Medhaavi Engineering Scholarship Program 2023-24 in telugu || How to apply, Eligibility, Last date Medhaavi Engineering Scholarship Program || Engineering Scholarships

Medhaavi Engineering Scholarship Program 2023-24 in telugu

మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24 
Medhaavi Engineering Scholarship Program 

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL)  తమ యొక్క సిఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) లో భాగంగా మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24 ద్వారా అర్హులైన ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించడానికి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా భారతదేశంలోని 20 ఎన్‌ఐటిలలో ఇంజనీరింగ్‌ కోర్సులను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించడం ద్వారా వారి ఉన్నత చదువులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ పొందడం ద్వారా నిరుపేద ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఆటంకాలు లేకుండా పై చదువులు చదువుకునే వీలుకల్గుతుంది. 

మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24ను దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఎంపికైన ఇంజనీరింగ్‌ విద్యార్థులు 50 వేల వరకు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌ కొరకు 07 జూన్‌ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఏకమొత్తంలో 50 వేల రూపాయలు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. 

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL) 

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL) అనేది భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని దిగువ చమురు ఉత్పత్తిదారుగా, BPCL బినా, కొచ్చి మరియు ముంబైలలో ఉన్న మూడు రిఫైనరీలను కల్గి ఉంది. 

వరంగల్‌, జైపూర్‌, తిరుచ్చి, కాలికట్‌, సూరత్‌, నాగ్‌పూర్‌, కురుక్షేత్ర, అలహాబాద్‌, సూరత్కల్‌, జలంధర్‌, పాట్నా, గోవా, భోపాల్‌, జంషెడ్‌పూర్‌, రాయ్‌పూర్‌, రూర్కెలా, దుర్గాపూర్‌, సిల్చార్‌, మేఘాలయ, అగర్తల లలలోని ఎన్‌ఐటిలలో ఒకటవ, రెండవ, మూడవ సంవత్సరం చదివే ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కు ధరఖాస్తు చేసుకోవాలంటే ఇంటర్మిడియట్‌లో 55 శాతం మార్కులు సాధించి, 8 లక్షల వార్షిక ఆదాయం మించకుండా ఉండాలి. వేరేమార్గాలలో స్కాలర్‌షిప్‌ లబ్ది పొందేవారు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24 యొక్క ధరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఎంపిక విధానం, కావాల్సిన ధృవీకరణ పత్రాలు వంటి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. 

మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌

➥ మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24 కావాల్సిన అర్హతలు :

  • ఒకటవ, రెండవ, మూడవ సంవత్సరం చదివే ఇంజనీరింగ్‌ విద్యార్థులు 
  • కింద తెలిపిన 20 ఎన్‌ఐటిలలో ఏదో ఒకదానిలో 2023-2024 అకడమిక్‌ ఇయర్‌లో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

  1. NIT Warangal
  2. MNIT Jaipur
  3. NIT Trichy
  4. NIT Calicut
  5. SVNIT Surat
  6. VNIT Nagpur
  7. NIT Kurukshetra
  8. MNIT Allahabad
  9. NIT Surathkal
  10. NIT Jalandhar
  11. NIT Patna
  12. NIT Goa
  13. MANIT Bhopal
  14. NIT Jamshedpur
  15. NIT Raipur
  16. NIT Rourkela
  17. NIT Durgapur
  18. NIT Silchar
  19. NIT Meghalaya
  20. NIT Agartala
  • ఇంటర్మిడియట్‌లో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
  • కుటుంబ వార్షికాదాయం 8 లక్షలకు మించరాదు. 

➥ అర్హులు కాని వారు :

  • BPCL, BUDDY4STUDDY ఉద్యోగస్తుల పిల్లలు 
  • ఇతర మార్గాల ద్వారా స్కాలర్‌షిప్‌ పొందే విద్యార్థులు 

➥ ఎవరికి ప్రధాన్యత ఉంటుంది :

  • ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / మహిళా విద్యార్థులు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 

➥ స్కాలర్‌షిప్‌ అవార్డు మొత్తం :

  • 50,000 రూపాయలు ఏకమొత్తంలో అందిస్తారు. 

➥ మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24 కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • 12వ తరగతి మార్కుల మెమో 
  • ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్‌ / ఓటర్‌ కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్స్‌ / పాన్‌కార్డు మొ॥) 
  • ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్‌ రుజువు (ఫీజు రశీదు / అడ్మిషన్‌ లెటర్‌ / కాలేజీ ఐడి కార్డు / బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ ) 
  • కాలేజి యాజమాన్యం ధృవీకరించిన లెటర్‌ 
  • ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / సర్టిఫికేట్‌ (అర్హులు అయితే) 
  • ఆదాయ ధృవీకరణ పత్రము 
  • వికలాంగుల సర్టిఫికేట్‌ (వికలాంగులు అయితే) 
  • బ్యాంక్‌ పాస్‌బుక్‌ / క్యాన్సల్‌ చెక్కు 
  • ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫోటో 

➥ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి 

➥ ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది :

  • 07 జూన్‌ 2023 లో ధరఖాస్తు చేసుకోవాలి 

➥ ఎంపిక విధానం :

ప్రతిభ ఆధారంగా 

➥ మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలి :

1) తమ రిజిస్ట్రేషన్‌ ఐడితో Buddy4Study లోకి లాగిన్‌ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్‌ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్‌ బటన్‌ నొక్కి ఈమేయిల్‌/మోబ్కెల్‌/ఫేస్‌బుక్‌/జిమేయిట్‌ అకౌంట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.)

2) లాగిన్‌ అయిన తర్వాత మీరు మేధావి ఇంజనీరింగ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ అప్టికేషన్‌కు రిడ్కెరెక్ట్‌ అవుతారు.

3) తర్వాత స్టార్ట్‌ అప్లికేషన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. (స్టార్ట్‌ అప్లికేషన్‌ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి) 

4) ఆన్‌ల్కెన్‌ స్కాలర్‌షిప్‌ అప్లికేషన్‌ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి

5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్‌ చేయాలి

6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి 

7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్‌ బటన్‌ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది. 

Post a Comment

0 Comments