Gk in Telugu || General Knowledge in Telugu

Australia Continent in Telugu : ఆస్ట్రేలియా అనే ఖండం (Australia Continent) భూమి యొక్క దక్షిణార్థ గోళంలో ఉన్న చిన్న ఖండం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఖండం మరియు భూభాగంలో ఆరవ అతిపెద్ద దేశం. ఆస్ట్రేలియా ఖండం చుట్టూ పశ్చిమాన హిందూ మహాసముద్రం, తూర్పున పసిఫిక్ మహాసముద్రం మరియు దక్షిణాన దక్షిణ మహాసముద్రం ఉన్నాయి. ఇది ఒక ద్వీపఖండం. ఈ ఆస్ట్రేలియా ఖండాన్ని 1788 సంవత్సరంలో జేమ్స్‌కుక్ అనే నావికుడు కనుకొన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా ఖండాన్ని ఒక ద్వీపంగా పరిగణిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా పిలువబడుతుంది. ఆస్ట్రేలియా ఖండానికి అనే విశిష్టలతలు ఉన్నాయి. ప్రపంచంలో మనకు ఎక్కడా కనిపించని కంగారులు ఈ ఆస్ట్రేలియా ఖండంలోనే కనిపిస్తాయి. అందుకే దీనికి కంగారుల దేశంగా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా సీసం ఉత్పత్తి చేసే దేశంగా పేరుగాంచింది. ఇక్కడ కేవలం 6.88 శాతం భూభాగం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ గోదుమలు, బార్లీ, మొక్కజొన్న, నూనె గింజలు, కాఫీ, పొగాకు, వరి విస్తీర్ణంగా పండుతాయి. అత్యధికంగా గోధమలను ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తి ఎగుమతి (ప్రపంచంలోని 3వ వంతు ఉన్ని ఇక్కడి నుండే లభిస్తుంది) లో ప్రథమ స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా ఖండం (Australia Continent) అధికారిక నామం ‘‘ద కామన్వేల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా’’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26 తేదిన ఆస్ట్రేలియా డేగా జరుపుకుంటారు. ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్‌బెర్రా. దీని కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. అత్యధిక జనాభా నివసించే నగరం సిడ్నీ నగరం. ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద శిఖరం ‘‘మౌంట్ మిక్‌లిన్‌టక్ (3,490 మీ)’’. ఆస్ట్రేలియా వ్యాప్తంగా గిబ్బన్, విక్టోరియా, గ్రేట్ సాండీ, దిగ్రేట్ విక్టోరియా ఎడారులు విస్తరించి ఉన్నాయి. కింబర్లీ, పశ్చిమ ఆస్ట్రేలియా ఫీఠభూములున్నాయి. ఆస్ట్రేలియా జనాభాలో అంగ్లీకన్స్ -26.1%, రోమన్ క్యాథలిక్ లు -26%, క్రైస్తవులు -24.3%, ఇతర మతాల వారు -31.6 % ఉన్నారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా మొత్తం 421 విమానాశ్రాయాలున్నాయి. దేశంలో 14 లక్షల కి.మీ రోడ్డు మార్గం, 33,819 కి.మీ రైలుమార్గం, 8,368 కి.మీ జలమార్గం ఉంది.
ఆస్ట్రేలియా దాదాపు 7.7 మిలియన్ చ.కి.మీలలో విస్తరించి ఉంది. దీనికి దక్షిణంగా టాస్మానియా ద్వీపకం ఉంది. ఈ రెండిటిని బాస్ జలసంధి వేరుచేస్తుంది. ఆస్ట్రేలియా ఖండంలో మొత్తం 8 రాజకీయ విభాగాలు ఉన్నాయి. 1) న్యూ సౌత్ వేల్స్ 2) ఉత్తర ప్రాంతాలు 3) క్వీన్స్‌ల్యాండ్ 4) దక్షిణ ఆస్ట్రేలియా 5) టాస్మానియా 6) విక్టోరియా 7) పశ్చిమ ఆస్ట్రేలియా 8) బ్రెస్‌బేన్ లు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపొడవైన ప్రవాళ అవరోధగా పిలువబడే గ్రేట్ బేరియర్ రీఫ్ ఆస్ట్రేలియాకు తూర్పుతీరాన నెలవై ఉంది.
ఆస్ట్రేలియా ఖండాన్ని మూడు భౌతిక ప్రాంతాలుగా విభజించవచ్చు 1) తూర్పు ఉన్నత ప్రాంతం 2) మద్యమైదాన ప్రాంతం 3) పశ్చిమ ఫీఠభూమి ప్రాంతాలు వేరు చేయవచ్చు.
1) తూర్పు ఉన్నత ప్రాంతం :
ఇక్కడ గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే పర్వత శ్రేణి నెలవై ఉంది. అంతేకాకుండా కోషియాస్కో శిఖరం, గ్రేట్ డివైడింగ్ రేంజ్‌లున్నాయి. ఈ ప్రాంతంలోనే 2500 కి.మీ పొడవైన ముర్రే నది ప్రవహిస్తుంది. ఇది అడిలైడ్ నగరానికి సమీపంలో ప్రవహించి దక్షిణ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ ముర్రె నదికి ముర్రం బిడ్జ్, లాచియన్, డార్లింగ్ అనే ఉపనదులున్నాయి.
2) మద్యమైదాన ప్రాంతం :
ఇది పూర్తి మైదానాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇక్కడ వర్షపాతం అనేది తక్కువగా నమోదు అవుతుంది. ఈ ప్రాంతంలో ఐర్, టోరెన్స్ అనే ఉప్పునీటి సరస్సులు సముద్ర మట్టాని కంటే కింద ఉంటాయి.
3) పశ్చిమ ఫీఠభూమి ప్రాంతం :
ఇక్కడ వర్షాలు కురవకపోవడంతో ఇది ఎడారి ప్రాంతంగా ఉంటుంది.
➠ ఆస్ట్రేలియా ఖండం శీతోష్ణస్థితి :
మకరరేఖకు ఇరువైపుల ఆస్ట్రేలియా ఖండం(Australia Continent) విస్తరించి ఉండడంతో మే నెల నుండి అక్టోబర్ నెల వరకు శీతాకాలంగా, నవంబర్ నెల నుండి ఏప్రిల్ నెల వరకు వేసవి కాలం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు మనకు మే నెలల ఉంటే ఇక్కడ మాత్రం జనవరిలో నమోదు అవుతాయి. అలాగే ఇండియాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు డిసెంబర్‌లో నమోదు అవుతే ఇక్కడ మాత్రము జూలైలో నమోదు అవుతాయి. ఆస్ట్రేలియా ఖండంలోని పశ్చిమ సమశీతోష్ణ మండల గడ్డి మైదానాలను ‘‘డౌన్స్’’ అని పిలుస్తారు. మధ్య మైదాన ప్రాంతంలో పశువుల గుంపులను ‘‘రాంచ్’’ లు అని అంటారు. సతతహరిత అరణ్యాలు ఆస్ట్రేలియా తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో కనిపిస్తాయి.. ఇక్కడ యుకలిప్టస్ జాతికి చెందిన 500 రకాల చెట్లు ఉన్నాయి. ఈ అరణ్యాలలో జర్రా, కర్రి, వాటిల్ వంటి కలపనిచ్చే చెట్లు అధికంగా కనిపిస్తాయి. ఆస్ట్రేలియా తృణ భూముల్లో ఉష్ణమండల తృణ భూములను "సవన్నాలు" అని, ఉప ఉష్ణమండల తృణ భూములను "డౌన్"లు అని పిలుస్తారు.
➠ అటవీ జంతు సంపద :
ఆస్ట్రేలియాలో అడవులలో దాదాపు 400 రకాల జంతు రకాలు, 700 రకాల పక్షులతో నిండి ఉంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించని కంగారులు ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఇక్కడి పక్షుల్లో ఈము, కూక బుర్రాలైప్ అనేవి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
➠ ఖనిజ సంపద :
ఆస్ట్రేలియా ఖండంలో ముఖ్యంగా బొగ్గు, బంగారం, వెండి, యురేనియం, వజ్రాలు, నికేల్, చమురు, సహజవాయువు, ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, తగరం, సీసం నిక్షేపాలు ఉన్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలో కాల్ గూర్లి, కూల్ గార్డీ, మార్గరేట్ ప్రాంతంలో బంగారు గనులున్నాయి. టాస్మానియా, మౌంట్ లయల్ వద్ద రాగి, తగరం నిక్షేపాలున్నాయి. ఇక్కడ సీపం నిక్షేపాలు అధికంగా కనిపిస్తాయి. అందువల్ల ప్రపంచంలో సీసం ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. యశదపు ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది. ఆస్ట్రేలియా ఖండంలో 90 శాతానికి పైగా ప్రాంతాలు సముద్ర తీరాలకు దగ్గరగా ఉంటాయి. ఆస్ట్రేలియా ఖండం పరిమాణం కంటే ఇక్కడ నివసించే జనాభా తక్కువగా ఉండడంతో ఈ ఖండాన్ని ‘‘నిర్జన ఖండం ’’ అంటారు.
Australia Continent in Telugu : ఆస్ట్రేలియా ఖండాన్ని నిర్జన ఖండము, సజీవ శిలాజ భూమి, లాండ్ ఆఫ్ గోల్డేన్ ప్లీస్ అనే పేర్లతో పిలుస్తారు. వైశాల్యంలో ఖండాలన్నింటిలో అతిచిన్న ఖండం. ఆస్ట్రేలియా ఖండాన్ని మకరరేఖ ఇంచుమించు రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ ఖండము పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉన్నది. ఆస్ట్రేలియా ఖండానికి దక్షిణ భాగాన టాస్మాలియ అనే ద్వీపం కలదు. ఈ ద్వీపాన్ని విడదీస్తూ "బాస్ జలసంధి" కలదు. ఆస్ట్రేలియాకు ఉత్తరాన న్యూగినియా ద్వీపం కలదు. ఈ రెండిటిని వేరు చేస్తూ "టోర్రస్" జలసంధి కలదు.ఆస్ట్రేలియాలో పశ్చిమ ఆస్ట్రేలియా, ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్, న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా, టాస్మానియా వంటి ప్రధాన రాష్ట్రాలు కలవు.
➠ ఆస్ట్రేలియా ఖండం యొక్క విశేషాలు - Australia Continent in Telugu :
- ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ ఉన్ని ఉత్పత్తి చేసే దేశం ఆస్ట్రేలియా
- ప్రపంచంలో మొట్టమొదటి సారిగా రహస్య ఓటింగ్ విధానం ప్రవేశపెట్టిన దేశం
- ఇక్కడ వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు.
- ఇక్కడ భూకంపాలు రావు
- వైశాల్యంలో ప్రపంచంలో అతిపెద్ద పట్టణం అయిన మౌంట్ ఈసా ఆస్ట్రేలియాలో కలదు.
- ఆస్ట్రేలియా దేశం జాతీయ చిహ్నం కంగారు.
- ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లను కలిపి ఆస్ట్రలేసియా అని పిలుస్తారు.
- ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ గడ్డిభూములను డౌనులు అని పిలుస్తారు.
- ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఓటుహక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఖండంలోనిదే.
ఆస్ట్రేలియన్ ఖండం యొక్క భౌగోళికం వైవిధ్యమైనది, పర్వతాలు, ఎడారులు, అడవులు మరియు బీచ్‌లతో సహా అనేక రకాల ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. గ్రేట్ బారియర్ రీఫ్, ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ, ఆస్ట్రేలియా తీరంలో ఉంది.
ఆస్ట్రేలియాలో దాదాపు 25 మిలియన్ల మంది జనాభా ఉన్నారు, ఎక్కువ మంది తూర్పు మరియు ఆగ్నేయ తీరాల వెంబడి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. దేశానికి గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉంది, 60,000 సంవత్సరాలకు పైగా ఖండంలో నివసిస్తున్న స్థానిక ఆస్ట్రేలియన్లు మరియు ప్రపంచం నలుమూలల నుండి వలస వచ్చిన విభిన్న రకాల జనాభా నివసిస్తుంది.
ఆస్ట్రేలియా ఖండంలోని దేశాలు, రాజధానులు, కరెన్సీ వివరాలు | ||
---|---|---|
దేశం | రాజధాని | కరెన్సీ |
ఆస్ట్రేలియా | కాన్‌బెర్రా | ఆస్ట్రేలియన్ డాలర్ |
న్యూజిలాండ్ | వెల్లింగ్టన్ | న్యూజిలాండ్ డాలర్ |
నౌరు | యారెన్ | ఆస్ట్రేలియాన్ డాలర్ |
పలావు | ఎన్జెర్లుమడ్ | యుఎస్ డాలర్ |
మైక్రోనేషియా | పాలికీర్ | యుఎస్ డాలర్ |
మార్షల్ దీవులు | మజురో | యుఎస్ డాలర్ |
కిరిబాటి (గిల్బర్ట్ దీవులు) | తరవా | ఆస్ట్రేలియన్ డాలర్ |
ఫిజీ | సువా | ఫిజియన్ డాలర్ |
పాపువాన్యూగినియా | పోర్ట్‌మోరెస్బీ | కినా |
వనాటు | పోర్ట్‌విలా | వనౌటు వాటు |
సోలమన్‌దీవులు | హోనియారా | సోలమన్‌దీవులు |
0 Comments