
మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్
ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్‌లో వీడియోలు చేసేవారు, స్టోరీస్, రీల్స్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం ఒక వీడియోను క్రియేట్ చేసేటప్పుడు చాలా రకాల వీడియోలు, ఫోటోలు అవసరమవుతుంటాయి. అందుకోసం గూగుల్‌లో వెతికి డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. అలాంటప్పుడు మనం వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలన్న, వాటర్ మార్క్ ఉన్న వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్ చాలాబాగా ఉపయోగిపడుతుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా వీడియోలను ఎలాంటి వాటర్‌మార్క్ లేకుండా డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు.
➙ 12ft.io
మనం కొన్ని వెబ్‌సైట్‌లలో ఆర్టికల్స్ చదివేటప్పుడు రెండు లేదా మూడు లైన్‌లు మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. మిగతా ఆర్టికల్స్ చదవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ యొక్క వెబ్‌సైట్ మనకు పనిచేస్తుంది. ఇందులో మనం చదవాలనుకునే ఆర్టికల్ యొక్క యుఆర్‌ఎల్ ఇందులో పేస్ట్ చేసిన వెంటనే ఆర్టికల్ యొక్క పూర్తి సమాచారం మనకు చూపించడం జరుగుతుంది ఉచితంగా.
➙ Flamcard App
మన మొబైల్‌లో ఉన్న మన యొక్క వ్యక్తిగత వీడియోలు ఇతరులకు పంపించినప్పుడు వారు మాత్రమే చూడాలి, ఇతరులు ఎవరు ఓపేన్ చేసిన అట్టి వీడియోను చూడకుండా చేయాలనే సందర్భంలో ఈ యొక్క యాప్ చాలాబాగా పనిచేస్తుంది. ప్లామ్ కార్డు యాప్‌ను ప్లేస్టోర్ నుండి మీ యొక్క మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అందులో ఆర్డర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో డిజిటల్ ప్లామ్ కార్డు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్‌లో 100 ఎంబి కన్న తక్కువగా ఉండే ఏ వీడియో అయినా అప్‌లోడ్ చేసి క్రియోట్ ప్లామ్ కార్డుపై క్లిక్ చేయాలి. తర్వాత షేర్ ఆప్షన్ ద్వారా ఇతరులకు షేర్ చేయాలి. అవతలి వ్యక్తికి మనం షేర్ చేసిన లింక్ ఓపేన్ చేయగానే వారికి కేవలం ఇమేజ్ మాత్రమే చూపిస్తుంది. అందులో ఉన్న వీడియో ఓపేన్ కావలంటే అవతలి వ్యక్తి ప్లామ్ ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని స్కాన్‌ఫర్ ఫ్లామ్కార్డ్‌పై క్లిక్ అట్టి ఇమేజ్ స్కాన్ చేసిన వెంటనే వీడియో ప్లే కావడం జరుగుతుంది. ఇది మన వ్యక్తిగత వీడియోలకు భంగం వాటిల్లకుండా చేస్తుంది.
➙ ఎస్‌ఎంఎస్ ద్వారా స్పామ్ కాల్స్ ఆపవచ్చు
మీకు తెలియని నెంబర్ల నుండి మాటిమాటికి స్పామ్ కాల్స్ వస్తుంటే అటువంటి స్పామ్ కాల్స్ రాకుండా ఉండా ఉండాలంటే మీ యొక్క మొబైల్ నుండి stop 0(జీరో) అని టైప్ చేసి 1909 ఎస్‌ఎంఎస్ చేయాలి. దీంతో స్పామ్ కాల్స్ రావడం ఆగిపోతుంది.
0 Comments