
Find Your Stolen Phone: Lock or Erase a Lost Device in Telugu
Gk in Telugu || General Knowledge in Telugu
మన యొక్క మొబైల్ పోగానే ఫోన్ పోయిందన్న బాదకన్న అందులో ఉన్న డెటా కోసం ఎక్కువ గుబులు చెందుతాము. టెక్నాలజీ పెరగడంతో ఇంట్లో కూర్చోనే విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయ సమావేశాలు చేస్తున్నారు. ఇలా మనం చేసే ప్రతి పనిని సెల్‌ఫోన్ నుండే నిర్వహించాల్సి వస్తుంది. 2020 లో వచ్చిన కోవిడ్ - 19 (కరోనా) తర్వాత డేటా వాడకం చాలా రెట్లు పెరిగింది. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరు స్మార్మ్‌ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే మనం ప్రతి రోజు చేసే కార్యకలాపాలు, వ్యాపార సమాచారం, వ్యక్తిగత సమాచారం మొత్తం సాప్ట్ కాపీల రూపంలో ఫోన్‌లోనే భద్రపరుచుకోవాల్సి వస్తుంది. మన దైనందిన జీవితంలో సెల్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అంతటి కీలకమైన ఫోన్ పోతే లేదా చోరీకి గురైతే ఎలా ? అప్పుడు పరిస్థితి ఏంటి ? ఫోన్ పోవడమే కాకుండా అందులో ముఖ్యమైన మన వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురైతే మనకు సంబందించిన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించే సెల్‌ఫోన్ పోయినా / దొంగిలించబడిన సందర్భంలో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పోలీసు డిపార్ట్‌మెంట్ వారు Central Equipment Identity Register (CEIR) అనే వినూత్న సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఈ సీఈఐఆర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన యొక్క సెల్‌ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురికాకుండా చేసుకోవచ్చు. దీనికి సంబందించిన పూర్తి సమాచారం కింద వివరించడం జరిగింది.
➠ నూతన సాంకేతిక పరిజ్ఞానం :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో Central Equipment Identity Register (CEIR) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోగోట్టుకున్న ఫోన్‌ను కనిపెట్టే విధానం అమలులోకి తెచ్చారు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పోగోట్టుకున్న ఫోన్ దొంగిలించిన వ్యక్తి వాడకుండా బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేసిన తర్వాత ఫోన్ పనిచేయకుండా చేయవచ్చు. ఒకవేళ ఫోన్ ఆన్‌చేసి అందులో కొత్త సిమ్‌కార్డు వేసినా ఈ విషయం ఫోన్ యజమానికి ఎస్‌ఎంఎస్ వస్తుంది. దీంతో సులువుగా ఫోన్ లోకేషన్ కనిపెట్టవచ్చు.

➠ ఈ సాంకేతి పరిజ్ఞానం ఎలా పనిచేస్తుంది ?
- మన యొక్క సెల్‌ఫోన్ పోయినా / దొంగిలించబడిన వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అందులోకి వెళ్లిన తర్వాత Block Stolen / Loss Mobile పై క్లిక్ చేయాలి.

- అందులో మొబైల్ నెంబర్ -1 మరియు మొబైల్ నెంబర్ - 2, ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ - 1, ఐఎంఈఐ నెంబర్ - 2, మన వాడుతున్న సెల్‌ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్వాయిస్ (బిల్) ఫోటోలు అప్‌లోడ్ చేయాలి.
- సెల్‌ఫోన్ పోయిన ప్రదేశం, తేదీ, రాష్ట్రం, జిల్లా, పోలీస్‌స్టేషన్ పరిధి, పోలీస్ ఫిర్యాదు నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. పోలీస్ ఫిర్యాదు కాపీ అఫ్‌లోడ్ చేయాలి.
- తర్వాత సెల్‌ఫోన్ ఓనర్‌కు సంబందించిన వివరాలు అయిన ఓనర్ పేరు ఎంటర్ చేసి ఐడెంటికి ప్రూఫ్ ఎన్నుకొని అఫ్‌లోడ్ చేయాలి. తర్వాత ఐడెంటిటి నెంబర్ ఎంటర్ చేయాలి. తదుపరి క్యాప్చికా ఎంటర్ చేయాలి.
- వెంటనే మీ సెల్‌ఫోన్ (పాత నెంబర్ మీద తీసుకున్న కొత్త సిమ్) నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటిపిపై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఓటిపి వస్తుంది.
- ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
- ఆ తర్వాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతుంది.
- ఇకనుండి అట్టి మొబైల్‌ను ఎవరు ఆపరేట్ చేయలేరు. దానిలోని మన యొక్క వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది. దొంగిలించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్‌లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే మీ యొక్క పాత నెంబర్‌పై తీసుకున్న కొత్త సిమ్‌కు మెస్సెజ్ వస్తుంది.
- మనకు వచ్చిన మెస్సెజ్ ఆధారంగా మనం పోగోట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉన్నా దాన్ని పట్టుకోవడం సులభతరం అవుతుంది.
➠ ఒకవేళ పోయిన / దొంగిలించబడిన ఫోన్ మళ్లీ దొరిగితే ఏం చేయాలి ?
- పోయిన మన యొక్క ఫోన్ పోలీసులు పట్టుకున్నా, లేక మీకే దొరికినా వెంటనే www.ceir.gov.in పోర్టల్‌కు వెళ్లాలి. అందులో Un-Block Found Mobileపై క్లిక్ చేయాలి అందులో మీ పాత ఐడిని, ఫోన్ నెంబర్ ఇతర వివరాలు నింపిన తర్వాత ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.

➠ సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనేప్పుడు ఏం చేయాలి ?
- మీరు తక్కువ ధరలో వస్తుందని సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కొవాల్సి వచ్చినప్పుడు అట్టి ఫోన్ దొంగిలించిందా లేదా బ్లాక్ లిస్టులో ఉందా అన్న విషయాలు తెలుసుకోవాలంటే నో యువర్ మొబైల్ (కెవైఎం) పద్దతి ద్వారా ముందే తెలుసుకునే అవకాశం ఉంది.
- ఇందుకోసం మొబైల్ తీసుకొని నో యువర్ మొబైల్ (కెవైఎం) విధానంలోనూ ఐఎంఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. ఇందుకోసం కేవీఎం అని పెద్ద అక్షరాల్లో టైప్ చేయాలి. అనంతరం 15 అక్షరాల ఐఎంఈఐ నెంబరును టైప్ చేసి 14422కు ఎస్‌ఎంఎస్ పంపాలి.
- ఇందుకోసం కేవైఎం యాప్‌ను ఆండ్రాయిడ్ / ఐఓఎస్ మొబైళ్ల ప్లేస్టోర్లలో నుండి డౌన్‌లోడు చేసుకోవచ్చు. లేదా సీఈఐఆర్ వెబ్ పోర్టల్‌లో ఆఖరుగా ఇచ్చిన ఆప్షన్ ద్వారా కూడా సెల్‌ఫోన్ తనిఖీ చేసుకోవచ్చు.
➠ ఐఎంఈఐ నెంబర్ తెలుసుకోవడం ఎలా ?
- మొబైల్‌లో ఐఎంఈఐ నెంబర్‌ను తెలుసుకోవాలంటే మీ మొబైల్ నుండి *#06# డయల్ చేయగానే మీ మొబైల్ నెంబరుపై దాని ఐఎంఈఐ నెంబర్ కనబడుతుంది.
➠ పోగోట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నెంబర్ తెలుసుకోవడం ఎలా ?
- ఒకవేళ మీరు ఫోన్‌ను పోగోట్టుకుంటే మీరు కొన్న ఫోన్ యొక్క బాక్స్‌పై లేదా ఇన్వాయిస్ బిల్‌పై ఐఎంఈఐ నెంబర్ సాధించవచ్చు.
0 Comments