్యుకేషనల్‌ లోన్‌ ద్వారా ఇచ్చే ఋణానికి వడ్డీ దాదాపు 9 శాతం నుండి 12 శాతం వరకు ఉంటుంది. 

ఈ ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా, విద్యార్థులు కస్టమైజ్డ్‌ రీపేమెంట్‌ ప్లాన్‌లు, ఫ్లెక్సిబుల్‌ టెన్యూర్‌లు మరియు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రయోజనాలను పొందవచ్చు. దీని ద్వారా విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నత చదువులు కొనసాగించవచ్చు. 

➠ IDFC FIRST Bank ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు :

  • భారతదేశం లేదా విదేశాలలో ఉన్నత విద్య చదువుతున్న భారతీయ విద్యార్థులు 
  • విద్యార్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

➠ IDFC FIRST Bank ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ ప్రయోజనాలు :

  • 40 లక్షల వరకు ఋణసదుపాయం అందిస్తారు. 
  • ఎడ్యుకేషన్‌ లోన్‌ యొక్క వడ్డీ 9 శాతంతో ప్రారంభం అవుతుంది. 
  • వేగంగా సులభమైన పద్దతిలో ఋణసదుపాయం కల్పిస్తారు. 
  • మల్టిపుల్‌ రీపేమెంట్‌ సదుపాయం కలదు. 
  • ఎటువంటి దాగిఉన్న నిబంధనలు ఉండవు.
  • ఐటి చట్టంలోని సెక్షన్‌ 80ఈ కింద చెల్లించే వడ్డీకి 100% ఆదాయపు పన్ను ప్రయోజనం

ఈ ఎడ్యుకేషన్‌ లోన్‌ను క్రింది ఖర్చుల కోసం వినియోగించవచ్చు. 

  • ట్యూషన్‌ ఫీజు, 
  • ఎగ్జామ్‌ ఫీజు, 
  • లైబ్రరీ ఫీజు, 
  • లాబోరేటరీ ఫీజు, 
  • యూనిఫామ్స్‌, 
  • బుక్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్స్‌ 
  • హస్టల్‌ ఫీజు, 
  • ప్రయాణ ఖర్చులు, 
  • ల్యాప్‌టాప్‌ / కంప్యూటర్‌ కొనుగోలు, 
  • హెల్త్‌ ఇన్సురెన్స్‌ 

➠ IDFC FIRST Bank ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ కోసం కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • ఇటీవల దిగిన పాస్‌పోర్టు సైజు ఫోటో 
  • అడ్రస్‌ ప్రూఫ్‌ (ఆధార్‌కార్డు / పాస్‌పోర్టు / డ్రైవింగ్‌ లైసెన్స్‌ / ఓటరు గుర్తింపు కార్డు / ఇతరములు 
  • అడ్మిషన్‌ ప్రూఫ్‌ (కాలేజ్‌ ఐడి కార్డు / అడ్మిషన్‌ లెటర్‌/ బోనఫైడ్‌ లెటర్‌)
  • మార్కుల మెమో 
  • ఫీజు నిర్మాణ పత్

➠ ధరఖాస్తు విధానం :

IDFC FIRST Bank ఎడ్యుకేషన్‌ లోన్‌ ప్రోగ్రామ్‌ కోసం ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి 

➠ ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది :

30 జూన్‌ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.

➙ ఆన్‌లైన్‌ ధరఖాస్తు మరియు పూర్తి సమాచారం కోసం  :

ఇక్కడ క్లిక్‌ చేయండి 

Post a Comment

0 Comments