ఇండియా సాంప్రదాయ నృత్యాలు || India Classical Dances in Telugu || Gk in Telugu || Indian Geography in telugu

ఇండియా సాంప్రదాయ నృత్యాలు 

India | Classical Dances in Telugu

Gk in Telugu || General Knowledge in Telugu

indian classical dances in telugu

భరతనాట్యం

  • దృశ్య కళల్లో భరతనాట్యానికి ముఖ్యమైన స్థానం ఉంది.
  • క్రీ.పూ 400 ప్రాంతంలో భరతమహర్షి అయిన నాట్యాచార్యుడు రూపొందించిన నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
  • తంజావూరులోని పొన్నయ్య సోదరులు దీనిని అభివృద్ది చేశారు.
  • శ్రీమతి రుక్మిణీదేవి ఈ నాట్యానికి కొత్త ఊపిరి పోసి గౌరవాన్ని సంపాదించి పెట్టారు. భరతనాట్యం తమిళనాడు రాష్ట్రంలో బాగా ప్రసిద్ది చెందింది.


కూచిపూడి

  • ఆంధ్రప్రదేశ్‌లోని కుచేలపురం అనే గ్రామంలో ఇది ఉద్భవించింది.
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ కూచిపూడి నాట్యానికి ప్రసిద్ది గాంచింది.
  • దీన్ని సాధారణంగా ఒక్కరే అభినయిస్తారు
  • తీర్ధ నారాయణ, సిద్దేంద్రయోగి దీన్ని అభివృద్ది పరిచారు.


కథక్‌

  • కథక్‌ అనే పదం కథ అనే పదం నుండి ఆవిర్భవించింది.
  • ఈ కథక్‌ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు
  • కథక్‌ ఉత్తర భారతదేశంలో బాగా ప్రసిద్ది చెందింది.
  • కథక్‌ నృత్యాన్ని ఏకదాటిగా 9 గంటల 20 నిమిషాలు చేసిన వ్యక్తి గోపీకృష్ణ


ఒడిస్సీ

  • ఇది ఒడిసా రాష్ట్రానికి చెందిన నాట్యరూపం
  • ఖారవేలుడు పాలించిన క్రీ.పూ. 2వ శతాబ్దంలో ఈ నాట్యరూపం అభివృద్ది చెందింది.
  • క్రీ.శ 12వ శతాబ్దంలో కృష్ణుడిని స్తుతిస్తూ జయదేవుడు రచించిన గీత గోవిందంలోని అంశాలను ఈ నాట్యరూపంలో ఎక్కువగా ప్రదర్శిస్తారు.


కథాకళి

ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం


మణిపురి

ఇది ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్‌లో బాగా ప్రాచుర్యంలో ఉంది.


మోహినీ అట్టం

ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ది చెందింది.

Post a Comment

0 Comments