
IET India Scholarship Awards 2023 in Telugu
Scholarships in Telugu || Engineering Scholarships
Institute of Engineering and Technology (IET) అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులలోని సృజనాత్మకత, ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాలు మరియు వారిలోని నైపుణ్యాలకు నగదు రూపంలో పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే టెస్టు, ప్రెజెంటేషన్. గ్రూప్ డిస్కషన్ ద్వారా విద్యార్థులు IET ఇండియా స్కాలర్‌షిప్ నగదు పురస్కారం కొరకు ఎంపిక చేయబడతారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు మరియు ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లు కలిపి 10 లక్షల వరకు విలువైన స్కాలర్‌షిప్ అవార్డు అందిస్తారు.
IET ఇండియా స్కాలర్‌షిప్ అవార్డు కోసం నాలుగు లెవెల్స్‌లో 5 రిజనల్ రౌండ్లలో పోటీ నిర్వహించి తుదిదశలో ఇండియా వ్యాప్తంగా ఒకరిని ఎంపిక చేయడం ద్వారా 3 లక్షల అవార్డు తో పాటు సర్టిఫికేట్, ఐఈటి సభ్యత్వం అందిస్తారు. అంతేకాకుండా రన్నరప్‌లకు కూడా నగదు అవార్డుతో పాటు సర్టిఫికేట్, ఐఈటి సభ్యత్వం అందజేస్తారు.
మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడానికి పరిశ్రమ, విద్యాసంస్థలు మరియు ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసే ఇంజనీర్‌ల కోసం ఐఈటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ సొసైటీలలో ఒకటి. శ్రీ రతన్ టాటా (మాజీ ఛైర్మన్, టాటా సన్స్), నారాయణ మూర్తి (ఛైర్మన్ ఎమిరిటస్, ఇన్ఫోసిస్) మరియు రామచంద్రన్ (ప్రెసిడెంట్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ మరియు మాజీ రెసిడెంట్ డైరెక్టర్, వోడాఫోన్) వంటి ప్రముఖ ఇంజనీర్లు ఐఈటి యొక్క గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఈ ఐఈటి ఇండియా స్కాలర్‌షిప్ కొరకు ఎవరు ధరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు అవుతారు, ఎలా ధరఖాస్తు చేసుకోవాలి, నగదు అవార్డు, ఎంపిక విధానం మరియు అన్ని రకాల సందేహాల నివృతి కింద ఇవ్వడం జరిగింది.
ఐఈటి ఇండియా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
➦ IET ఇండియా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ధరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు :
ప్రాంతీయ రౌండ్ ఎంపిక కోసం
- మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం గ్రాడ్యువేట్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు
- యుజిసి / ఏఐసిటిఈ గుర్తింపు పొంది ఉండాలి
- అన్ని సబ్జెక్టులు ఒకే ప్రయత్నంలో పాసై ఉండాలి.
- ఇప్పటి వరకు జరిగిన సెమిస్టర్‌లలో కనీసం 60% లేదా 10-పాయింట్ స్కేల్‌లో కనీసం 6 లేదా అంతకంటే ఎక్కువగా సిజిపిఏ సాధించి ఉండాలి.
- దరఖాస్తుదారు 12వ తరగతిలో 60% కంటే ఎక్కువ మార్కులు లేదా ఒకే విధమైన గ్రేడ్‌లు సాధించి ఉండాలి.
- ఆన్‌లైన్ విధానం
- ఆన్‌లైన్ టెస్టు
- రిజనల్ టెస్టు అసెస్‌మెంట్
- నేషనల్ ఫైనల్స్
- టెక్నికల్ నాలేడ్జ్
- నాయకత్వ లక్షణాలు
- ప్రదర్శన నైపుణ్యాలు
- విద్యా నైపుణ్యం
- అదనపు నైపుణ్యాల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
- 03 జూన్ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకునేటప్పుడు ఎలాంటి పత్రాలు అవసరం లేదు
ప్రాంతీయ రౌండ్ ఎంపిక కోసం
- 5 ప్రాంతీయ కేంద్రాలు ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
- ప్రాంతీయ రౌండ్ విజేత 60,000 నగదు + సర్టిఫికేట్ + IET సభ్యత్వం
- ప్రాంతీయ రౌండ్ రన్నరప్ - 40,000 నగదు + సర్టిఫికేట్ + IET సభ్యత్వం
- ప్రాంతీయ రౌండ్‌లలో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయిలో జరిగే ఫైనల్‌లో పోటీపడతారు.
ఫైనల్‌లో పోటీ పడిన వారికి అందజేసే అవార్డులు కింది విధంగా ఉంటాయి. | |
---|---|
ఫైనల్ విజేత | రూ॥ 3,00,000 నగదు + సర్టిఫికేట్ + IET సభ్యత్వం |
1వ రన్నరప్ | రూ॥ 1,70,000 నగదు + సర్టిఫికేట్ + IET సభ్యత్వం |
2వ రన్నరప్ | రూ॥ 1,50,000 నగదు + సర్టిఫికేట్ + IET సభ్యత్వం |
నోట్ - ఒక విద్యార్థి ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలో స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నట్లయితే, అతను/ఆమె రెండు స్థాయిలకు సర్టిఫికేట్ మరియు జాతీయ స్థాయికి మాత్రమే ప్రైజ్ మనీకి అర్హులు అవుతారు. |
పేరు | ఐఈటి ఇండియా స్కాలర్‌షిప్ అవార్డు 2023 |
సంస్థ | ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ |
ఎవరి కోసం | అండర్ గ్రాడ్యువేట్ ఇంజనీరింగ్ విద్యార్థులు |
దేశం | ఇండియా |
ఎడిషన్ | 5వ |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
చివరి తేది. | 03 జూన్ 2023 |
పూర్తి సమాచారం కోసం | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తు కొరకు | Click Here |
0 Comments